News
News
X

గుంటూరులో బంగారం దొంగలు అరెస్ట్, కేజీ బంగారం స్వాధీనం

గుంటూరులో బంగారం దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కేజీ బంగారం రికవరీ చేశారు.

FOLLOW US: 
Share:

గుంటూరు లక్ష్మీపురం మహావీర్ జ్యూవెలరీ చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.షేక్ ఆలీ, చిలకా రత్నరాజులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి ఒక కేజి 165 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 లక్షల 35 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో మహావీర్ జ్యూవెలరీ దుకాణం షట్టర్ ను తొలగించి దుండగులు చోరీకి పాల్పడ్డారు.ఈ ఇద్దరు నిందితులు  గతంలో ఏటీఏం చోరికి యత్నం, మోటార్ సైకిల్ దొంగతనం కేసులలో  ముద్దాయిలుగా ఉన్నారని పోలీసులు గుర్తించారు.

బంగారు దుకాణంలో భారీ చోరీ

 గ్యాస్ కటర్ తో తాళాలను కట్ చేసి నగదు, బంగారు ఆభరణాలు దొంగతనం చేసిన ఘటన గుంటూరులో కలకలం రేపింది. నవంబర్ లో జరిగిన ఈ దొంగతనం కేసులో ఇద్దరు నిందితులు తాపీగా తమ పని ముగించారు. షేక్ లీ పాత గుంటూరుకు చెందని వ్యక్తి.. అతడు టింకరింగ్ షాపులో పనిచేస్తాడు. ఇక మరో నిందితుడు చిలకా రత్నరాజు  లారీ డ్రైవర్. అయితే వీరిద్దరి ప్రవృత్తి నేరాలు కావటం విశేషం. మొదట్లో ఇద్దరు వేర్వేరుగా చిల్లర నేరాలు చేసేవారు. అయితే వాటి ద్వారా ఎక్కువ ఆదాయం లభించకపోవటంతో ఇద్దరు కలుసుకొని నేరాలు చేసేందుకు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా నవంబర్ 20వ తేదీన రాత్రి లక్ష్మీపురం మెయిన్ రోడ్డులో ఉన్న మహావీర్ జ్యూయలరీ షాప్ తాళాలను గ్యాస్ కటర్ తో కట్ చేసి దొంగతానికి పాల్పడ్డారు. చాలా ఈజీగా తమ పని ముగించారు. నిందితులు గ్యాస్ కట్టర్ తో తాళాలు పగలకొట్టి లోపలకు వెళ్లి కేజీకి పైగా బంగారం దోచుకుంటుంటే ఎవ్వరికి అనుమానం రాలేదంటే వారి టాలెంట్ ఏంటో అర్దం అవుతుంది.

ముందు రోజునే పక్కా ప్లాన్....

గుంటూరు రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈ కేసులో ముద్దాయిలైన షేక్ అలీ, చిలక రత్న రాజు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇరువురిని అరెస్టు చేసి విచారించారు. దీంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. మొదటి నిందితుడు షేక్ అలీ గుంటూరు పట్టణం ఆటోనగర్ నందు టింకరింగ్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. గతంలో చిలక రత్నరాజు షేక్ అలీ ఇంటిలో అద్దెకు ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ చెడు వ్యసనాలు ఉండి వారు సంపాదించిన డబ్బులతో జల్సాలు చేసుకుంటున్నారు. అక్టోబర్ 6వ తేదీన  గుంటూరు  ఇజ్రాయిల్ పేటలో ఒక ఇంటి ముందు తాళం వేయకుండా పార్క్ చేసి ఉన్న AP 07 CH 3942 నెంబర్ గల బైక్ ను కొట్టేశారు. దాన్ని చోర్ బజార్ లో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఇలా మొదలైన వీరి చోరీల వ్యవహరం ఇప్పుడు బంగారం దుకాణం దోచుకునే వరకు వెళ్లింది. నల్లవాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోడవరం గ్రామంలో ఉన్న ఎస్ బీ ఐ బ్యాంక్ ఎటీఎం దొంగతనం చేయడానికి అనుకూలంగా ఉందని గుర్తించారు. ముందు రోజు పక్కాగా ప్లాన్ వేశారు. ఎటీఎం మిషన్ ను గ్యాస్ వెల్డింగ్ ద్వారా కట్ చేసి అందులో డబ్బులు దొంగిలించాలని నిర్ణయించుకున్నారు. సదరు పథకం మేరకు ఎటీఎం మిషన్ ను గ్యాస్ కటింగ్ చేయడానికి అవసరమైన ఆక్సిజన్ సిలిండర్, వంటగ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, గ్యాస్ పైపులు వంటి సామాగ్రిని షేక్ అలీ తన టీంకరింగ్ షాప్ నుండి తీసుకొచ్చాడు. అక్టోబర్ 24న ఇద్దరు నిందితులు కలిసి గ్యాస్ కటింగ్ సామాగ్రితో చోడవరం గ్రామంలో ఉన్న ఏటీఎం సెంటరుకు వెళ్లి,  మిషన్ ను గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో  ఏటీఎం సెంటర్ అలారం మోగింది. దీంతొ చోరీని అక్కడే ఆపేసి పరారయ్యారు. 

నెక్ట్స్ అటెంప్ట్ బంగారం దుకాణం...

ఎటీఎం చోరీ ప్లాప్ కావటంతో  నిందితులు ఇద్దరు కలిసి లక్ష్మీపురం మెయిన్ రోడ్డు మీద ఉన్న బంగారు దుకాణం పై కన్నేశారు.ప్రదాన రహాదారి నుండి లోపలకు బంగారు దుకాణం ఉండటంతో దొంగతనం చేయడానికి అనుకూలంగా ఉందని నిర్ణయించుకొని ప్లాన్ వేశారు.అయితే ఈ సారి ప్లాన్ పక్కాగా సక్సెస్ అయ్యింది. గ్యాస్ కటింగ్ సామాగ్రితో షాపు షట్టర్ ను  తొలగించి లోపలికి వెళ్లి  బంగారు ఆభరణాలను, నగదును దొంగిలించారు . దొంగిలించిన నగదు నుండి చెరికొంత నగదు తీసుకొని బంగారు నగలు, బ్యాగులో ఉంచి దాన్ని,  మొదటి ముద్దాయి షేక్ అలీ తన బంధువుల ఇంట్లో దాచి పెట్టాడు.నేరం చేసిన తరువాత ఇద్దరు కలసి బస్సులో విజయనగరం పరారయ్యారు.ఇటీవల నిందితులు తిరిగి గుంటూరు నగరానికి వచ్చి తిరుగతుండగా స్దానికులు ఇచ్చిన సమాచారంతో అదుపులోకి తీసుకోవటంతో,వ్యవహరం వెలుగు చూసింది. ఒక కేజీ 167 గ్రాముల బంగార ఆభరణాలు,  6,35,000 నగదు, స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

 

Published at : 03 Dec 2022 09:41 PM (IST) Tags: Crime News gold shop theft Guntur Guntur Crime News guntur gold chori

సంబంధిత కథనాలు

Godavarikhani Crime: షాకింగ్ - గోదావరిఖనిలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య

Godavarikhani Crime: షాకింగ్ - గోదావరిఖనిలో నడి రోడ్డుపై రౌడీ షీటర్ దారుణ హత్య

BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు

BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు

Naba Kishore Das: ఏఎస్ఐ కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్ మృతి

Naba Kishore Das: ఏఎస్ఐ కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్ మృతి

Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం

Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం

Balochistan Bus Accident : బలూచిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు లోయలో పడి 41 మంది మృతి

Balochistan Bus Accident : బలూచిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు లోయలో పడి 41 మంది మృతి

టాప్ స్టోరీస్

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Hockey WC 2023 Winner: హాకీ ప్రపంచకప్ విజేత జర్మనీ- షూటౌట్ లో బెల్జియంపై 5-4 తేడాతో గెలుపు

Hockey WC 2023 Winner: హాకీ ప్రపంచకప్ విజేత జర్మనీ- షూటౌట్ లో బెల్జియంపై 5-4 తేడాతో గెలుపు

ఒడిశా మంత్రిని కాల్చి చంపిన వ్యక్తికి బైపోలార్ డిజార్డర్‌- పదేళ్లుగా చికిత్స పొందుతున్న గోపాల్!

ఒడిశా మంత్రిని కాల్చి చంపిన వ్యక్తికి  బైపోలార్ డిజార్డర్‌- పదేళ్లుగా చికిత్స పొందుతున్న గోపాల్!

Samantha Diet: ఆటోఇమ్యూన్ డైట్ - సమంత పాటిస్తున్న డైట్ ఇదే, ఇంతకీ ఏంటిది?

Samantha Diet: ఆటోఇమ్యూన్ డైట్ - సమంత పాటిస్తున్న డైట్ ఇదే, ఇంతకీ ఏంటిది?