అన్వేషించండి
Advertisement
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం - ఒక్కసారిగా కార్మికుల భయాందోళన
Visakha News: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ సీనియర్ మేనేజర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తోటి సిబ్బంది ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Fire Accident In Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో (Visakha Steel Plant) మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. SMS - 1లో మంటలు చెలరేగి.. సీనియర్ మేనేజర్ మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి సిబ్బంది ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎల్‌పీబే స్టీల్ ల్యాడిల్ బ్లాస్ట్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్లాంట్‌లోని యంత్రాలు, ఉత్పత్తికి ఎలాంటి నష్టం జరగలేదని.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్లాంట్‌లో కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భారీగా ఉక్కు ఉత్పత్తి అయ్యే కంపెనీలో ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు మరింతగా తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement