Two Mothers One Child : ఓ వైపు పెంచుతున్న తల్లి - మరో వైపు కన్న తల్లి ! ఇప్పుడు ఆ బిడ్డ ఎవరికి దక్కాలి ?
నాలుగు నెలల బిడ్డ .. తమ బిడ్డేనంటూ ఇద్దరు తల్లులు పోట్లాడుకోవడం నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ఆ బిడ్డ ఎవరో అధికారులు తేల్చాల్సి ఉంది.
Two Mothers One Child : నవ మాసాలు మోసింది. బిడ్డకు జన్మనిచ్చింది. కానీ బిడ్డ కంటే రూ. నలభై వేలే ఎక్కువ అనుకుంది. పిల్లలు లేని దంపతులకు అమ్మేసింది. అయితే నాలుగు నెలల తర్వాత ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకు వచ్చింది. డబ్బులు తక్కువ అయ్యాయని అనుకుందో లేకపోతే నిజంగానే కన్నతీపి గుర్తుకు వచ్చిందో కానీ తన బిడ్డను తనకివ్వాలంటూ.. వారింటికి వెళ్లి ధర్నాకు దిగింది. నాలుగు నెలలుగా ఆ బిడ్డను పెంచుకుంటున్న తల్లి ఇచ్చే ప్రశ్నే లేదంటోంది. ఇవ్వాల్సిదేనని కన్న తల్లి అంటోంది. నిజామాబాద్‌లోఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గామారింది.
చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేశారు, మాజీ మంత్రి చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆనంద్ నగర్ కు చెందిన సునీతకు కాలూర్ కి చెందిన కన్నతల్లి ఇందిరా 4 నెలల క్రితం 40 వేల కోసం కన్న కొడుకును అమ్మేసిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. కాలుర్ గ్రామానికి చెందిన ఇందిరా 4 నెలల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆనంద్ నగర్ కు చెందిన సునీత రూ. 40 వేలు నగదు ఇచ్చి బిడ్డను తీసుకుంది. తన అంగీకారం మేరకు ఇస్తున్నట్లుగా ఇందిరా ఒప్పంద పత్రం రాసుకున్నారు. అయితే నాలుగు నెలల తర్వాత కన్నతల్లి ఇందిరా, తాను ఏలాంటి డబ్బులు తీసుకోలేదని తన కొడుకు తనకు కావాలంటూ, తన కొడుకును పెంచుతున్న సునీత ఇంటిముందు ధర్నాకు దిగింది.
సీఎం క్యాండిడేట్ ఎవరు ? ఏపీ బీజేపీకి పెద్ద చిక్కొచ్చిపడింది !
కన్న తల్లికి రూ. 40 వేలు డబ్బులు ఇచ్చి బాబును కొనుక్కున్నానని పెంపుడు తల్లి సునీత చెబుతొంది. 4 నెలల తర్వాత కొడుకును కొనుక్కున్న సునీత ఇంటిముందు ధర్నాకు దిగడంతో, కొడుకును అమ్మిన ఘటన చర్చనీయాంశమైంది. ఓ వైపు కన్న తల్లి తన కొడుకును అమ్మ లేదని చెబుతుంటే మరి సునీత వద్ద కొడుకు ఎలా ఉంటాడన్న ప్రశ్న తలెత్తుతొంది. ఇద్దరు తల్లుల వ్యవహారం జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బిడ్డను అమ్మడం... కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరం. దీంతో ఇప్పుడు ఈ విషయం అధికారుల వద్దకు చేరే అవకాశం ఉంది. బిడ్డ నాలుగు నెలల నుంచి పెంపుడు తల్లి వద్దే పెరుగుతున్నారు. కన్నతల్లి తన బిడ్డ తనకు కావాలని అంటోంది కాబట్టి.. ఇరు వర్గాలతో చర్చలు జరిపి.. కన్న తల్లికే బిడ్డను అప్పగించే అవకాశం ఉంది.