అన్వేషించండి

Chittor Crime News : క్లూ వదలకుండా దొంగతనం చేయడం వారి స్టైల్ - కానీ వారినీ పట్టేయడం చిత్తూరు పోలీసుల స్పెషాలిటీ !

ఏళ్లుగా దొంగతనాలు చేస్తూ ఎవరికీ చిక్కని ముఠాను చిత్తూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున సొత్తు స్వాధీనం చేసుకున్నారు.


Chittor Crime News :   బ్యాంకులు, బంగారు నగల దుకాణాలు, పాన్ బ్రోకర్ దుకాణాలు,‌ఒంటరి ఇండ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చేందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను చిత్తూరు ‌పొలీసులు అరెస్టు చేశారు. ఎటువంటి క్లూస్ దొరకకుండా  15 ఏళ్ళుగా దొంగతనాలకు పాల్పడుతూ 10 ఏళ్ళుగా పోలీసులకు చిక్కకుండా చత్తీస్‌గఢ్ లో స్ధావరం ఏర్పరుచుకుని నాలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెడుతోంది ఈ గ్యాంగ్.  ఒక్కటిన్నర నెలగా వివిధ రాష్ట్రాలను దర్యాప్తు సాగించి ఎట్టకేలకు ముఠా సంబంధి వివరాలను సేకరించి ముఠాలోఏ-1,ఏ-2 ప్రధాన నిందితులును పోలీసులు చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుండి 55 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 3 కార్ల స్వాధీనం చేసుకున్నా చిత్తూరు పోలీసులు. 

ఏళ్లుగా ఎవరికీ చిక్కకుండా.. దొరకకుండా దొంగతనాలు !

చిత్తూరు జిల్లాలో  ఇటీవల గంగాధర నెల్లూరు పొలీసు స్టేషన్ ఫరిధిలో పాన్ బ్రోకర్ షాపులో  భారీ దొంగతనం జరిగింది.  ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గత ఒకటిన్నర నెల నుండి ఈ కేసు గురించి దక్షిణ భారత దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో తిరిగి నేరస్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.  శనివారం సాయంత్రం 3.00 గంటలకు ప్రత్యేక బృందానికి అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు చిత్తూరు మండలం పరిధిలోని బెంగళూరు – తిరుపతి రోడ్డులోని చెర్లోపల్లి వద్ద  మురుగన్ శివగురు @ కరాటే మురుగా,  రాజాలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 15 లక్షల నగదు, 395 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 kg ల వెండి, నేరానికి ఉపయోగించిన 3 కార్లను మొత్తం 55 లక్షల విలువ చేసే క్రైం ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు. 

క్లూస్ దొరకకపోయినా నేరస్తుల్ని పట్టుకున్న చిత్తూరు పోలీసులు 

పట్టుబడి ముద్దాయిలను విచారించిన సమయంలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ సహచర బృందంతో కలిసి గత 15 సంవత్సరాల నుండి దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలోని బ్యాంకులు, పాన్ బ్రోకర్ షాపులు, నగల షాపులు, ఒంటరి ఇండ్లలో దొంగతనాలకు పాల్పడి భారి మొత్తాలను దోచుకొని జల్సా చేస్తూ పోలిసుల కళ్ళు గప్పి తప్పించుకొని తిరుగే వారని తేలిసిందని చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి ప్రకటించారు.  ఈ ముఠా బృందంలోని సభ్యులు ఒకరిద్దరు అక్కడక్కడ అరెస్టు అవుతున్నప్పటికీ, గ్యాంగ్ లీడర్ లు అయిన A-1 M.మురుగన్ శివగురు @ కరాటే మురుగా, A-2 రాజా మాత్రం గత 10 సంవత్సారల నుండి తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి పోలిసులకు కనిపించలేదన్నారు. తన స్థావరాన్ని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొని, తన బృందంతో కలిసి నేరాలకు పాల్పడి తిరిగి ఛత్తీస్ ఘడ్ వెళ్లి తలదాచుకొనే వాడని,  ఈ ఇరువురుపై నాలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 42 కేసులు నమోదు అయి పెండింగ్ లో వున్నట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు. 

గ్యాంగ్ లీడర్లు అరెస్ట్ మిగిలిన వారి కోసం గాలింపు 

చిత్తూరు జిల్లాలో కూడా గతంలో చిత్తూరు టౌన్, ఐరాల పొలిసు స్టేషన్ ఫరిదిలలో దొంగతనాలు చేసారని తెలిసిందన్నారు.. ఇద్దరు ముద్దాయిలు తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్‌పట్టు జిల్లా, వైపాన గ్రామంకు చేందిన‌వారుగా గుర్తించడం జరిగిందన్నారు.  ఈ‌ము ఠాలో తమిళనాడుకు చేందిన  మనికంట, నల్ల‌మురుగా, సెల్వరాజ్, పయని, వేంకటేష్, పేరుమాల్, కర్ణాటక రాష్ట్రంకు చేందిన సురేష్, పాండిచేరికి చేందిన రంజిత్ లను అరెస్టు చేయాల్సి ఉందని, వీరి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాంమని, త్వరలో వీరికి అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు.  ఇక ఎటువంటి క్లూస్ లేని అత్యంత క్లిష్ట మైన ఈ కేసులో గత ఒకటిన్నర నెల నుండి దాదాపు దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలన్ని తిరిగి సమాచారాన్ని సేకరించి ఎట్టకేలకు కేసును చేధించిన పోలీసులకు ఎస్పీ రివార్డులు ప్రకటించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Embed widget