Hayath Nagar Crime : హయత్ నగర్ లో మరోసారి చెడ్డీ గ్యాంగ్ అలజడి, గేటెడ్ కమ్యూనిటీలో చోరీ
Hayath Nagar Crime : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయారు. కుంట్లూరు రోడ్డులో గేటెడ్ కమ్యూనిటీలో చోరీ చేశారు. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
Hayath Nagar Crime : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. పెద్ద అంబర్ పేట్ కుంట్లూరు రోడ్డులో ప్రజయ్ గుల్మోర్ గేటెడ్ కమ్యూనిటీలో చెడ్డీ గ్యాంగ్ దొంగతనం చేసింది. ప్రజయ్ గుల్మోర్ గేటెడ్ కమ్యూనిటీలో వరుసగా నాలుగు ఇండ్లలో చోరీ చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాళాలు వేసి ఉన్న ఇళ్లపై రెక్కీ చేసిన దుండగులు నాలుగు ఇళ్లలో చోరీ చేసింది. విలియంసన్ అనే వ్యక్తి ఇంట్లో 7.5 తులాల బంగారం, 80 తులాల వెండి, 10 వేల నగదు అపహరించారు. గేటెడ్ కమ్యూనిటీలో చెడ్డి గ్యాంగ్ సంచరిస్తుండగా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మూడు ఇళ్లలో చోరీకి విఫలయత్నం చేయగా విలియంసన్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ చేశారు. చోరీ జరిగిన విషయాన్ని హయత్ నగర్ పోలీసులు సీక్రెట్ గా దర్యాప్తు చేస్తున్నారు.
గతేడాది చోరీ
గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనానికి ముందు రెక్కీ నిర్వహించారని తెలుస్తోంది. ఘటనా స్థలంలో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది ఇదే గేటెడ్ కమ్యూనిటీలో చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది.
గోల్డ్ మెడలిస్ట్ దొంగ
గుంటూరుకు చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ లోకేశ్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తు్న్నాడు. గత నెలలో కవాడిగూడలోని ఓ ఇంట్లో దొంగతనం కేసులో వంశీకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో నిందితుడి నుంచి 19 తులాల బంగారం, రూ.3 లక్షల నగదుతోపాటు రెండు సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. వంశీకృష్ణ 2004లో ఎంబీఏలో గోల్డ్‌మెడల్ సాధించాడు. ఆ తర్వాత జల్సాలకు అలవాడు పడి సులభంగా డబ్బు సంపాదించుకోవడానికి దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నాడు. తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీలు చేయడం మొదలుపెట్టాడు. హైదరాబాద్ నగరంతోపాటు ఏపీలోని పలు జిల్లాల్లోనూ చోరీలు చేశాడు. 2006 నుంచి ఇప్పటి వరకు 200 ఇళ్లలో దొంగతనాలు చేశాడని కవాడిగూడ పోలీసులు తెలిపారు. వివిధ కేసుల్లో వంశీ కృష్ణ సుమారు 67 నెలల జైలుశిక్ష అనుభవించాడు. అతనిపై పోలీసులు రెండుసార్లు పీడీ యాక్టు కూడా నమోదుచేశారు.
Also Read : Anantapur News : అనంతలో ఉన్నతాధికారి ఆత్మహత్య, ఉసురు తీసిన ఆన్లైన్ బిజినెస్!