Gold Trading Scam: నగరంలో భారీ మోసం - గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరిట వందల మంది నుంచి వసూళ్లు, బాధితుల ఆందోళన
Hyderabad News: గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో ఓ వ్యాపారి 500 మందిని మోసం చేశాడు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
Gold Trading Scam In Hyderabad: హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరో భారీ స్కామ్ వెలుగుచూసింది. గోల్డ్ ట్రేడింగ్‌లో (Gold Trading) పెట్టుబడుల పేరుతో ఓ వ్యాపారి 500 మందిని మోసగించాడు. విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ప్రహణేశ్వరి ట్రేడర్స్ పేరుతో రాజేశ్ అనే వ్యక్తి ఓ కార్యాలయం ఏర్పాటు చేశాడు. అధిక లాభాలు ఆశ చూపి గోల్డ్ ట్రేడింగ్‌లో వందల మంది నుంచి వసూలు చేశాడు. దాదాపు 500 మంది నుంచి రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకూ వసూలు చేసి పరారయ్యాడు. గత 2 నెలలుగా తప్పించుకు తిరుగుతోన్న సదరు వ్యాపారిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలని బషీర్ బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
'నమ్మి మోసపోయాం'
గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే డబ్బును 5 నెలల్లోనే రెట్టింపు చేస్తామని వ్యాపారి నమ్మబలికినట్లు బాధితులు తెలిపారు. పెట్టుబడిలో 2 శాతం లాభాలను వారానికోసారి చెల్లిస్తామని నమ్మించి మోసం చేశాడని వాపోయారు. తొలి 2 నెలలు లాభాలను చెల్లించడంతో నమ్మకం కలిగి భారీ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.
Also Read: Kamareddy News: కామారెడ్డి జిల్లాలో దారుణం - మామతో కలిసి భర్తనే చంపేసిన భార్య, షాకింగ్ ఘటన