అన్వేషించండి

Hyderabad Crime : హైదరాబాద్ లో యువతి మిస్సింగ్ విషాదాంతం,పెళ్లికి నిరాకరించిందని ప్రియుడే ఘాతుకం

Hyderabad Crime : హైదరాబాద్ లో మిస్సైన యువతి వనపర్తిలో విగతజీవిగా దొరికింది. ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడే యువతిని హత్య చేశాడు.


Hyderabad Crime : హైదరాబాద్‌ కాటేదాన్ లో అదృశ్యమైన యువతి సాయిప్రియ ఘటన విషాదాంతం అయింది. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడే ఆమెను దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. మాట్లాడాదామని సాయి ప్రియను తీసుకెళ్లిన శ్రీశైలం హత్య చేసి పరారయ్యాడు. కాటేదాన్‌లోని టీఎన్జీవోస్ కాలనీలో ఉంటున్న సాయిప్రియ సెప్టెంబర్ 5న కాలేజికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. అలా బయటకు వెళ్లిన సాయి ప్రియ ఇంటికి ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయిప్రియ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సాయిప్రియ మాజీ ప్రియుడు శ్రీశైలంపై అనుమానంతో కేసు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో శ్రీశైలం యువతిని హత్య చేసినట్లు గుర్తించారు. 

పెళ్లికి నిరాకరించడంతో 

సాయిప్రియ పెళ్లికి నిరాకరించిందని కక్ష పెంచుకున్నాడు శ్రీశైలం. తన మాట వినడంలేదని దారుణానికి ఒడిగట్టాడు. సాయిప్రియతో ఒకసారి మాట్లాడుకుందాం అని బయటకు పిలిచాడు. ఆ మాటలు నమ్మిన యువతి అతడితో బయటకు వెళ్లింది. ఆమె ముందు పెళ్లి ప్రస్తవన మళ్లీ తెచ్చాడు శ్రీశైలం అందుకు ఆమె నిరాకరించడంతో చున్నీతో గొంతు నులిమి సాయి ప్రియను హత్య చేశాడు. ఆ తర్వాత మరో వ్యక్తి సాయంతో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టేశాడు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం మానాజీపేట గ్రామంలో యువతి మృతదేహం దొరికిందని పోలీసులు తెలిపారు.  

అలా మొదలైంది

మానాజీపేటకు చెందిన అంజన్న శంషాబాద్ సమీపంలో కుటుంబంతో ఉంటున్నాడు. అంజన్న చిన్న కుమారుడు శ్రీశైలానికి స్నేహితుల ద్వారా హైదరాబాద్‌లో కాటేదాన్‌కు చెందిన సాయిప్రియ (20)తో పరిచయం ఏర్పడింది. అయితే పరిచయం ప్రేమగా మారింది. వారి ప్రేమ విషయాన్ని శ్రీశైలం ఇరు కుటుంబ సభ్యులకు చెప్పాడు. సాయి ప్రియ కుటుంబ సభ్యులు వారి ప్రేమకు అంగీకరించలేదు. తల్లిదండ్రులు నో చెప్పడంతో సాయి ప్రియ శ్రీశైలంతో మాట్లాడటం మానేసింది. కరోనా సమయంలో శ్రీశైలం కుటుంబం వారి సొంతూరు మానాజీపేటకు వచ్చేశారు. 

చున్నీతో గొంతు బిగించి హత్య 

 అయితే మూడు నెలల క్రితం సాయిప్రియ, శ్రీశైలం మధ్య మాటలు మొదలయ్యాయి. ఒకసారి కలిసి మాట్లాడుకుందామని చెప్పడంతో ఈ నెల 5న సాయిప్రియ భూత్పూర్ కు వచ్చింది. అక్కడి నుంచి శ్రీశైలం తమ బైక్ పై మానాజీపేటకు సాయి ప్రియను తీసుకెళ్లాడు. గ్రామంలోని ఓ చోటుకు తీసుకెళ్లి పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. యువతి నిరాకరించడంతో గొడవ జరిగింది. ఆగ్రహంతో శ్రీశైలం సాయిప్రియను చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం శ్రీశైలం తన బంధువు శివతో కలిసి కేఎల్ కాల్వ దగ్గర గొయ్యి తవ్వి  సాయిప్రియ మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు.  బయటకు వెళ్లిన కూతురు ఇంటికి తిరిగి రాకపోయేసరికి సాయి ప్రియ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది.  

Also Read : Gadwal Road Accident: గ‌ద్వాల జిల్లాలో రోడ్డుప్రమాదం - ఇద్దరు అక్కడిక‌క్కడే మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget