Husband shoots wife: సినిమాల్లో విలన్లను కాల్చినట్లుగా భార్యను కాల్చిపడేశాడు - షూటర్ భర్త - వీడియో
Wife Murder : గ్వాలియర్‌లో పట్టపగలు రోడ్డుపై భార్యను కాల్చి చంపిన భర్త వీడియో వైరల్‌గా మారింది. అతన్ని ఆపడానికి టియర్ గ్యాస్‌ను పోలీసులు ప్రయోగించాల్సి వచ్చింది.

Husband shot on the street in Gwalior: గ్వాలియర్ లోని రూప్ సింగ్ స్టేడియం ఎదుట సడెన్‌గాఓ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన వ్యక్తి.. తన జేబు నుంచి తుపాకీ తీసి.. కారులో కూర్చున్న మహిళపై నాలుగు రౌడ్లు పాయింట్ బ్లాంక్ లో కాల్పులు జరిపారు. అందులో ఉన్న మహిళ పక్కకు ఒరిగిపోయింది. సడెన్ గా చూసిన వారంతా.. వారు ఏమైనా రీల్స్ చేస్తున్నారేమో కానీ అక్కడ జరిగింది నిజమైన హత్య అని తెలిసే సరికి వణికిపోయారు.
కాంట్రాక్టర్ అరవింద్ .తన భార్యతో కలిసి కారులో వెళ్తున్నాడు. హఠాత్తుగా స్టేడియం వద్ద కారు ఆపి భార్య నందిని ముఖంలో 4 నుంచి 5 గుండ్లు కాల్చాడు. అరవింద్ ఆమె శవం ఎదుట కూర్చుని ఎవరూ దగ్గరకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశాడు. ఈ దృశ్యం చూసి రోడ్డు మీద ట్రాఫిక్ ఆగిపోయింది. ప్రజలు భయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేటప్పటికీ వారిపైనా తుపాకీ ఎక్కుపెట్టాడు. వారు టియర్ గ్యాస్ ప్రయోగించి అరవింద్ ను పట్టుకున్నారు. స్థానికులు కూడా అరవింద్‌పై దాడి చేసి కొట్టారు. పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకుని, అరవింద్‌పై కేసు నమోదు చేశారు.
मध्यप्रदेश के ग्वालियर में बीच सड़क पर एक युवक ने शादीशुदा युवती को गोली मार दी. घटना के बाद भी वो बैठा रहा. #Crime #Gwalior pic.twitter.com/j49KkHLQ15
— Deepak Singh (@SinghDeepakUP) September 12, 2025
అరవింద్, నందిని మధ్య సంబంధం చాలా గందరగోళంగా ఉండేది. అరవింద్ , నందిని ఇద్దరికీ రెండో పెళ్లే. అరవింద్ తన మొదటి వివాహం , పిల్లల గురించి దాచి నందినిని ఆర్య సమాజ్ ఆలయంలో వివాహం చేసుకున్నాడు. 2024 నవంబర్‌లో నందిని అరవింద్, అతని స్నేహితురాలు పూజా పరిహార్‌లు ఆమెపై దాడి చేశారని ఫిర్యాదు చేసింది. అరవింద్ ఆమెను కారుతో ఢీకొట్టి చంపడానికి ప్రయత్నించాడని, ఆమెకు వ్యతిరేకంగా AI-జనరేటెడ్ అసభ్య వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వ్యాప్తి చేసి, ఆమె కుటుంబానికి పంపాడని కూడా ఆరోపణలు ఉన్నాయి.
Arvind killed his wife Nandini in the middle of the road in Gwalior for having extra marital affairs and for filing false complaints against him.
— Incognito (@Incognito_qfs) September 13, 2025
Nandini had filed complaint against Arvind for deceiving her into marriage despite having a wife and children which is true.
Nandini… pic.twitter.com/FHh0QwOO9Z
అరవింద్ ఆమెను బెదిరించి విడాకులకు ఒప్పుకోకపోతే చంపుతానని చెప్పాడని నందిని తెలిపింది. 2025 జనవరిలో జైలు నుంచి విడుదలైన అరవింద్‌తో మళ్లీ ఎలాగోలా రాజీ చేసుకున్నప్పటికీ చేసుకున్నప్పటికీ.. అరవింద్ మరొకరితో సన్నిహితంగా ఉండటంతో వివాదాలు మళ్లీ మొదలయ్యాయి. సెప్టెంబర్ 9నే నందిని ఎస్పీ కార్యాలయానికి వెళ్లి, అరవింద్ హెచ్చరిక గురించి ఫిర్యాదు చేసి రక్షణ కోరింది. 2024 నుంచి అరవింద్‌పై ఆరు కేసులు ఉన్నాయని పోలీసుుచెబుతున్నారు. నందిని మాజీ భర్త హత్య కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.





















