అన్వేషించండి

Cyber Crimes: రాష్ట్రంలో సైబర్ నేరాలు - డీజీపీ ఫోటో డీపీతో బెదిరింపులు, మరోచోట ఏపీకే లింక్‌తో నగదు స్వాహా

Telangana News: రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా డీజీపీ ఫోటో డీపీతోనే మోసాలకు తెరలేపారు. అటు, ఏపీకే లింక్స్ తో నలుగురి ఖాతాల్లో ఏకంగా రూ.3.25 లక్షలు దోచేశారు.

Cyber Crime With Telangana DGP Whatsapp DP: ఫోన్ కాల్స్, ఉద్యోగాలు, లాటరీ వంటి వాటి పేరుతో సైబర్ నేరగాళ్లు ఇప్పటివరకూ మోసాలకు పాల్పడడం చూశాం. తాజాగా, తెలంగాణ డీజీపీ (Telangana DGP)  రవిగుప్తా ఫోటోతోనూ కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. పోలీస్ బాస్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టి మోసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యాపారవేత్తకు, ఆయన కుమార్తెకు వాట్సాప్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామని.. కేసు నుంచి తప్పించాలంటే రూ.50 వేలు డిమాండ్ చేశారు. అయితే, దీనిపై అనుమానం వచ్చిన వ్యాపారవేత్త సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగుచూసింది. విచారించిన పోలీసులు పాకిస్థాన్ కోడ్ +92తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు గుర్తించారు. అలాంటి కాల్స్ లిఫ్ట్ చెయ్యొద్దని పోలీసులు సూచిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పోలీసులు సాంకేతికత ఆధారంగా ఎంత కట్టడి చేస్తున్నా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో సైబర్ నేరాలకు సంబంధించి 15,297 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

కొత్త తరహా మోసం.. రూ.3.25 లక్షలు స్వాహా

అటు, సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసంతో రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లాలో నలుగురి ఖాతాల్లో నగదు స్వాహా చేశారు. వాట్సాప్ గ్రూపుల్లోని ఫోన్ నెంబర్లను హ్యాక్ చేసి, వారి పేరిట ఏపీకే లింక్స్ షేర్ చేశారు. తెలిసిన వారే పంపారని ఆ లింక్స్ ఓపెన్ చేయగా.. వారి ఖాతాల్లో నగదు మాయమైంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గంభీరావుపేటకు చెందిన పాల సంఘం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి పేరిట సంఘం వాట్సాప్ గ్రూపులో ఏపీకే లింక్ పంపించారు. ఆయన దీన్ని ఓపెన్ చేయగానే అతని ఖాతాలోని రూ.45,500, అలాగే లింక్స్ తెరిచిన దండు నరేశ్ అనే వ్యక్తి ఖాతా నుంచి రూ.44,900, లింగారెడ్డిగారి రాజశేఖర్ రెడ్డి అకౌంట్ నుంచి రూ.50 వేలు, కోటయ్యగారి లత ఖాతా నుంచి రూ.1.85 లక్షలు ఇలా 4 రోజుల్లో నలుగురి బ్యాంక్ అకౌంట్స్ నుంచి రూ.3.25 లక్షలను సైబర్ నేరగాళ్లు దోచేశారు. ఫోన్లకు వచ్చిన మెసేజ్ చూసి బ్యాంకులను సంప్రదించగా సిబ్బంది నగదు డెబిట్ అయినట్లు తెలిపారు. దీంతో వీరు సోమవారం గంభీరావుపేట ఠాణా పోలీసుల సాయంతో సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు. దీనిపై వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

'ఫెడెక్స్ కొరియర్ పేరుతో...'

ఏపీకే లింక్స్, ఓటీపీ, ఓఎల్ఎక్స్ ఇలా రకారకాలుగా కాదేదీ మోసం చేయడానికి అనర్హం అంటూ అన్ని మార్గాల్లోనూ సైబర్ కేటుగాళ్లు డబ్బులు దోచేస్తున్నారు. ప్రజల అవగాహన లేమి, కొందరి అత్యాశను వీరు క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా, ఫెడెక్స్ కొరియర్ పేరుతోనూ సైబర్ నేరస్థులు మోసాలకు తెర లేపినట్లు తెలుస్తోంది. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. కేటుగాళ్లు FedEx కొరియర్ పేరుతో కాల్ చేస్తారు. మీ ఆధార్ నెంబర్ తో పార్శిల్ వచ్చిందని అందులో డ్రగ్స్ పట్టుబడ్డాయని ఆందోళనకు గురి చేస్తారు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడితే కఠిన శిక్షలు ఉంటాయని చెప్పి బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారు.

'అప్రమత్తంగా ఉండాలి'

అయితే, ఇలాంటి వారి పట్ల అలర్ట్‌గా ఉండాలని.. ధైర్యంగా ఎదుర్కోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 'FedEx పార్శిల్స్ పేరుతో మోసపూరిత కాల్స్ నమ్మొద్దు. పోలీసులమని చెబితే డబ్బులు ఇవ్వొద్దు. ఏమైనా సందేహాలుంటే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. మనం తప్పు చేయనంత కాలం ఆందోళన చెందాల్సిన పని లేదు. అలాంటి కాల్స్ వస్తే భయపడకుండా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి.' అని సూచించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget