CBI Searches : ఆపరేషన్ మేఘ్ చక్ర పేరుతో సీబీఐ సోదాలు, ఛైల్డ్ పోర్నోగ్రఫీ క్లౌడ్ స్టోరేజీలపై దాడులు
CBI Searches : పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ముఠాలపై సీబీఐ కన్నుపడింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో క్లౌడ్ స్టోరేజీల ద్వారా పోర్నోగ్రఫీ కంటెంట్ పెడ్లర్లపై దాడులు చేసింది.
CBI Searches : పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ముఠాల పనిపట్టేందుకు సీబీఐ దేశవ్యాప్తంగా ఆపరేషన్ మేఘ్ చక్రలో భాగంగా సోదాలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో 56 ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు చేసింది. తెలంగాణలోని హైదరాబాద్, ఏపీలోని కృష్ణ, చిత్తూరు జిల్లాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. న్యూజీలాండ్ ఇంటర్‌పోల్ సమాచారంతో ఈ సోదాలు చేసినట్లు సమాచారం. క్లౌడ్ స్టోరేజి ద్వారా చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ ను నిందితులు అప్లోడ్ చేస్తున్నట్లు సీబీఐ తనిఖీలో తేలింది. ఈ దాడుల్లో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుంది సీబీఐ. సోదాల్లో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.
ఆపరేషన్ మేఘ్ చక్ర
పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ముఠాలు, సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) శనివారం 'ఆపరేషన్ మేఘ్‌చక్ర' చేపట్టింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. దాదాపు 56 చోట్ల దాడులు చేసి చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన ఆడియో, వీడియోలు ప్రసారం చేయడానికి ఉపయోగించే క్లౌడ్ స్టోరేజీలు లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ నిర్వహించారు. ఛైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని, నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నట్లు సీబీఐ అధికారి తెలిపారు.
ఆపరేషన్ కార్బన్ కు కొనసాగింపు
సింగపూర్ ఇంటర్‌పోల్ అందించిన రహస్య సమాచారం ప్రకారం దేశ వ్యాప్తంగా ఆపరేషన్ మేఘ్ చక్ర నిర్వహించామని సీబీఐ తెలిపింది. సీబీఐ గతేడాది ఆపరేషన్ కార్బన్ పేరుతో సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో పిల్లల అశ్లీల వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారని గుర్తించి అరెస్ట్ చేశారు. దీనికి కొనసాగింపుగా ఈ ఏడాది ఆపరేషన్ మేఘ్‌చక్ర నిర్వహిస్తున్నట్లు సీబీఐ తెలిపింది. గత వారం సుప్రీంకోర్టు ఛైల్డ్ పోర్నోగ్రఫీపై విచారించింది. పోర్నోగ్రఫీకి సంబంధించిన కేసులను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన యంత్రాంగాన్ని నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.
Also Read : Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్
Also Read : Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!