X
Super 12 - Match 17 - 25 Oct 2021, Mon up next
AFG
vs
SCO
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Hyderabad Crime: జూబ్లీహిల్స్ లో భారీ చోరీ... రూ. 55 లక్షలతో పరారైన డ్రైవర్... మరో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ భారీ చోరీ జరిగింది. స్థిరాస్తి వ్యాపారి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి రూ.55 లక్షల నగదు, కారుతో పరారయ్యాడు. ఇటీవల జరిగిన మరో చోరీ కేసును పోలీసులు ఛేదించారు.

FOLLOW US: 

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో శనివారం సాయంత్రం భారీ చోరీ జరిగింది. నగరానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి సంతోష్‌రెడ్డి..మరో స్థిరాస్తి వ్యాపారికి ఇవ్వమని చెప్పి డ్రైవర్‌ శ్రీనివాస్‌కు రూ.55 లక్షలు ఇచ్చారు. కానీ శ్రీనివాస్‌ ఆ డబ్బు వ్యాపారికి ఇవ్వకుండా రూ.55 లక్షలు, కారుతో సహా ఉడాయించాడు. సంతోష్‌ ఫోన్‌ చేయగా శ్రీనివాస్‌ ఫోన్‌ స్విచాఫ్‌ అని వస్తోంది. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు.

Also Read: 15 ఏళ్ల బాలికపై 29 మంది అత్యాచారం.. మహారాష్ట్రలో దారుణం..

చోరీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ గచ్చిబౌలి టెలికాం నగర్​లో ఉండే గోవిందరావు అనే వ్యక్తి ఇంట్లో కొన్ని నెలల కిందట ఓ వ్యక్తి పనిలో చేరాడు. కొంత కాలం బాగానే పనిచేశాడు. తర్వాత ఊరికి వెళ్తున్నానని చెప్పి, తాను తిరిగి వచ్చే వరకు తన బంధువులను పనిలో పెడుతున్నారని యజమానికి నమ్మబలికాడు. గోవిందరావు ఓకే చెప్పడంతో అనడంతో అతని బంధువులు లక్ష్మణ్, పవిత్ర దంపతులు నాలుగు నెలలుగా గోవిందరావు ఇంట్లో పనిచేస్తున్నారు. ఊరెళ్లిన వ్యక్తి రాకపోవడంతో వీరినే కొనసాగించారు గోవిందరావు. 

Also Read: ఢిల్లీ రోహిణీ కోర్టులో కాల్పులు.. లాయర్ల వేషధారణలో వచ్చి ఘాతుకం, ముగ్గురు మృతి

నమ్మి పనిస్తే.. చోరీ చేశారు

ఇటీవల గోవిందరావు కుటుంబ సభ్యులతో శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. ఇదే అవకాశంగా భావించిన నేపాల్ దంపతులు ఇంటి కిటీకీ తొలగించి లోపలికి ప్రవేశించారు. బెడ్ రూమ్ తలుపు తొలగించి లాకర్​లో ఉన్న రూ. 10 లక్షలు సొమ్ము, 110 తులాల బంగారంతో పరారయ్యారు. శ్రీశైలంలో ఉన్న గోవిందరావు లక్ష్మణ్​కు ఫోన్​ చేయడంతో అతని ఫోన్​ స్విచాఫ్ వచ్చింది.​దీంతో అనుమానం వ్యక్తం చేసిన యజమాని వెంటనే ఇంటికి వచ్చారు. ఇంట్లో నగదు, బంగారం లేకపోవడం, వాచ్ మెన్ కూడా కనిపించకపోవడంతో దొంగతనం జరిగిందని పోలీసులు ఫిర్యాదు చేశారు. నమ్మకంగా ఇంట్లో పనిచేసిన వ్యక్తులు ఇలా చోరీకి పాల్పడతారని అనుకోలేదని యజమాని ఆవేదన చెందుతున్నారు. 

Also Read: లిక్కర్ తాగించాడు.. చీరతో ఉరేసి చంపాడు.. ఇన్నాళ్లకు చిక్కాడు

చోరీ చేసి నేపాల్ కు పరారీ

ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దొంగలను పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. వీరింతా తరచుగా హైదరాబాద్​లో దోపిడీ చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఇళ్లల్లో పనిచేస్తామంటూ ఎవరైనా వస్తే యజమానులు పూర్తిగా విచారించి పనిలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. చోరీ చేసిన తర్వాత ముఠా సభ్యులంతా సమంగా పంచుకుంటారు. బంగారు ఆభరణాలను ముక్కలుగా చేసుకుని పంచుకుంటారు. ఎవరి దారిన వాళ్లు నేపాల్‌కు తిరిగి వెళ్తుంటారు. దొంగిలించిన సొత్తును చాలా తక్కువ ధరకే విక్రయిస్తారు. వీరికి రెండు ఇళ్లు ఉంటాయి. ఒకటి ఊరిలో, మరొకటి ఊరి చివర గుట్టలపై ఉంటుంది. పోలీసులు వస్తున్నట్లు సమాచారం రాగానే గుట్టలపై ఉన్న ఇళ్లకు వెళ్లిపోతుంటారు. అక్కడికి వెళ్లాలంటే 5 గంటల నుంచి 7 గంటల సమయం పడుతుంది. పోలీసుల రాకపోకలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పారిపోతూ ఉంటారు. 

Also Read: వాటర్ డ్రమ్ముల్లో గంజాయి తరలింపు... చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు... రూ.3.5 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: telangana news Hyderabad crime news telangana police Hyderabad News jubilee hills theft

సంబంధిత కథనాలు

Disha Case :   ఎన్‌కౌంటర్‌ కేసులో ముందుగా విచారించొద్దు.. దిశ కమిషన్‌పై కోర్టుకెళ్లిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ !

Disha Case : ఎన్‌కౌంటర్‌ కేసులో ముందుగా విచారించొద్దు.. దిశ కమిషన్‌పై కోర్టుకెళ్లిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ !

Mulugu: ములుగు జిల్లాలో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Mulugu: ములుగు జిల్లాలో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Chittoor: భార్య గొంతు కోసేసిన భర్త.. కాపురానికి రాలేదనే ఆగ్రహంతో ఘాతుకం

Chittoor: భార్య గొంతు కోసేసిన భర్త.. కాపురానికి రాలేదనే ఆగ్రహంతో ఘాతుకం

Honey Trap: న్యూడ్ కాల్స్ చేస్తే 25 వేల జీతం.. అలా చాట్ చేస్తే 15 వేలు.. ఆ జంట దందా బయటపడిందిలా 

Honey Trap: న్యూడ్ కాల్స్ చేస్తే 25 వేల జీతం.. అలా చాట్ చేస్తే 15 వేలు.. ఆ జంట దందా బయటపడిందిలా 

India Vs Pak Match Betting: భారత్-పాక్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్... విశాఖలో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...

India Vs Pak Match Betting: భారత్-పాక్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్... విశాఖలో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Huzurabad KCR : ప్లీనరీ నుంచే కేసీఆర్ హుజురాబాద్ ప్రచారం ! ఎన్నికల సంఘంపై ఆగ్రహం వెనుక అసలు కారణం..

Huzurabad KCR : ప్లీనరీ నుంచే కేసీఆర్ హుజురాబాద్ ప్రచారం ! ఎన్నికల సంఘంపై ఆగ్రహం వెనుక అసలు కారణం..

ICC T20 WC 2021, IND vs PAK: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్‌ ముందు యాంటీ క్లైమాక్స్‌! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?

ICC T20 WC 2021, IND vs PAK: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్‌ ముందు యాంటీ క్లైమాక్స్‌! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?

Chandra Babu: ఏపీలో ఉన్మాది పాలన.. డీజీపీని తొలగించాలి, రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే.. రామ్‌నాథ్‌కు చంద్రబాబు ఫిర్యాదు

Chandra Babu: ఏపీలో ఉన్మాది పాలన.. డీజీపీని తొలగించాలి, రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే.. రామ్‌నాథ్‌కు చంద్రబాబు ఫిర్యాదు

Breaking News Live Updates: ఏపీలోనూ టీఆర్ఎస్ పెట్టాలంటున్నారు, అన్ని వర్గాల్లోని పేదలకూ దళిత బంధులాంటి సాయం: కేసీఆర్

Breaking News Live Updates: ఏపీలోనూ టీఆర్ఎస్ పెట్టాలంటున్నారు, అన్ని వర్గాల్లోని పేదలకూ దళిత బంధులాంటి సాయం: కేసీఆర్