AP Grama Volunteer Murder: బాపట్లలో మహిళా వాలంటీర్ దారుణ హత్య, వివాహేతర సంబంధమే కారణమా !
AP Grama Volunteer Murder: గత నెలలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరుస అత్యాచారాలు, లైంగిక దాడులు జిల్లా ప్రజలను సైతం భయాందోళనకు గురిచేశాయి. తాజాగా గ్రామ వాలంటీర్ దారుణహత్యకు గురైంది.
Grama Volunteer Murder: ఏపీలో గత కొన్ని రోజులుగా మహిళలు, చిన్నారులపై దారుణాలు జరుగుతున్నాయి. గత నెలలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరుస అత్యాచారాలు, లైంగిక దాడులు జిల్లా ప్రజలను సైతం భయాందోళనకు గురిచేశాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ పోలీసులకు లైంగిక నేరాలు తలనొప్పిగా మారుతున్న క్రమంలో మరో దారుణం (Lady Village Volunteer Murder) చోటుచేసుకుంది.
ఓ మహిళా గ్రామ వాలంటీర్ దారుణ హత్యకు గరుయ్యారు. బాపట్ల జిల్లా వేమూరు మండలంలో ఈ దారుణం జరిగింది. మండలంలోని చావలి గ్రామానికి చెందిన దొప్పలపూడి శారద (27) వివాహిత కాగా, భర్త ధర్మారావు, సంతానం ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. శారద చావలిలో గ్రామ వాలంటీర్‌గా సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు శారద దారుణ హత్యకు గురైంది. అదే గ్రామానికి చెందిన పద్మారావు అనే వ్యక్తి దాడి చేసి మెడపై కత్తితో కోశాడు. భయంతో కేకలు వేసుకుంటూ రోడ్డు మీదకు పరిగెత్తుకుంటూ వచ్చిపడిపోయింది శారద. చుట్టుపక్కల వారు ఈ విషయాన్ని గమనించి 108 అంబులెన్స్ కు ఫోన్ చేసారు. అంబులెన్స్ వచ్చే సమయానికే ఆమే ప్రాణాలు విడిచింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో పద్మారావు ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. .
వివాహేతర సంబంధమే కారణమా !
వివాహిత అయిన శారదకు గ్రామానికి చెందిన పద్మారావుతో పరిచయం ఉంది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. గత కొంతకాలం నుంచి వీరు శారీరక సంబంధాన్ని కొనసాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఓ విషయంలో గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన పద్మారావు శారదను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడని సీఐ కళ్యాణ్ రాజ్ తెలిపారు. మహిళా గ్రామ వాలంటీర్ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రశాంతంగా ఉండే చావలిలో ఇటువంటి దారుణ హత్య జరగడంతో గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.