అన్వేషించండి

Cell Shop Theft : ఒక్క దొంగతనంతో డీఎస్పీకే సవాల్ - ఆ దొంగ కోసం పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్ !

Cell Shop Theft : పోలీసు కార్యాలయం ముందే దొంగతనం చేసి పోలీసులకే సవాల్ విసిరాడు ఓ దొంగ. షాపుకు కన్నం వేసి మరీ దొంగతనం చేసినా పోలీసులు గుర్తించలేకపోయారు.

పోలీసులంటే ఓ భద్రత భరోసా. ఇది పోలీసు డిపార్ట్ మెంట్ స్లోగన్ ( AP Police ) .  కానీ సామాన్యులకు మాత్రం పోలీసులను చూస్తే ఓ రకమైన టెర్రర్. తప్పు చేయని వాళ్లకే ఈ టెర్రర్. నిజానికి దొంగతనాలకు అలవాటు పడిపోయిన వాళ్లకు ఈ పోలీసులను అసలు పట్టించుకోరు. పోలీసుల ఇళ్లలోనే దొంగతనాలు జరిగిన ఘటనలు చూశాం. ఇప్పుడు అలాంటిదే ఒకటి గుంటూరు జిల్లా గురజాలలో ( Gurajala ) చోటు చేసుకుంది. గురజాలలో డీఎస్పీ ఆఫీసు ( DSP Office ) ఉన్న ప్రాంతం అంటే ఎవరైనా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. హెల్మెట్లు లేకుండా లేకపోతే లైసెన్సులు లేకుండా ఎవరూ అటువైపు కూడా పోరు. 

కానీ అలాంటి చోట చేతివాటం అలవాటయిన దొంగలు మాత్రం అలవోకగా లూటీలు చేసేస్తున్నారు. గురజాల డీఎస్పీ ఆఫీసు ఎదురుగా కొన్ని దుకాణాలు ఉన్నాయి. వాటిలో సెల్ ఫోన్ షాపు (Cell Phone Shop ) ఒకటి. ఆ దుకాణం యజమాని యధావిధిగా వ్యాపారం ముగించుకుని ఇంటికెళ్లాడు. మళ్లీ పొద్దున దుకాణం తెరిచి చూస్తే దుకాణం ఖాళీగా ఉంది. పై నుంచి ఎండ లోపలికి వస్తూ కనిపించింది. ఏమిటా అని తలపైకెత్తి చూస్తే అక్కడ పెద్ద బొక్క ఉంది. తన దుకాణంపై కప్పుకు పెద్ద బొక్క పెట్టి అందులోనుంచి దిగి తన సొత్తు అంతా దోచుకెళ్లాడని రెండు నిమిషాలకే ఆ యజమానికి స్ట్రైక్ అయింది. 

అంతే లబోదిబోమంటూ ఎదురుగా ఉన్న డీఎస్పీ ఆఫీసుకు పరుగెత్తుకెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ఎంతయినా అది పోలీసుల ఇజ్జత్‌కు సంబంధించిన విషయం. తమ కార్యాలయం ఎదుటే  దుకాణానికి కన్నం వేసి మరీ దోచుకెళ్లిపోయాడంటే అది వారికి అవమానమే. ఇంకా ఇందులో ట్విస్టేమిటంటే దొంగతనం జరిగిన రోజు పగటి పాటు డీఐజీ త్రివిక్రమ్, ఎస్పీ విశాల్ గున్నీ గురజాల డీఎస్పీ ఆఫీస్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు సరిగ్గా ఉన్నాయా.. పోలీసులు భద్రత అందరికీ సక్రమంగా కల్పిస్తున్నారా అనిసమీక్ష చేశారు. సంతృప్తి చెంది వెళ్లారు. కానీ వాళ్ల సమీక్షలో ఏదో మిస్సయిందని చెప్పడానికన్నట్లు దొంగ ఆ రోజు రాత్రే డ్యూటీ ఎక్కాడు. 

దీంతో పోలీసులు ఎలాగైనా ఆ దొంగను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. డీఎస్పీ, సీఐ స్వయంగా రంగంలోకి దిగారు. కనీసం రూ. పదిహేను లక్షల సొత్తు పోయిందని షాపు యజమాని లబోదిబోమంటున్నాడు. కానీ ఇక్కడపోలీసులకు సొత్తు ఎంత పోయిందన్నది ముఖ్యం కాదు. తమ సమర్థత మీద వచ్చే ప్రశ్నలకు జవాబును ఆ దొంగను పట్టుకోవడం ద్వారా చెప్పడం ముఖ్యం. అందుకే రంగంలోకి దిగారు. దొంగను పట్టుకుంటారో లేదో చూడాలి ! 

టాప్ హెడ్ లైన్స్

Jogi Ramesh Latest News:మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు! జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు! జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు
Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget