Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి
Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 16వ నెంబర్ జాతీయ రహదారి తుమ్మలపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ఉన్న మొత్తం నలుగురు ఉండగా స్పాట్లో ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మహిళకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. గాయపడిన మహిళను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. కారులో గుంటూరు నుంచి చిలకలూరిపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇంటి గోడ కూలి ఐదుగురు మృతి
ఛత్తీస్ గఢ్‌లోని కంకేర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. ఇంటి గోడ కూలి భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలు మృతి చెదారు. ఐదుగురు మరణించినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. కాంకేర్ జిల్లాలోని పఖంజూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇర్పనార్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తుండగా సోమవారం తెల్లవారుజామున ఇంటి మట్టి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు పడవలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కంకేర్‌లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఈ ప్రాంతంలోని నదులు, వాగులన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తల్లి, కుమారుడు మృతి
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం, మామడుగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తల్లీ, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, భర్త, కుమార్తె స్వల్ప గాయాలతో బయట పడ్డారు. తమిళనాడు రాష్ట్రం, కోయంబత్తూరుకు చెందిన వెంకట్ బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం తమిళనాడు రాష్ట్రం వేలూరులోని స్నేహితుడిని కలిసి కుటుంబంతో సహా బెంగుళూరుకు తిరుగు ప్రయణం అయ్యారు. ఈ క్రమంలోనే గంగవరం మండలం, మామడుగు వద్ద జాతీయ రహదారిపై కారు ఎడమ వైపు ముందు టైరు పేలిపోయింది. దీంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది.
తల్లితో పాటు మూడేళ్ల కుమారుడి మృతి..!
ఈ ఘటనలో ముందు సీట్లో కూర్చున్న భార్య గాయత్రి(30), 3 సంవత్సరాలు కుమారుడు విథున్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. భర్త వెంకట్, కుమార్తె స్వల్ప గాయాలతో బయట పడ్డారు. విషయం గుర్తించిన స్థానికులు క్షతగాత్రులనుసరుక్షితంగా కారులోంచి బయటకు దింపారు. ఆ తర్వాత పోలీసులకు సమాచాంర అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కూడ స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గంగవరం ఎస్సై సుధాకర్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Machilipatnam Crime News : మచిలీపట్నంలో దారుణం, పోలీసులమని బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారం