అన్వేషించండి

Crime News: 'ఇస్రోలో ఉద్యోగం, వంద ఎకరాల ఆసామి' - 4 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్

Eluru News: ఇస్రోలో ఉద్యోగమని.. విల్లాలు, బంగ్లాలు ఉన్నాయని.. వందెకరాల ఆసామినని నమ్మిస్తాడు. ఇలా ఇప్పటివరకూ 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఐదో పెళ్లికి సిద్ధమవుతుండగా పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.

Police Arrested Multiple Marriages Fraud Man In Eluru: ఇస్రోలో జాబ్ అంటాడు. తనకు వంద ఎకరాలు, విల్లాలు, బంగ్లాలు ఉన్నాయని నమ్మిస్తాడు. సినిమాల్లో చూపించినట్లుగానే నకిలీ కుటుంబ సభ్యులను సృష్టిస్తాడు. ఇంకా పెళ్లి కాలేదని బుకాయిస్తాడు. మాటల గారడీతోనే ఎదుటి వారిని మాయ చేస్తాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఎట్టకేలకు పాపం పండి నిత్య పెళ్లికొడుకుగా విరాజిల్లుతోన్న నిందితుడిని ఏలూరు జిల్లా పోలీసులు కటాకటాల్లోకి నెట్టారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ నిందితుడి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం బంగారుపేటకు చెందిన అంశం అనిల్‌బాబు అలియాస్ కల్యాణ్ రెడ్డి ప్రస్తుతం ఖమ్మం జిల్లా మధిరలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. 9వ తరగతి వరకూ చదివిన అనిల్‌బాబు ఓ మ్యాట్రిమోనిలో కల్యాణ్‌రెడ్డిగా రిజిస్టర్ చేయించుకున్నాడు. దీని ద్వారా తనను సంప్రదించిన వారికి ఫోన్ చేసి, కల్యాణ్ రెడ్డి (వరుడు) తండ్రిని మాట్లాడుతున్నానని చెప్పేవాడు.

'తమ అబ్బాయి ఇస్రోలో హెచ్ఆర్ ఇంఛార్జీ అని.. తాను, తన భార్య ఇంజినీర్లుగా పని చేస్తున్నాం. మా అబ్బాయి పెళ్లిచూపులకు వస్తాడు.' అని నమ్మించేవాడు. తీరా పెళ్లిచూపులకు వెళ్లిన తర్వాత తాను ఒక్కడే వెళ్లి తన తల్లిదండ్రులకు సెలవు దొరక్క రాలేకపోయారని చెప్పేవాడు. తనకు విల్లాలు, బంగ్లాలు ఉన్నాయని వారిని నమ్మించేవాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ శివారు చేవెళ్లలో ఓ ఫాంహౌస్, బెంగుళూరులోని ఓ విల్లా అద్దెకు తీసుకుని అవి తన సొంతం అని చెప్పేవాడు. ఓ వ్యక్తిని, పెళ్లి చేసే పంతులును ఎల్లప్పుడూ వెంటే ఉంచుకునేవాడు. 

ఐదో పెళ్లి చేసుకోబోయి..

నాలుగు పెళ్లిళ్లు చాలవన్నట్లు ఐదో పెళ్లి చేసుకునేందుకు అనిల్ బాబు సిద్ధపడ్డాడు. 2023లోనే ఇందుకు ప్రణాళిక వేశాడు. ఇందులో భాగంగానే భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన గుండా లక్ష్మీకుమారిని సంప్రదించాడు. ఆమె రెండో కుమార్తెను వివాహం చేసుకుని, మూడో కుమార్తెకు ఇస్రోలో ఉద్యోగం ఇప్పిస్తానని మాటిచ్చాడు. ఈ క్రమంలో వారి నుంచి పలు దఫాలుగా రూ.9.53 లక్షలు కాజేశాడు. తన వద్ద పని చేస్తోన్న తుంగా శశాంక్ అనే మహిళతో ఇంటర్వ్యూ చేయించి ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్ కూడా ఇప్పించాడు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన బాధితురాలు భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ విల్సన్ దర్యాప్తు చేశారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో గుండుగొలను సమీపంలో నిందితులను తాజాగా అరెస్ట్ చేశారు. పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

పెళ్లిళ్ల పేరుతో రూ.1.50 కోట్లు కాజేశాడు

అనీల్‌బాబు గతంలో పెళ్లిళ్లు చేసుకున్న వారి నుంచి సైతం ఉద్యోగాలిప్పిస్తానని మోసగించి రూ.1.50 కోట్ల వరకూ కాజేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడితో సహా వైఎస్సార్ జిల్లా యర్రగుంట్లకు చెందిన తుంగా శశాంక్, కారు డ్రైవర్ నంద్యాల జిల్లా బనగానిపల్లి మండలం బత్తులూరుపాడుకు చెందిన పల్లె హేమంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2 లక్షల నగదు, కారు, సెల్ ఫోన్లు, 13 సిమ్‌లు, నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, ల్యాప్ టాప్స్, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Crime News: అత్త చెవి కొరికేసిన కోడలు - అతికించలేమన్న వైద్యులు, గుంటూరు జిల్లాలో దారుణం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget