France stabbing: ప్రీస్కూల్‌లోని చిన్నారులపై కత్తితో దాడి చేసిన సైకో, 9 మందికి తీవ్ర గాయాలు
France stabbing: ఫ్రాన్స్‌లో ఓ దుండగుడు చిన్నారులపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
France Stabbing:
ఫ్రాన్స్‌లో దారుణం..
ఫ్రాన్స్‌లో ఓ దుండగుడు ప్రీస్కూల్ పిల్లలపై దారుణంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కత్తితో దాడి చేసిన వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. లేక్ అన్నెసీకి (Lake Annecy) సమీపంలోని ఓ పార్క్‌లో ఈ దాడి జరిగింది. ఫ్రెంచ్ ఇంటీరియర్ మినిస్టర్ గెరాల్డ్ డార్మనిన్ (Gerald Darmanin) వెల్లడించిన వివరాల ప్రకారం...గాయపడిన 9 మందిలో 8 మంది చిన్నారులున్నారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. గాయపడిన పిల్లల వయసు మూడేళ్లలోపే ఉంటుందని తెలుస్తోంది. అంత చిన్న పిల్లలపై దాడి ఎందుకు చేశాడన్నది విచారణలో తేలనుంది. ఒక్కసారిగా కత్తి పట్టుకుని అందరినీ గాయపరించాడు నిందితుడు. ఫలితంగా...అక్కడ చాలా సేపటి వరకూ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీలో ఈ దాడిని ఖండిస్తూ నిముషం మౌనం పాటించారు.
France: Several people, including children injured in knife attack in Annecy
— ANI Digital (@ani_digital) June 8, 2023
Read @ANI Story | https://t.co/78AQxiwCX8#France #Annecy #knifeattack pic.twitter.com/NRv7mv1UYa
అమెరికాలోని టెక్సాస్‌లో 18 ఏళ్ల కుర్రాడు సొంత కుటుంబ సభ్యుల్నే కాల్చి చంపేశాడు. ఎందుకిలా చేశావని అడిగితే "వాళ్లందరూ నన్ను తినేస్తారేమో అని భయం వేసింది. అందుకే చంపేశాను" అని సమాధానం చెప్పాడు. ఇది విని పోలీసులు షాక్ అయ్యారు. స్థానికంగా ఈ ఘటన సంచలనమైంది. నిందితుడు సిజర్ ఒలాల్డ్‌ని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులతో పాటు,ఇద్దరు తోబుట్టువులనూ చంపేశాడు. వారిలో ఓ 5 ఏళ్ల చిన్నారి ఉన్నాడు. గన్ ఫైరింగ్ శబ్దాలు వినిపించడం వల్ల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి వద్దకు చేరుకునే లోపే...నిందితుడు లోపల ఉన్నాడు. ఇంట్లోని మిగతా వాళ్లు శవాలై పడి ఉన్నారు. తన వద్ద తుపాకీ ఉందని, జస్ట్ ట్రిగ్గర్ చేసి అందరినీ కాల్చి పారేశానని చాలా సింపుల్‌గా సమాధానం చెబుతున్నాడు ఆ కుర్రాడు. చంపినందుకు ఏ మాత్రం పశ్చాత్తాపం కూడా అతనిలో కనిపించకపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బాత్రూమ్లో ఇద్దరి మృతదేహాలను కనుగొన్న పోలీసులు...వాటిని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.#Breaking: Update - Video footage reportedly taken minutes after the terror stabbing attack in #Annecy, #France, showing you the Syrian suspect running away after being chased by locals, while people scream for help in the background for the children that had been stabbed. pic.twitter.com/WufuLkgMkf
— Sotiri Dimpinoudis (@sotiridi) June 8, 2023
"ఇంట్లో వాళ్లను పరుగులు పెట్టించి మరీ కాల్చి ఉంటాడని భావిస్తున్నాం. వారంతా చనిపోయారని నిర్ధరించుకున్నాక బాత్రూమ్లో పడేశాడు. ఇల్లంతా రక్తంతో తడిసిపోయింది. ఆ సమయంలో పక్కనే ఉన్న ఓ మహిళ లోపలకు వెళ్లి అతడిని అడ్డుకోడానికి ప్రయత్నించింది. కానీ...ఆమెనీ చంపేస్తానని గన్ చూపించాడు. భయంతో ఆమె వెనక్కి వచ్చేసింది. ఇరుగు పొరుగు వాళ్లతో ఈ కుటుంబానికి ఎలాంటి గొడవలూ లేవు. అందరితోనూ సరదాగా మాట్లాడతారు"
- పోలీసులు
Also Read: Mumbai Murder: మహిళ బాడీని ముక్కలుగా నరికాడు, కుక్కర్లో ఉడికించాడు - ఒళ్లు జలదరించే దారుణం