అన్వేషించండి

Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!

Elkathurthy Murder Case | హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో లభించిన గోదావరిఖనికి చెందిన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. తండ్రి రాజేశం ఆదేశంతోనే ప్రియుడు వినోద్ ఈ హత్య చేశాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎల్కతుర్తి కారు డిక్కీలోని మృతదేహం మానసగా పోలీసులు గుర్తించారు.
  • వివాహిత ప్రియుడు వినోద్‌పై పెళ్లి ఒత్తిడితో గొంతు నులిమి చంపాడు.
  • కుమార్తె పరువు తీస్తోందని తండ్రి హత్య చేయమని కోరాడు.
  • ప్రధాన నిందితుడు వినోద్ అరెస్ట్; తండ్రిని కూడా అదుపులోకి తీసుకోవచ్చు.

ఎల్కతుర్తి: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో కారు డిక్కీలో మహిళ మృతదేహం లభ్యమైన కేసు మిస్టరీ వీడింది. ఈ సంచలన కేసును  కాజీపేట పోలీసులు ఛేదించారు. వివాహిత తండ్రి చెప్పడంతో ప్రియుడే ఆమెను హత్య చేశాడని విచారణలో తేలడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు. 

ఆ మృతిచెందిన మహిళ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానస (33)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. స్వయంగా మానస తండ్రే ఆమెను హత్య చేయమని చెప్పినట్లు విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి ఎల్కతుర్తికి చెందిన ఆమె ప్రియుడు వినోద్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా నిజాలు బయటకొచ్చాయి.

కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్‌రెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు. మానస అనే మహిళకు గతంలో రెండు వివాహాలు కాగా విడాకులు తీసుకుని ప్రస్తుతం పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో కరీంనగర్‌కు చెందిన వినోద్‌కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల అరుణాచలం వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన మానస వినోద్ గదికి వెళ్లి అతడితో గడిపింది. 

తనను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ప్రియుడు వినోద్‌పై  తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో వినోద్ ఈ విషయాన్ని మానస తండ్రి రాజేశంకు ఫోన్ చేసి చెప్పాడు. కుమార్తె తమ మాట వినకుండా ఇష్టారీతిన తిరుగుతూ కుటుంబ పరువు తీస్తోందని తండ్రి రాజేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వల్ల పరువుపోతోందని, చంపేసినా పర్లేదని వినోద్‌కు చెప్పాడు. ఏదో ఒకటి చేసి ఆమె వల్ల కలుగుతున్న ఇబ్బందిని, పరువు సమస్యను తీర్చాలని కోరాడు. 

తాను నచ్చజెప్పినా వినకుండా పెళ్లి చేసుకోవాల్సిందేనని వినోద్‌తో మానస గొడవ పడింది. ఓ వైపు కుటుంబసభ్యులకు టార్చర్ చూపిస్తున్న మానస మరోవైపు పెళ్లి చేసుకోవాలని తనను వేధిస్తుందని ఆగ్రహంతో  గొంతు నులిమి ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కారు (TS 03 FF 8094) డిక్కీలో పెట్టి ఎల్కతుర్తిలోని తన ఇంటి ప్రాంగణానికి తీసుకొచ్చాడు. మానస మృతదేహాన్ని పాతిపెట్టేందుకు తవ్వకం ఏర్పాట్లు చేస్తుండగా కారు నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మానస మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెను హత్య చేసిన వినోద్‌కుమార్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. హత్య చేయాలని చెప్పిన ఆమె తండ్రిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

Frequently Asked Questions

ఎల్కతుర్తిలో కారు డిక్కీలో లభ్యమైన మహిళ మృతదేహం ఎవరిది?

ఆ మహిళ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానస (33)గా పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహం ఎల్కతుర్తి శివారులో ఓ కారు డిక్కీలో లభ్యమైంది.

మానసను ఎవరు హత్య చేశారు, దీనికి గల కారణం ఏమిటి?

మానస ప్రియుడు వినోద్‌కుమార్ ఆమెను హత్య చేశాడు. పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేయడంతో ఆగ్రహంతో గొంతు నులిమి చంపినట్లు విచారణలో తేలింది.

ఈ హత్య కేసులో వెలుగు చూసిన దిగ్భ్రాంతికర విషయం ఏమిటి?

మానస వల్ల కుటుంబ పరువు పోతోందని, చంపేసినా పర్లేదని స్వయంగా ఆమె తండ్రి రాజేశం ప్రియుడు వినోద్‌కు చెప్పడం ఈ కేసులో దిగ్భ్రాంతికర విషయం.

హత్య జరిగిన తర్వాత మృతదేహాన్ని వినోద్‌కుమార్ ఏం చేశాడు?

వినోద్‌కుమార్ మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి ఎల్కతుర్తిలోని తన ఇంటి ప్రాంగణానికి తీసుకొచ్చాడు. పాతిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండగా కారు నుంచి దుర్వాసన రావడంతో కేసు బయటపడింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Vijayawada Digital Arrest: విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget