అన్వేషించండి

Gadwal News: సమీప బంధువుతో దిగిన ఫొటోలే ఆ విద్యార్థి ప్రాణాలు తీశాయా?

Gadwal News: సమీప బంధువుతో దిగిన ఫొటోలను అతడి స్నేహితులు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు. అయితే ఈ ఏవమానాన్ని భరించలేని అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. 

Gadwal News: రోజురోజుకూ మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. అన్నా చెల్లెల్లు రోడ్డు మీద వెళ్తున్నా అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు. భర్తకు భార్యపై, భార్యకు భర్తపై అనుమానాలు పెంచుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఙటనే జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. సమీప బంధవుతో దిగిన ఫొటోల కారణంగా ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. అదేంటి ఫొటోల వల్ల ప్రాణాలు ఎలా పోయాయి అనుకుంటున్నారా.. ఓ అమ్మాయి సమీప బంధువుతో ఫొటోలు దిగింది. ఆ ఫొటోలు చూసిన ఆ అబ్బాయి స్నేహితులు వాటిని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు. దీంతో అవమానం భరించలేని అమ్మాయి.. ఆత్మహత్యకు పాల్పడింది. 

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన 20 ఏళ్ల మేఘలత జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన 24 ఏళ్ల శివ కుమార్ ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె తిరస్కరించింది. ఆ విషయం ఇంట్లో తెలియడంతో మేఘలతకు పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈనెల 6వ తేదీన శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మేఘలత మానసిక క్షోభకు గురైన ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అంతే కాకుండా చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ కూడా రాసిది. 

సూసైడ్ నోట్ లో ఏముందంటే..?

"నాన్నా.. నేను నీ కూతురిని. ప్రాణం పోయినా తప్పు చేయను. 2019లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టిన వారిని వదలకు. అమ్మను, చెల్లిని, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో." అంటూ తండ్రికి లేఖ రాసింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య..

నిజామాబాద్‌లోని వీఆర్‌ఈసీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న పదిహేడేళ్ల అక్షిత సూసైడ్‌ చేసుకోవడం కలకలం రేపింది. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న అక్షిత ఆదివారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ హాస్టల్‌ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. 

అక్షిత సూసైడ్ విషయం గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని కాలేజీ సిబ్బందికి చెప్పారు. వెంటనే ఈ స్పందించిన ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అక్షిత మృతి చెందింది. అక్షిత పాలిటెక్నిక్‌ ఈసీఈ విద్యార్థిని. ఇటీవలే మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఆమె ఒక సబ్జెక్ట్‌లో తప్పింది.

మొదటి సెమిస్టర్‌లోనే ఒక సబ్జెక్ట్‌ తప్పిన అక్షితకు పరీక్షలంటేనే భయం పట్టుకుంది. తరచూ తోటి స్నేహితుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించేది. రేపటి(మంగళవారం) నుంచి రెండో సమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందులో ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో సూసైడ్ చేసుకుంది. అయితే అక్షిత మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదని... పరీక్షలు అంటే ఎప్పుడూ భయపడేది కాదని అంటున్నారు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Fake High Court Judge: హైకోర్టు జడ్జినంటూ ప్రచారం.. వైజాగ్ సీపీపైనే కుట్ర.. లాయర్ కార్తీక్ సిద్ధార్థపై క్రిమినల్ కేసు నమోదు!
హైకోర్టు జడ్జినంటూ ప్రచారం.. వైజాగ్ సీపీపైనే కుట్ర.. లాయర్ కార్తీక్ సిద్ధార్థపై క్రిమినల్ కేసు నమోదు!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Hyderabad Crime News: ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget