IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Guntur GGH: ఈసీజీ పేరుతో యువతి ఫొటోలు... అసభ్యకరంగా ప్రవర్తించిన టెక్నీషియన్... గుంటూరు జీజీహెచ్ లో దారుణ ఘటన

ఈసీజీ పేరుతో యువతిని ఫొటోలు తీసిన దారుణ ఘటన గుంటూరు జీజీహెచ్ చోటుచేసుకుంది. యువతి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

FOLLOW US: 

ఈసీజీకి వచ్చిన యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన దారుణ ఘటన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. పాతగుంటూరుకు చెందిన 19 ఏళ్ల యువతి శుక్రవారం జీజీహెచ్ కు వచ్చింది. కొద్ది రోజులుగా ఛాతి నొప్పిగా ఉండడంతో యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఆసుపత్రికి వచ్చింది. యువతిని పరీక్షించిన వైద్యులు ఈసీజీ పరీక్షలు రాశారు. ఈసీజీ తీయించుకోడానికి ఆ విభాగానికి వెళ్లింది. ఈసీజీలో ఉన్న హరీష్‌ అనే వ్యక్తి యువతి తల్లిదండ్రులను బయటకు పంపించి.. పరీక్షల కోసం యువతిని వస్త్రాలు తొలగించాలన్నాడు. అందుకు ఆమె నిరాకరించింది. అలాగైతే ఈసీజీ సరిగా రాదని, బయట ఇంకా చాలా మంది వేచిచూస్తున్నారని యువతిని వస్త్రాలు తీయాలంటూ ఒత్తిడి చేశాడు. ఆమె చేత బలవంతంగా వస్త్రాలన్నింటినీ తొలగించారు. బల్లపై పడుకోవాలని చెప్పి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు సెల్ ఫోన్ లో ఫొటోలు తీయడంతో యువతి అడ్డుపడింది. 

Also Read: పంచ్ ప్రభాకర్‌ కోసం ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్ ! ఆచూకీ తెలిసిన వెంటనే అరెస్ట్ ?

సెల్ ఫోన్ లో అసభ్యకరంగా ఫొటోలు

యువతి ఎంతసేపైనా బయటకు రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఇంతలో లోపల నుంచి యువతి ఏడ్చుకుంటూ బయటకు వచ్చి జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. కోపంతో యువతి తండ్రి అతన్ని నిలదీయగా తాను అలా ప్రవర్తించలేదని బుకాయించాడు. అతడి సెల్ ఫోన్ ఇవ్వాలని అడిగితే ఎదురుతిరిగాడు. దీంతో బాధితురాలు, ఆమె తండ్రి జీజీహెచ్‌లోని అవుట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశాకు. సమాచారం అందుకున్న కొత్తపేట సీఐ శ్రీనివాసులురెడ్డి సంఘటనాస్థలికి చేరుకుని విచారణ చేశారు. ఈసీజీ తీస్తానంటూ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీశాడని బాధితురాలు, ఆమె తండ్రి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Also Read: విగ్గు ధరించి వ్యక్తి అరాచకం, జోరుగా సహజీవనం.. అందినకాడికి దండుకొని చివరికి..

కొత్త కోణం వెలుగులోకి

పోలీసుల విచారణలో మరో విషయం బయటపడింది. ఈసీజీ తీసే ఉద్యోగి కొద్ది రోజులుగా సెలవులో ఉన్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు చెప్పకుండా హరీష్‌ను ఆ విభాగంలో నియమించారు. దీనిపై శంకర్ ను పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హరీష్‌ ఎవరో తనకు తెలియదని శంకర్ తెలిపాడు. తాను అనారోగ్యానికి గురవ్వడంతో ఈసీజీ టెక్నీషియన్‌గా శిక్షణ పొందుతున్న విద్యార్థిని ఈసీజీ తీయాలని కోరాడు. కానీ ఆ విద్యార్థి హరీష్‌ను తీసుకువచ్చి ఈసీజీలు తీయిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఆసుపత్రి ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తించలేదు. యువతి ఫిర్యాదుతో అసలు విషయం బయటపడిందని పలువులు అంటున్నారు. ఈ విషయంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ స్పందించారు. హరీష్ అనే వ్యక్తి ఉద్యోగి కాదని, ఉద్యోగి శంకర్ విషయం చెప్పకుండా మరో వ్యక్తిని నియమించాడన్నారు. శంకర్ ను ఉద్యోగం నుంచి తొలిగిస్తున్నట్లు తెలిపారు. హరీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: మటన్ కత్తితో ఫ్రెండ్ గొంతు కోసేసి హత్య.. కారణం తెలిసి అవాక్కైన స్థానికులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 13 Nov 2021 10:18 AM (IST) Tags: AP Latest news Guntur Govt Hospital Guntur news Guntur ggh Ecg technician misbehaves woman

సంబంధిత కథనాలు

Hyderabad Honour Killing Case: అవమానం తట్టుకోలేని సంజన ఫ్యామిలీ, పక్కా ప్లాన్‌తో నీరజ్‌ పరువు హత్య -  రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు ఇవే

Hyderabad Honour Killing Case: అవమానం తట్టుకోలేని సంజన ఫ్యామిలీ, పక్కా ప్లాన్‌తో నీరజ్‌ పరువు హత్య - రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు ఇవే

MLC Driver Murder Case: ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ గన్‌మెన్లు సస్పెండ్, ఏ క్షణంలోనైనా ఎమ్మెల్సీ అరెస్ట్​

MLC Driver Murder Case: ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ గన్‌మెన్లు సస్పెండ్, ఏ క్షణంలోనైనా ఎమ్మెల్సీ అరెస్ట్​

Karimnagar: ఇంటి కింద 4 కోట్లు! వాటి కోసం క్షద్రపూజలు, తెలివిగా నమ్మించి బురిడీ కొట్టించిన దొంగ బాబాలు

Karimnagar: ఇంటి కింద 4 కోట్లు! వాటి కోసం క్షద్రపూజలు, తెలివిగా నమ్మించి బురిడీ కొట్టించిన దొంగ బాబాలు

Rajanna Sircilla: కలెక్టర్‌ పేరుతో ఫేక్ వాట్సాప్‌ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !

Rajanna Sircilla: కలెక్టర్‌ పేరుతో ఫేక్ వాట్సాప్‌ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !

Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!

Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Kushi Update: 'ఖుషి' కశ్మీర్ షెడ్యూల్ పూర్తి - నెక్స్ట్ హైదరాబాద్ లోనే!

Kushi Update: 'ఖుషి' కశ్మీర్ షెడ్యూల్ పూర్తి - నెక్స్ట్ హైదరాబాద్ లోనే!

PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video

PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video

Viral News: తాళి కట్టే టైంలో స్పృహ తప్పిన వధువు- తర్వాత ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి పోలీసులు ఎంట్రీ!

Viral News: తాళి కట్టే టైంలో స్పృహ తప్పిన వధువు- తర్వాత ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి పోలీసులు ఎంట్రీ!

NTR: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ

NTR: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ