Crime News: పిల్లల ముందే ప్రియుడితో తల్లి పాడుపని.. భర్తకు తెలిసి ఇంట్లో సీసీ కెమెరా పెట్టాడు.. ఆ తర్వాత
పిల్లలముందే ఓ తల్లి ప్రియుడితో కలిసి అసభ్యంగా ప్రవర్తిస్తోంది. ఈ విషయం తెలిసిన భర్త ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.
తల్లి అంటే పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ పిల్లలముందే అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వారిని కూడా అందులోకి లాగే ప్రయత్నం చేయకూడదు. కానీ ఓ తల్లి పిల్లల ముందే ..అసభ్యంగా ప్రవర్తించింది. ప్రియుడు పిల్లలతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా.. ఏం అనకుండా సైలెంట్ గా ఉంది. అసలు వివరాల్లోకి వెల్తే..
ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ నివసిస్తోంది. కొంత కాలం క్రితం ఆమెకు వివాహమైంది. భర్త ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వారికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. కొంతకాలం వారి కాపురం సజావుగానే నడిచింది. కొన్ని రోజుల క్రితం మహిళకు క్యాబ్ డ్రైవర్ తో పరిచయమైంది. ఇక అప్పటి నుంచి ఆమెలో మార్పు రావడం ప్రారంభమైంది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కూడా మెుదలైంది. భర్త పని కోసం వెళ్లేవాడు.. ప్రియుడి ఇంటికి వచ్చేవాడు.
భర్త వెళ్లాక.. ఆ మహిళ ప్రియుడిని ఇంటికి పిలుచుకునేది. ఆ సమయంలో పిల్లలు ఇంట్లోనే ఉండేవారు. ఇంటికి వచ్చిన ఆ క్యాబ్ డ్రైవర్, మహిళ అసభ్యంగా ప్రవర్తించేవారు. కొన్ని సమయాల్లో నగ్నంగా వీడియో కాల్స్ కూడా చేసుకునేవారు. ఇదంతా పిల్లల ముందే జరిగేది. ఇవన్నీ చూసి.. వాళ్లు తీవ్రంగా భయపడేవారు. ఇంటికి వచ్చిన క్రమంలో.. పిల్లలతో కూడా క్యాబ్ డ్రైవర్ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. మీ తండ్రిని చంపేస్తామని బెదిరించేవాడు.
కొన్ని రోజులకు ఈ విషయం ఆ మహిళ భర్తకు తెలిసింది. చుట్టు పక్కల వాళ్లు కూడా.. మీరు బయటకు వెళ్లాక ఎవరో వస్తున్నారని చెప్పారు. ఈ మధ్య కాలంలో అతడి భార్య ప్రవర్తనలో మార్పులు రావడం, చుట్టుపక్కల వాళ్లు కూడా చెప్పడం.. తర్వాత.. అసలేం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఇంట్లో సీసీ కెమెరాను పెట్టాడు. క్యాబ్ డ్రైవర్ తో అతడి భార్య చేస్తున్న చేష్టలు చూసి.. భర్త షాక్ అయ్యాడు. ఈ విషయంపై భార్యను నిలదీశాడు. తన దారికి అడ్డు వస్తే.. చంపెస్తానని భార్య బెదిరించింది.
ఇక చేసేదేమీ లేక.. ఆ భర్త.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన భార్య.., ప్రియుడితో కలిసి ఇంట్లో వ్యభిచారం చేస్తుందని చెప్పాడు. పిల్లలతోపాటు తనను కూడా చంపుతామని బెదిరిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చాడు. అతడి భార్య, ప్రియుడి మీద పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Also Read: వాహన రిజిస్ట్రేషన్లనూ వదల్లేదు... నకిలీ బీమా పాలసీలతో ప్రభుత్వ ఆదాయానికి గండి..
Also Read: వివేకా కుమార్తె, అల్లుడితో పాటు సీబీఐపైనా ఆరోపణలు ! హత్య కేసులో సంచలన మలుపులు ఖాయమేనా ?