Haryana Crime News: భర్తను స్కార్ఫ్‌తో చంపేసి కాలువలో పడేసింది- హిసార్‌లో యూట్యూబర్ ఘాతుకం
Haryana Crime News: హర్యానాలో ఓ యూట్యూబర్ తన భర్తను చంపింది. ప్రేమికుని సహాయంతో మృతదేహాన్ని నాలాలో పడేసింది. ఇద్దరూ కలిసి ఏడాదిన్నరగా యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు.

Haryana Crime News: హైదరాబాద్‌లో తన ప్రియుడి కోసం ముగ్గురు చిన్నారులను చంపేసిందో తల్లి, యూపీలో సౌరభ్ రాజ్‌పుత్ అనే అదికారిని తన ప్రియుడితో కలిసి హత్య చేసిందో ఇల్లాలు. ఈ రెండు ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ కేసుల గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదు. అప్పుడే మరో సంచలన కేసు హర్యానాలో వెలుగులోకి వచ్చింది.
భివానీకి చెందిన ఓ యూట్యూబర్, రీల్స్ చేసే మహిళ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది ప్రేమికుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత ప్రేమికుడితో కలిసి శవాన్ని దాచిపెట్టింది.
యూట్యూబర్ రవీనా రాత్రి 12.30 గంటల సమయంలో తన భర్త ప్రవీణ్ శవాన్ని బైక్‌పై తీసుకెళ్లి తన ఇంటి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ కాలువలో పడేసింది. ఈ పనిని తన ప్రేమికుడు సురేష్‌తో కలిసి చేసింది.
ఎలా వెలుగులోకి వచ్చింది హత్య రహస్యం
యూట్యూబర్ రవీనా తన ప్రేమికుడికో ఏకాంతంగా ఉన్నప్పుడు భర్త ప్రవీణ్ చూశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ప్రేమికుడితో కలిసి తిరిగే ఛాన్స్ ఉండదని భయపడిపోయింది. దీంతో భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది.
రెగ్యులర్‌గా తను వాడుకునే స్కార్ఫ్‌తో భర్తను చంపేసింది. రాత్రివేళలో పడుకునే టైంలో ప్రవీణ్ గొంతుకు స్కార్ఫ్‌ను బిగించి చంపేసింది. తర్వతా డెడ్‌బాడీని మాయం చేసింది. ప్రవీణ్ గురించి కుటుంబ సభ్యులు అడిగినప్పుడు తనకు ఏం తెలియదని ఎక్కడికి వెళ్లాడో చెప్పలేదని సమాధాం ఇచ్చింది.
ఈ కేసులో పోలీసులు ముందుగా హిసార్ జిల్లాలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన యూట్యూబర్ సురేష్‌ను రిమాండ్‌లోకి తీసుకున్నారు. రవీనాను ఆమె లవర్‌తో ఉన్నప్పుడు ప్రవీణ్ చూశాడని సురేష్ పోలీసులకు చెప్పాడు. ప్రవీణ్ దీని గురించి గొడవ పెట్టుకోవడంతో రవీనాతో కలిసి గొంతు నులిమి హత్య చేశారని చెప్పాడు.
ఈ కేసు ప్రారంభ దర్యాప్తులో పోలీసులు రోడ్లపై ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో బైక్‌పై ఓ వ్యక్తి హెల్మెట్ ధరించి, రవీనా వెనుక కూర్చుని ఉన్నట్లు కనిపించింది. రవీనా ముఖం కూడా కవర్ చేసి ఉంది. ప్రవీణ్ శవం సురేష్, రవీనా మధ్యలో ఉంది. దాదాపు రెండు గంటల తర్వాత ఇద్దరూ అదే బైక్‌పై ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఇద్దరి మధ్య ఉన్న శవం కనిపించలేదు. దీని ఆధారంగా పోలీసులు సురేష్‌ను అరెస్ట్ చేసి కేసును ఛేదించారు.
తండ్రి, మేనమామ వద్ద 6 ఏళ్ల కొడుకు
యూట్యూబర్ రవీనా ముందుగా భర్త గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత ప్రేమికుడి సహాయంతో శవాన్ని కాలువలో పడేసింది. ఈమెకు 6 ఏళ్ల కొడుకు ఉన్నాడు, ఆ బాలుడు ప్రస్తుతం తన తాత, మేనమామ వద్ద ఉన్నాడు.
ఇన్‌స్టా ద్వారా రవీనా, సురేష్ మధ్య స్నేహం
32 ఏళ్ల రవీనాను సురేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో కలిశాడు. ఇద్దరి స్నేహం ప్రేమగా మారిన తర్వాత ఇద్దరూ హర్యానాలోని ప్రేమ్‌నగర్‌లో కలిసి షార్ట్ వీడియోలు తీయడం ప్రారంభించారు. భర్త ప్రవీణ్, ఆయన కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసినా ఆమె పట్టించుకోలేదు. ఇద్దరూ కలిసి ఏడాదిన్నరగా కంటెంట్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. షార్ట్ వీడియోలు, డాన్స్ రీల్స్ ద్వారా రవీనా ఇన్‌స్టాగ్రామ్‌లో 34,000 కంటే ఎక్కువ ఫాలోవర్లను సంపాదించింది.





















