అన్వేషించండి

Lady Thief Arrest: బస్సులో పక్క సీట్లో కూర్చుంటుంది - అమాయకంగా నటిస్తుంది, ఆ తర్వాత !

జాలి ఉన్నవారే ఆమె టార్గెట్, లేచి సీటిస్తామంటే వద్దంటుంది, పక్కకి జరగండి బాబు చాలు అంటూ పక్కనే కూర్చుంటుంది. ఇక ఆ తర్వాత ఆమె చేసేది ఏంటంటే..?

బస్సులో నిలబడి ప్రయాణిస్తున్నవారిన చూసి కొంతమంది పట్టించుకోరు, ఇంకొంతమంది జాలిపడతారు కానీ ఇంకేమీ చేయరు, మరికొంతమంది మాత్రం తాము లేచి సీటు ఇస్తారు, లేదా సర్దుకుని వారికి కూడా స్థానం చూపిస్తారు. అలాంటి జాలి ఉన్నవారే ఆమె టార్గెట్, లేచి సీటిస్తామంటే వద్దంటుంది, పక్కకి జరగండి బాబు చాలు అంటూ పక్కనే కూర్చుంటుంది. ఇక ఆ తర్వాత ఆమె చేసేది ఏంటంటే..?

కేరాఫ్ కుప్పం..

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన పసుపులేటి రేణుక ఓ దొంగ. చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. అలాంటి రేణుకకు ఓ బంపర్ ఆఫర్ తగిలింది. ఏకంగా 10.32 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని ఆమె సింగిల్ అటెంప్ట్ లో దొంగిలించింది. అయితే ఆ తర్వాతే పోలీసులకు చిక్కింది. నెల్లూరు జిల్లా కావలి పోలీసుల రేణుకను అరెస్ట్ చేశారు. బంగారం స్వాధీనం చేసుకున్నారు.

రేణుక ఎలా దొంగతనం చేస్తుందంటే..?

చంటి బిడ్డను చంకన వేసుకుని రేణుక బస్సు ఎక్కుతుంది. రద్దీగా ఉన్న బస్సుని చూసుకుని మరీ ఆమె ఎక్కుతుంది. ఆ తర్వాత ఎవరైనా అమాయకంగా కనిపిస్తే వారి సీటు పక్కన వెళ్లి నిలబడుతుంది, ఇక యాక్షన్ మొదలు పెడుతుంది. బాబూ.. చిన్న బిడ్డ ఉన్నాడయ్యా.. నిలబడలేను.. కొంచెం సీటు ఇవ్వండయ్యా.. మీకు పుణ్యం ఉంటుంది అంటూ డ్రామా స్టార్ట్ చేస్తుంది. చేతిలో చిన్న బిడ్డ ఉంటాడు కాబట్టి ఆమె మాటలు నిజమనుకుని నమ్మి చాలామంది సీటు ఇస్తారు. ఆ తర్వాత వారితో మాట కలిపి వారి దగ్గర ఉన్న వస్తువులను దొంగతనం చేసి మధ్యలోనే దిగిపోతుంది రేణుక. ఆ తర్వాత స్టేజీ వచ్చాక వారు జేబులు చూసుకుంటే ఖాళీగా ఉంటాయి, పర్సుల్లో విలువైన వస్తువులు మాయమవుతాయి. అలా రేణుక ఇప్పటికే చాలా దొంగతనాలు చేసింది.

తాజా చోరీ ఎలాగంటే..?

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని దావగూడూరుకు చెందిన కోసూరి వెంకటేశ్వర్లు నవంబర్ 15వ తేదీన కొంత ముడి బంగారం తీసుకుని బస్సు ఎక్కాడు. దాని బరువు 344 గ్రాములు, ధర సుమారు రూ.10.32 లక్షలు. సింగరాయకొండ నుంచి నెల్లూరు వచ్చేందుకు ఆయన బస్సు ఎక్కారు. అతడిని గమనించిన  రేణుక చిన్నారితో కలసి అదే బస్సు ఎక్కింది. బిడ్డకు చోటివ్వాలని ప్రాధేయపడి ఆయన పక్కనే వచ్చి కూర్చుంది. మార్గమధ్యంలో అతని బ్యాగ్‌ లోని బంగారాన్ని ఆమె దొంగిలించింది. కావలిలోని ఉదయగిరి ఫ్లైఓవర్ వద్ద బస్సు దిగిపోయింది రేణుక. వెంకటేశ్వర్లు బస్సు కావలి వచ్చాక దిగి బ్యాగ్ చూసుకోగా అందులో బంగారం లేదు. పోలీసులను ఫిర్యాదు చేశాడు వెంకటేశ్వర్లు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు చాలా చోట్ల వెతికారు.

చివరకు కావలి బస్టాండ్‌ లో ఉన్న రేణుకను అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర ఉన్న 344 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేణుకపై అప్పటికే ప్రకాశం జిల్లాలోని కంభం, నెల్లూరు జిల్లాలోని సంగం స్టేషన్‌ లో పలు కేసులు ఉన్నాయని తెలిపారు పోలీసులు. 2012 నుంచి దొంగతనం వృత్తిగా మార్చుకున్న రేణుక ఇప్పుడు మరోసారి పోలీసులకు చిక్కింది. నిందితురాలని పట్టుకోవడంతోపాటు, బంగారాన్ని జాగ్రత్తగా రికవరీ చేశారు పోలీసులు.

టాప్ హెడ్ లైన్స్

Adilabad Job Fraud Case: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
Hyderabad Jewellery Shop Fined 10 Lakh: లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Doctor Murder Case: భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget