Drugs Case : వీళ్లు సమాజంలో ప్రముఖ వ్యాపారవేత్తలు..కానీ డ్రగ్స్‌కు బానిసలు ! టోనీ గ్యాంగ్ కేసులో కీలక విషయాలు..
హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన వారు వ్యాపారవర్గాల్లో అత్యంత ప్రముఖులు. డ్రగ్స్‌కు బానిసలై పోలీసులకు చిక్కారు. టోనీ గ్యాంగ్ ఆట కట్టించడంతో వారి గుట్టు కూడా బయటపడింది.
అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్‌లో వారి నుంచి డ్రగ్స్ కొంటున్న వారినీ రిమాండ్‌కు తరలించారు. వీరిలో ఏడుగురు వందల కోట్ల టర్నోవర్‌తో వ్యాపారం చేస్తున్న ప్రముఖులు కావడం పోలీసుల్నిసైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా వారు సాగించిన డ్రగ్స్ లావాదేవీలను ఆధారాలతో సహా పోలీసులు కోర్టు ముందు ఉంచారు.
Also Read: ‘నిన్ను పెళ్లి చేసుకోను.. ఇంకొకరితో కానివ్వను.. కాదని చేసుకుంటే..’ హైదరాబాద్‌లో సైకో లవర్ హల్‌చల్
అరెస్టయిన వ్యాపారవేత్తల్లో ఒకరైన నిరంజన్ జైన్ 30 సార్లు టోనీ దగ్గర్నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నాడు. నిరంజన్ జైన్ చేసే వ్యాపారం వేల కోట్ల టర్నోవర్ కలిగి ఉంటుంది. పలు ప్రభుత్వ ప్రాజెక్టు పనుల కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు. నిరంజన్ జైన్ ఇచ్చే పార్టీలలో అనేక మంది ప్రముఖులు కూడా పాల్గొంటూ ఉంటారు. అలాగే పాత బస్తీ కేంద్రం గా నడుస్తున్న మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండి ఆనంద్ కూడా డ్రగ్స్‌కు బానిసయ్యారు. వందల కోట్ల టర్నోవర్ తో ఆయన బిజినెస్ నడుస్తుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు శశావత్ జైన్, ప్రముఖ కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్ రెడ్డి కూడా డ్రగ్స్‌కు బానిసయ్యారు.
నిరంజన్ జైన్, సుమంత్ రెడ్డి కలిసి హైదరాబాదులో బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. అలాగే మరో ప్రముఖ వ్యాపారి బండి భార్గవ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఎగుమతి, దిగుమతి వ్యాపార వర్గాల్లో ప్రముఖుడిగా ఉన్న వెంకట్ చలసానిని కూడా అరెస్ట ్చేశారు. భార్గవ్, వెంకట్ కలసి చదువుకుని.. కలసి వ్యాపారాలు చేస్తున్నారు. వందల కోట్లలో టర్నోవర్ నిర్వహిస్తూ డ్రగ్స్‌కు బానిసయ్యారు. అలాగే మరో వ్యాపారవేత్త తమ్మినేద సాగర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నారు. వ్యాపారాల్లో ఆరితేరిపోయారు. కానీ డ్రగ్స్ బారి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. చివరికి కటకటాల పాలయ్యారు.