IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Chittoor: డబ్బుల కోసం కొడుకు అఘాయిత్యం, తల్లిపై దివ్యాంగుడు విచక్షణారహితంగా దాడి

Chittoor: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ కొడుకు తన కన్న తల్లిపై కత్తితో దాడి చేసి, విచక్షణా రహితంగా గాయపరిచిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

FOLLOW US: 

ఈ సృష్టిలో కనిపించే దైవం ఎవరైనా ఉన్నారు అంటే అది తల్లి మాత్రమే. బిడ్డల క్షేమమే తన క్షేమంగా భావించి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది తల్లి. అందుకే ఈ లోకంలో అమ్మ ప్రేమ, అనురాగాని కంటే విలువైనది మరోకటి‌ లేదు అంటారు పెద్దలు. అలాంటి తల్లికి అపకారం చేయాలని ఏ కొడుకూ కలలోనైనా అనుకోడు. తాజాగా మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ కొడుకు తన కన్న తల్లిపై కత్తితో దాడి చేసి, విచక్షణా రహితంగా గాయపరిచిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతుంది.

వివరాల్లోకి వెళ్ళితే. కుప్పం‌ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీలో సక్కుబాయి (68) నివాసం ఉంటుంది. భర్త మునెప్ప మృతి చెందడంతో ప్రభుత్వం అందించే వితంతువు పింఛను ద్వారా కాలం గడుపుతూ వస్తుంది. సక్కుబాయి భర్త మున్నెప్ప పిల్లలు లేరని కారణంగా మూడు వివాహాలు చేసుకున్నాడు. వీరిలో మొదటి భార్య అయినా సక్కుబాయికి, రెండోవ భార్యకు కూడా పిల్లలు లేరు. మూడోవ భార్య కుమారుడైన జీవన్(35) పుట్టుకతో మూగ, చెవుడుతో పుట్టాడు. తమ కుటుంబంలో ఒక్కగానొక్క సంతానం కావడంతో ఆ ముగ్గురు తల్లులు చిన్నతనం నుండి జీవన్ ను అల్లారు ముద్దుగా పెంచారు.  

దీంతో జీవన్ ఏ కష్టం తెలియకుండా పెరగడంతో జులాయిగా తిరుగుతూ మద్యం మత్తుకు బానిసగా మారాడు. జీవన్ తనకు వచ్చే వికలాంగులు పింఛను కూడా మద్యానికే ఖర్చు చేసేవాడు. అంతే కాకుండా మద్యం కొనేందుకు డబ్బుల కోసం నిత్యం కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేసేవాడు. అగిడినంత డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేసేవాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఇరుగు పొరుగు వారి ద్వారా సక్కుబాయి జీవన్ కు భయం పెట్టించింది. 

దీంతో కొద్ది రోజుల పాటు మద్యం మానివేసినట్లు నటించిన జీవన్, తన తండ్రి సంపాదించిన ప్లాట్ ను తన పేరు మీదుగా రాయాలని సక్కుబాయిని వేధింపులకు గురి చేసేవాడు. ఎవరూ ఎంత చెప్పినా జీవన్ మాత్రం వినేవాడు కాదు. రోజు పుల్ గా మద్యం సేవించి సక్కుబాయి ఇంటి ముందు గొడవకు దిగ్గేవాడు. ఆస్తిని జీవన్ పేరు మీదగా రాస్తే ఆసరాగా ఉన్న ప్లాటును మద్యం కోసం అమ్మేస్తాడని భావించి సక్కుబాయి అందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన జీవన్ సక్కుబాయితో నిన్న సాయంత్రం గొడవ పడి ఇంటి నుండి బయటకు వెళ్ళి పుల్ గా మద్యం సేవించి ఇంటి తిరిగి వచ్చి మద్యం సేవించేందుకు డబ్బులు కావాలని గొడవకు దిగాడు. దీంతో సక్కుబాయి, జీవన్ మధ్య కొంత సేపు వాగ్వాదం చోటు చేసుకుంది.

మద్యం మత్తులో ఉన్న జీవన్ మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్చలేదని ఆగ్రహించి అర్ధరాత్రి ఇంటిలో ఉన్న కత్తితో ఒక్కసారిగా సక్కుబాయిపై దాడికి దిగాడు. దీంతో సక్కుబాయి తీవ్రంగా గాయాల పాలైంది. సక్కుబాయి ఇంటిలో నుండి కేకలు వినిపించడంతో ఘటన స్ధలానికి చేరుకున్న ఇరుగుపొరుగు వారు తీవ్ర రక్తస్రావంలో పడి ఉన్న సక్కుబాయిని కుప్పం ఆసుపత్రికి తరలించారు. అయితే తల్లిని తీవ్రంగా గాయపరిచిన జీవన్ మద్యం మత్తులో సృహ కోల్పోయి సంఘటన స్ధలంలో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Published at : 01 May 2022 10:31 AM (IST) Tags: Chittoor News Chittoor Crime Kuppam News Son attacks mother alcohol adiction Son attacks mother

సంబంధిత కథనాలు

Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్

Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్

DK SrinivaS Arrest : డ్రగ్స్ కేసులో డీకే ఆదికేశవులు కుమారుడు - బెంగళూరులో అరెస్ట్ చేసిన ఎన్సీబీ !

DK SrinivaS Arrest :  డ్రగ్స్ కేసులో డీకే ఆదికేశవులు కుమారుడు - బెంగళూరులో అరెస్ట్ చేసిన ఎన్సీబీ !

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Goa News: దొంగల నయా ట్రెండ్- ఇల్లంతా దోచేసి, లవ్ లెటర్ రాసి పరార్!

Goa News: దొంగల నయా ట్రెండ్- ఇల్లంతా దోచేసి, లవ్ లెటర్ రాసి పరార్!

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది

Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Horoscope Today 26th May 2022: ఈ రాశివారి బలహీనతను ఉపయోగించుకుని కొందరు ఎదుగుతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 26th May 2022:  ఈ రాశివారి బలహీనతను ఉపయోగించుకుని కొందరు ఎదుగుతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి