Hyderabad News : చిక్కడపల్లిలో తుపాకీతో కాల్చుకుని న్యాయవాది సూసైడ్
Hyderabad News : హైదరాబాద్ చిక్కడపల్లిలో ఓ న్యాయవాది తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్యతో విడాకులు, ఆర్థిక సమస్యలు సూసైడ్ కారణాలు కావొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.
Hyderabad News : భార్యతో విడాకులు, ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఒత్తిడి గురై ఓ న్యాయవాది తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ లింగంపల్లిలో చోటుచేసుకుంది. బాగ్ లింగంపల్లి మానస ఎంక్లెవ్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు న్యాయవాది శివారెడ్డి. ఆయన స్వస్థలం కడప. శివారెడ్డి గత కొన్ని రోజుల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నారు శివారెడ్డి. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడితో శుక్రవారం తన ఇంట్లో రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎయిర్ ఫోర్స్ లో సార్జంట్
కడప జిల్లాకు చెందిన శివారెడ్డి ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ లో సార్జంట్ గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. ఒంటరిగా ఉంటున్న శివారెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో చిక్కడపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆయన మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. సంఘటన స్థలాన్ని క్లూస్ టీమ్ , చిక్కడపల్లి పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యూట్యూబర్ ఆత్మహత్య
హైదరాబాద్ సైదాబాద్‌లో ఓ యూట్యూబర్ తన వీడియోలకు వ్యూస్ రావడంలేదని సూసైడ్ చేసుకున్నాడు. లైవ్‌లో గేమ్స్ ఆడుతూ యూట్యూబ్ లో వీడియోలు పోస్టు చేసేవాడు విద్యార్థి డీనా. అతడు ఐఐటీ గ్వాలియర్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. యూట్యూబ్‌లో తన ఛానల్ కు వ్యూయర్స్ పెరగడంలేదంటూ ఓ వీడియోలో ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ వీడియో పోస్టు చేసిన కొద్దిసేపటికే అతడు బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపటి క్రితం లైవ్ లో గేమ్ ఆడుతూ డీనా తన బాధను చెప్పుకున్నాడు. ఎవరూ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ సూచన కూడా చేశాడు. లైవ్‌లో గేమ్స్ ఆడడంలో దిట్ట అయినా డీనా, యూట్యూబ్‌లో selflo గేమ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాడు.
మానసిక ఒత్తిడితో ఆత్మహత్య