Hyderabad News: కోడలి పోలీస్ కంప్లైంట్ - కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం, సికింద్రాబాద్‌లో విషాద ఘటన
Crime News: కోడలు తమపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన ఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Family Trying To Death In Hyderabad: కోడలు తమపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందని.. ఆమె వేధింపులను కారణంగా చూపుతూ ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు యత్నించిన ఘటన సికింద్రాబాద్‌లో (Secunderabad) కలకలం రేపింది. త్రీ స్టార్ హోటల్‌లో అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాకు చెందిన నారాయణ (52), తల్లి పద్మావతి (47) దంపతుల కుమారుడు సృజన్ (23). ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఈ దంపతులు కుమారునికి కావ్య అనే యువతితో పెళ్లి చేశారు. కొద్దిరోజులు వీరి జీవితం సాఫీగానే సాగింది. అనంతరం ఇరువురి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.
భర్తపై ఫిర్యాదు
ఈ క్రమంలోనే కోడలు కావ్య భద్రాద్రి జిల్లాలోని చెంచిపల్లి పోలీస్ స్టేషన్‌లో భర్త సృజన్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై 498A కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు అంతా కలిసి కోడలికి నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ చేరుకుని తాజ్ త్రీ స్టార్ హోటల్‌లోని 308 రూంలో బస చేశారు. తర్వాత కోడలికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసకుంటున్నట్లు చెప్పారు. అవమానం భరించలేమని జ్యూస్‌లో మత్తు పదార్థం కలిపి తాగారు. అయితే, అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ముగ్గురిని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మహంకాళి పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోడలు కావ్య.. భర్త సృజన్‌పై పెట్టిన కేసు గురించి ఆరా తీస్తున్నారు.