Anantapur Crime News: హంతకుడి కుటుంబ ఆస్తుల జప్తు,పథకాల రద్దు - అనంతపుపురం పోలీసుల సంచలన నిర్ణయం
Anantapur: అనంతపురంలో మైనర్ బాలికను చంపిన వ్యక్తి కుటుంబ ఆస్తులను జప్తు చేయనున్నారు. అలాగే ఆ కుటుంబానికి ఎలాంటి పథకాలు అందకుండా చర్యలు తీసుకోనున్నారు.

Anantapur minor girl Murder case: అనంతపురంలో హత్యకు గురైన మైనర్ బాలిక విషయంలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితుల కు ఉన్న ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్ చేసే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. అలాగే నిందితుడి కుటుంబానికి వస్తున్న ప్రభుత్వ పథకాలను కూడా రద్దు చేసేందుకు సిఫారసు చేసినట్లు ఎస్పీ ప్రకటించారు.
సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంటర్మీడియట్ విద్యార్థిని హత్య కేసును అనంతపురం పోలీసులు చేదించారు. ఈ నెల మూడవ తేదీ రాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థిని కనిపించడం లేదంటూ నాలుగవ తేదీ తల్లిదండ్రులు అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినప్పటికీ నాలుగు రోజులుగా ఆచూకీ తెలియ రాలేదు. కూడేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మణిపాల్ స్కూల్ వెనుక ప్రాంతంలో గుర్తుతెలియని ఒక అమ్మాయి డెడ్ బాడీ కనిపించడంతో అలర్ట్ అయిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బంధువులకు సమాచారాన్ని అందించారు. అప్పటికే గుర్తుతెలియని బాడీ పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో కుటుంబ సభ్యులను తీసుకువచ్చి చూపించడంతో చేతి పై ఉన్న ఒక టాటూ ద్వారా అక్కడ చనిపోయి ఉన్నది తమ కుమార్తెనని నిర్ధారించుకున్నారు.
ప్రధాన నిందితుడు నరేష్ అరెస్ట్
అనంతపురం నగరం రామకృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులకు అదే ఏరియా కు చెందిన కురుబ నరేష్‌తో పరిచయం ఏర్పడింది. గత మూడు నెలలుగా వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పలుమార్లు తాను పెళ్లి చేసుకోవాలని నరేష్ ను మనర్ బాలిక డిమాండ్ చేస్తుంది. అప్పటికే నరేష్ కు పెళ్లి అయి నాలుగు సంవత్సరాలు అవడంతో రెండవ పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పేశాడు. దీంతో విద్యార్థిని బలవంతం చేయడంతో నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణిపాల్ స్కూల్ వెనుక వైపు నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి బండరాయితో తలపై మోదీ కిరాతకంగా హతమార్చాడు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు కురుబ నరేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.
కేసులో సీఐ సస్పెండ్ :
అంతపురం నగరంలో సంచలనం సృష్టించిన ఇంటర్మీడియట్ విద్యార్థిని కేసులో అనంతపురం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ జాప్యం చేశాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వన్టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ సకాలంలో స్పందించలేదంటూ ప్రజాసంఘాలు కూడా ఆందోళనకు దిగాయి. ఒకటో పట్టణ పోలీసులు సకాలంలో సహకరించి ఉంటే మృతురాలు తన్మయి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని బంధువులు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి ఒకటో పట్టణ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ పై సస్పెన్షన్ వేటును వేశారు జిల్లా ఎస్పీ జగదీష్ బాబు.





















