Dead Woman Found Alive: భార్య హత్య కేసులో జైలుకెళ్లిన భర్త, కొన్నేళ్ల తరువాత రెండో భర్తతో కనిపించిన మహిళ
Dead Woman Found ALive: భార్యను చంపిన నేరానికి శిక్ష అనుభవించాడు ఓ భర్త. తీరా చూస్తే సడెన్ గా రెండో భర్తతో ఆ మహిళ కనిపించింది.
Dead Woman Found: భార్యను చంపిన నేరానికి శిక్ష అనుభవించాడు ఓ భర్త. తీరా చూస్తే సడెన్ గా రెండో భర్తతో ఆ మహిళ కనిపించింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. చాలా కాలం కిందట చనిపోయిందని భావించిన ఒక మహిళ తన రెండవ భర్తతో కనిపించింది. అంతేకాదు... సంతోషంగా జీవిస్తోంది. కానీ ఆమెను హత్యచేశాడనే నేరం మీద మొదటి భర్త 18 నెలల జైలు శిక్ష అనుభవించాడు. హత్య చేస్తే ఎలా బతికొచ్చిందంటూ మొదటి భర్త ఫిర్యాదు చేయడంతో ఆమహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. వివాహిత, ఆమె తండ్రి కలిసి హత్య నాటకం ప్లాన్ చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఆర్తీ దేవి భర్త సోను సైనీ 18 నెలల జైలుశిక్ష అనుభవించాడు. అతని స్నేహితుడు గోపాల్ సైనీ, ఆమెను హత్య చేసినందుకు తొమ్మిది నెలల జైలు శిక్ష అనుభవించాడు. ఇద్దరూ బెయిల్ పై విడుదలయ్యారు. పోలీసుల రికార్డుల ప్రకారం... ఆర్తి 2015 లో ఉత్తర ప్రదేశ్ లోని బృందావన్ లో తన అద్దె ఇంటి నుంచి అదృశ్యమైంది. ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కాగా, తన కూతురిది అని ఆర్తి తండ్రి నిర్ధారించాడు. మహిళ తండ్రి బృందావన్ పోలీస్ స్టేషస్టే న్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చర్యలు చేపట్టిన పోలీసులు 2016లో హత్య కేసునమోదు చేశారు. ఆర్తి భర్త, అతని స్నే హితుడ్ని అరెస్టు చేశారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు ఇద్దరిని పట్టుకున్నందుకుగాను 15 వేల రూపాయల రివార్డు కూడా లభించింది.
ఒక పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.... రాజస్థాన్‌లోని కరౌలి, దౌసా జిల్లాల సరిహద్దులో ఉన్న మెహందీపూర్ బాలాజీ ఆలయాన్నితన తండ్రి సందర్శిం చినప్పుడు ఆర్తి దేవిని సోనూ సైనీ కలిశాడు. కొన్ని రోజుల తరువాత వారు వివాహం చేసుకున్నారు. కొంతకాలం కలిసి జీవించారు. అంతా బాగానే ఉందనుకుంటూ ఉండగానే వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాాయి. ఏం జరిగిందో తెలీదు కానీ సోనూ సైనీ భార్య ఆర్తి ఏడేళ్ల కిందట ఉత్తర ప్రదేశ్లోని తన అద్దె ఇంటి నుంచి బయటికెళ్లి అదృశ్యమయ్యింది. ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించగా, తన కూతురేనని ఆర్తి తండ్రి నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యా దు చేసిన ఆమె తండ్రికి తెలియజేయకుండా హత్య అభియోగాన్ని మార్చి 2016లో FIRలో చేర్చి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్తి హత్య కేసులో భర్త సోను సైనీ, గోపాల్ లు 18 నెలల జైలు జీవితం గడిపారు. తర్వాత వారికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని పోలీసు అధికారి తెలిపారు. ఇప్పుడు, ఆరు సంవత్సరాల తరువాత, సోను, గోపాల్ లకు చనిపోయిన మహిళ కనిపించడంతో ట్విస్ట్ జరిగింది. 'చనిపోయిందనుకుంటున్న ఆర్తి...' రెండవ భర్తతో యూపీలో నివసిస్తున్నట్లు తెలుసుకున్నారు. వీరిద్దరూ మధుర పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె రెండు వేర్వరు గుర్తింపు కార్డులను కలిగి ఉన్నట్లు గుర్తించారు. మహిళ రెండు వేర్వేరు పుట్టిన తేదీలను కలిగి ఉన్న రెండు ఆధార్ కార్డులను కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు తమకు న్యాయం చేయాలని విజప్తి చేస్తున్నారు.