Hanamkonda News : హన్మకొండ జిల్లాలో విషాదం, ఎస్ఆర్ఎస్పీ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు
Hanamkonda News : హన్మకొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
Hanamkonda News : హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఎస్ఆర్ఎస్పీ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. ఎల్కతుర్తికి చెందిన అంబాల వరుణ్, ఎల్తురి వంశీ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో ఈతకు వెళ్లి గల్లంతు అయ్యారు. ఆర్ఎస్పీ కాలువలో ఈతకు వెళ్లిన యువకులు కాలువ ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఇద్దరు యువకులు కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని రోధిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుల కోసం గాలింపు చేపట్టారు. గజ ఈతగాళ్లలో కాలువలో పోలీసులు గాలిస్తున్నారు.
ఒకే కుంటుంబంలో ఇద్దరు మృతి
కాలువలో ఈతకు వెళ్లి కాలువలో గల్లంతయ్యారు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు. ఆ విషాదకర ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సోమవారం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందటంతో ఆ గ్రామం విషాదంలో మునిగిపోయింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తికి చెందిన అంబాల రమేష్ కు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు వంశీ ఇంటర్ మధ్యలోనే మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు.
గత ఏడాది తండ్రి మృతి, ఇప్పుడు కొడుకు
నాలుగు రోజుల క్రితం కాజీపేటలో ఉంటున్న మేనత్త కుమారుడు వరుణ్ పండుగకి ఎల్కతుర్తికి వచ్చాడు. ఇరువురు వరసకి బావ బామర్ధులు అవుతారు. సోమవారం ఉదయం ఇద్దరు ఇంటి పక్కనే ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాలువ వద్దకు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఈ ఘటన వాళ్ల చిన్నాన్న అంబల స్వామి చూస్తుండగానే జరగడంతో వెంటనే కెనాల్‌లో దూకి యువకులను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. యువకుల ఆచూకీ కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కెనాల్‌లో సుమారు 5 గంటలు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఇద్దరి మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. అనంతరం యువకులు కుటుంబాలకు మృతదేహాలను అప్పగిస్తామన్నారు. కరోనాతో వంశీ తండ్రి ఇటీవల మరణించారు. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది.
వరంగల్ జిల్లాలో విషాదం
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలోఈతకు వెళ్లి బాలుడు మృతి చెందాడు. గ్రామ శివారులోని బావిలో ముగ్గురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. ఈత రాకపోవడంతో శ్రీనాథ్(15) అనే విద్యార్థి మృతి బావిలో మునిగిపోయాడు. ముగ్గురు విద్యార్థులు ఇటుకాలపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన శ్రీనాథ్ మృత దేహం కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు.
Also Read : China Covid Outbreak: కరోనా మాట దేవుడెరుగు- అక్కడ ఆకలితో చనిపోయేలా ఉన్నారు!