By: ABP Desam | Updated at : 17 Apr 2022 12:37 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య సంచలనం సృష్టించింది. కూతురు చేసుకున్న కులాంతర వివాహం నచ్చక కక్ష పెంచుకున్న తండ్రి.. అల్లుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరికి చెందిన భార్గవి అనే యువతిని రామకృష్ణ అనే యువకుడు 2020లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి కక్ష పెంచుకున్న యువతి తండ్రి పక్కా ప్లాన్‌తో హత్య చేయించాడు.
రెండు రోజుల క్రితమే రామకృష్ణను ట్రాప్ చేసి, మాయ మాటలు చెప్పి హైదరాబాద్‌కు పిలిపించాడు. అనంతరం కిరాతకంగా హత్య చేసి, సిద్దిపేట జిల్లాలో మృత దేహాన్ని పడేసి వచ్చినట్లు సమాచారం. అదృశ్యమైన హోంగార్డు రామకృష్ణ మృతదేహాన్ని సిద్దిపేట వద్ద పోలీసులు గుర్తించారు. రామకృష్ణ మృతదేహాన్ని పోలీసులు శవ పరీక్ష కోసం ప్రభుత్వ హాస్పిటల్‌లోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని కోసం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నల్గొండ జిల్లా వలిగొండ మండలంలోని లింగరాజు పల్లికి చెందిన రామకృష్ణ గౌడ్ గతంలో హోం గార్డుగా పని చేసేవాడు. ఇతను హోంగార్డుగా పని చేసే సమయంలో యాదాద్రికి చెందిన భార్గవి అనే యువతిని 2020 ఆగస్టు 16వ తేదీన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల పాటు లింగరాజు పల్లిలో వీరు కాపురం చేశారు. ఆ తర్వాత భార్గవి గర్భవతి అయింది. ఆ తర్వాత నివాసాన్ని భువనగిరి పట్టణానికి మార్చారు. 6 నెలల కిందే వీరికి ఒక పాప కూడా పుట్టింది. అదే సమయంలో రామకృష్ణ గౌడ్ తుర్కపల్లిలో గుప్త నిధుల తవ్వకాల వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఉద్యోగం పోవడంతో రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు.
ఈ క్రమంలోనే ఈ నెల 15న బయటికి వెళ్లిన రామకృష్ణ గౌడ్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన అతని భార్య భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే రామకృష్ణ మృతదేహాన్ని పోలీసులు సిద్దిపేట వద్ద గుర్తించారు. రామకృష్ణ మామనే కిడ్నాప్ చేసి హత్య చేయించినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
కూతురిని తనకు కాకుండా చేశాడని..
రామకృష్ణ భార్య భార్గవి తండ్రి పల్లెపాటి వెంకటేశ్ ఓ వీఆర్‌వో. ప్రస్తుతం యాదాద్రిలోనే ఉంటున్నాడు. అయితే తన కూతురుని తనకు కాకుండా చేశాడని రామకృష్ణపై అతడు పగ పెంచుకున్నా. ఈ నేపథ్యంలోనే పలుమార్లు అల్లుడు కూతురిపై దాడులకు కూడా తెగబడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే రామకృష్ణను అంతమొందించేందుకు మామ వెంకటేశ్, లతీఫ్ అనే రౌడీ షీటర్ కు సుపారీ ఇచ్చినట్లు సమాచారం. అతడితో మాట్లాడి రియల్ ఎస్టేట్ వ్యవహారమని రప్పించి హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ హత్యలో లతీఫ్‌తో పాటు ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Hyderabad Crime: ప్రేమ కథ విషాదాంతం - ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య
Maharashtra Hospital: ఒకే ఆస్పత్రిలో ఒకే రోజులో 24 మంది మృతి - నాందేడ్‌లో తీవ్ర విషాదం!
Medipally: ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన జిమ్ ట్రైనర్-పోక్సో కేసు నమోదు
Tirupati Boy Kidnap: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్ - సీసీ ఫుటేజ్‌లో కీలక విషయాలు
UKG Student Died: పలకతో కొట్టిన టీచర్, యూకేజీ విద్యార్థి మృతి
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
/body>