అన్వేషించండి

Drinkers WhatsApp Group: తాగుబోతుల ఐక్యమత్యం వర్థిల్లాలి - వాట్సాప్‌ గ్రూప్‌తో పోలీసులకు చెక్ !

WhatsApp group: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమాచారం కోసం తాగుబోతులు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూపు ద్వారా ఒకరికి తెలిసిన సమాచారన్ని అందరికీ పంచుకుని అటు వైపు వెళ్లడం మానేస్తున్నారు.

Drunkards set up WhatsApp group for checking updates: తాగుబోతులు అని వాళ్లను అనకూడదు. వాళ్లు టాక్స్ పేయర్స్.  ఆ టాక్స్ పేయర్స్ గౌరవం ఉండదు. తాగి రోడ్ల మీదకు వెళ్తే మళ్లీ ఫైన్స్. అందుకే ఈ తాగుబోతులు అందరూ ఎక్కడ... ఎలా కలుసుకున్నారో కానీ తాగిన తర్వతా పోలీసులకు దొరకూడదని డిసైడయ్యారు. అందుకే అందరూ కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. చెకింగ్ ల గురించి ఎవరికి సమాచారం తెలిసినా ఆ గ్రూపులో షేర్ చేసుకుంటున్నరాు. తనిఖీలు జరుగుతున్న వైపు తాగుబోతులు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు.      

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈ తాగుబోతుల ఐక్యత బయటపడింది.  పోలీసుల కళ్లుగప్పి తిరగాలనుకున్న కొందరు యువకుల ప్లాన్ రివర్స్ అయింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకోవడానికి వీరు ఏకంగా పోలీస్ మామల స్క్వాడ్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారు. ఎక్కడెక్కడ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు? ఏ రూట్‌లో వెళ్తే క్షేమం? వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ పోలీసులకే సవాల్ విసిరారు. అయితే, ఒక చిన్న పొరపాటుతో ఈ  స్మార్ట్  స్క్వాడ్ గుట్టు రట్టయింది.                                    

గోదావరిఖనిలో పోలీసులు నిర్వహించిన రొటీన్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు, ఫోన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అందులో  పోలీస్ మామల స్క్వాడ్  అనే గ్రూప్ కనిపించడంతో అధికారులు అవాక్కయ్యారు. ఆ గ్రూప్‌లో వందలాది మంది సభ్యులు ఉండటమే కాకుండా, పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు ఫొటోలు, లొకేషన్ల రూపంలో అప్‌డేట్ చేస్తున్నట్లు గుర్తించారు.                                                  

విషయం తెలుసుకున్న సబ్ ఇన్‌స్పెక్టర్చా కచక్యంగా వ్యవహరించారు. ఆ యువకుడి ఫోన్ ద్వారానే తానే స్వయంగా ఆ గ్రూప్‌లోకి ప్రవేశించి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు.  నేను గోదావరిఖని టూ-టౌన్ ఎస్సైని.. మీ అందరి నంబర్లు నా దగ్గర సేవ్ అయ్యాయి. ఇకపై మీరు ఎక్కడ ఉన్నా ట్రాక్ చేస్తాం. మీ అందరికీ త్వరలోనే పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఉంటుంది  అని మెసేజ్ చేయడంతో గ్రూప్ సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.                           

ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా ఇలాంటి గ్రూపులు నిర్వహించడం నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పట్టుబడిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాను ఇలాంటి అసాంఘిక పనులకు ఉపయోగిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.    

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Hyderabad Viral Video: ఫుడ్ ఆలస్యమైందని Zomato డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో వైరల్
ఫుడ్ ఆలస్యమైందని Zomato డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో వైరల్
Telangana Woman Dies: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి, మరొకరికి గాయాలు
RTC Driver, Conductor Attacked: అడిగిన చోట బస్సు ఆపనందుకు గురజాలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి
అడిగిన చోట బస్సు ఆపనందుకు గురజాలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Embed widget