News
News
వీడియోలు ఆటలు
X

Chittoor Crime News : ఇన్ స్టాలో పరిచయం ప్రేమగా, దుబాయ్ నుంచి చిత్తూరుకు- బ్యూటీషియన్ హత్య కేసులో వీడిన మిస్టరీ

Chittoor Crime News : చిత్తూరులో బ్యూటీషియన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియురాలిపై అనుమానంతోనే ప్రియుడే దారుణానికి పాల్పడ్డాడని నిర్ధారించారు. ే

FOLLOW US: 
Share:

Chittoor Crime News : చిత్తూరులో బ్యూటీషియన్ హత్య కేసు రాష్ట్ర ‌వ్యాప్తంగా సంచళనంగా మారిన విషయం తెలిసిందే. ఈ‌ కేసులో ఎట్టకేలకు పోలీసులు మిస్టరీని ఛేదించారు. ఈ నెల 18వ తేదీన కొండమిట్టలో బ్యూటీ పార్లర్ లో దుర్గా ప్రశాంతిని హత్య చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన చక్రవర్తిని తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద పోలీసులు అదుపులో‌ తీసుకుని రిమాండ్ కు తరలించారు.  

అసలేం జరిగింది?           

చిత్తూరు దిశా పోలీసు స్టేషన్ డీఎస్పీ బాబు ప్రసాద్ వెల్లడించిన వివరాల మేరకు.. చిత్తూరు కొండమిట్టలో గ్లో బ్యూటీ పార్లర్ నడుపుతున్న దుర్గాప్రశాంతికి గత ఏడాది అక్టోబర్ లో ఇన్ స్టా గ్రామ్ ద్వారా దుబాయిలో ఉండే చక్రవర్తి అనే వంట మాస్టర్ పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి అతను దుర్గాప్రశాంతితో చాటింగ్ చేస్తూ ఉండడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రశాంతి అంటే ఇష్టం పెంచుకున్న చక్రవర్తి తనని పెళ్లి చేసుకోమని కోరాడు. అయితే అందుకు చిత్తూరుకు వచ్చి ఇక్కడే ఉంటే, తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చని దుర్గా ప్రశాంతి చెప్పింది. ఎలాగైనా ప్రశాంతిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయంతో ఫిబ్రవరి 6వ తేదీన చక్రవర్తి దుబాయ్ నుంచి నేరుగా చెన్నైలో దిగితే ప్రశాంతి చెన్నై వెళ్లి చక్రవర్తిని చిత్తూరుకు పిలుచుకొని వచ్చింది. చక్రవర్తి చిత్తూరులో ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభించి, తన తల్లిని కూడా చిత్తూరుకు పిలిపించుకున్నాడు. చిత్తూరులో చక్రవర్తి తరచుగా ప్రశాంతిని కలుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ప్రశాంతి చక్రవర్తిని, అతని అమ్మని తన అమ్మ ఇందిరాకి కూడా పరిచయం చేసింది. అయితే ఈ మధ్యలో ప్రశాంతి తనని పట్టించుకోకుండా వేరే అబ్బాయితో సన్నిహితంగా ఉంటోందని, తనకి అబద్దం చెప్పి వేరే ఊరికి ఆ వ్యక్తితో వెళ్లిందని, ప్రశాంతి తన ఫోన్ ని స్విచాఫ్ చేయడంతో చక్రవర్తికి అనుమానం పెరిగి ఆమె కదలికలపై నిఘా పెట్టాడు. అయితే ఏప్రిల్ 17వ తేదీ రాత్రి ప్రశాంతి కోసం రైల్వే స్టేషన్లో కాపు కాశాడు చక్రవర్తి. ఆమె ట్రైన్లో నుంచి దిగి ఇంటికి వెళ్లాక రైల్వే స్టేషన్ దగ్గర ప్రశాంతితో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తితో చక్రవర్తి గొడవ పడ్డాడు. ఇది తెలుసుకున్న ప్రశాంతి చక్రవర్తితో ఫోన్లో బాగా గొడవపడి, అతనికి తను అనుకున్నట్టుగా ఏంలేదని, అంతగా అనుమానించే వ్యక్తితో తను భవిష్యత్తులో ఉండలేనని, ఇంట్లో వాళ్లు కూడా రోడ్డుపైన అమ్లెట్లు  వేసుకొనే వ్యక్తితో పెళ్లికి ఒప్పుకోరని కనుక అతను తన దారి తను చూసుకోవచ్చనీ,  ఫోన్లో తనతో ఉన్న చాటింగ్ అంతా తొలగించాలని ప్రశాంతి చెప్పింది. 

తననే ప్రేమించాలని దాడి 

దీంతో చక్రవర్తి దుర్గాప్రశాంతిపై ద్వేషం పెంచుకొని, బతికితే కలిసే బతకాలని, లేకపోతే కలిసే చావాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రశాంతి నమ్మించి తనను మోసం చేసిందని, తను బతకాల్సిన అవసరం లేదని తన ఫోన్ లో ఒక సూసైడ్ నోట్ రాసుకున్నాడు. ఏప్రిల్ 18వ తేదీ మధ్యాహ్నం బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఒంటరిగా ఉన్న దుర్గాప్రశాంతితో తన ప్రేమను ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని, తన కోసం అన్నీ వదులుకొని దుబాయ్ నుంచి వస్తే తనను పూర్తిగా పక్కన పెట్టేసిందని, తననే ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని గొడవ చేశాడు. వాదన ముదిరి, చక్రవర్తి విచక్షణ కోల్పోయి ప్రశాంతిపై దాడి చేసి చేశాడు. అతడు కూడా బ్లేడ్ తో చేతుల మీద, మణికట్టుల మీద కోసుకోవడం మొదలు పెట్టాడు. దీంతో చక్రవర్తి రక్తం ఒక్కసారిగా చిమ్మి తన మీద పడడంతో ప్రశాంతి ఊపిరాడక భయాందోళనతో కుప్పకూలిపోయింది. ఆమె చనిపోయిందని భావించి చక్రవర్తి తన గొంతు కూడా రెండు చోట్ల కోసుకొని రక్తస్రావంతో తను కూడ అపస్మారక స్థితిలో కూలిపోయాడు. 4 గంటలప్పుడు రక్తపు మడుగులో వాళ్లను చూసిన ప్రశాంతి అమ్మ పోలీసులకు సమాచారం ఇచ్చింది. కొనప్రాణంతో ఉన్న చక్రవర్తిని, ప్రశాంతిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో ప్రశాంతి అప్పటికే చనిపోయినట్టుగా ప్రకటించిన వైద్యులు, చక్రవర్తిని మెరుగైన వైద్యం నిమిత్తం తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించారు. ప్రశాంతి తండ్రి హెడ్ కానిస్టేబుల్ నాగరాజు ఫిర్యాదు మేరకు చక్రవర్తిపై హత్య, ఆత్మహత్యయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు... దిశా డీఎస్పీ బాబు ప్రసాద్ విచారణ చేపట్టారు. సాక్ష్యులను విచారించి ఆధారాలు సేకరించి, ఏప్రిల్ 26వ తేదీ చక్రవర్తిని తిరుపతి రూయ ఆసుపత్రి వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. 

Published at : 27 Apr 2023 08:59 PM (IST) Tags: Chittoor News Crime News Murder case Lover Beautician

సంబంధిత కథనాలు

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం

Delhi Murder Case: మాట్లాడటం లేదనే ఢిల్లీలో బాలిక హత్య- నేరాన్ని అంగీకరించిన సాహిల్

Delhi Murder Case: మాట్లాడటం లేదనే ఢిల్లీలో బాలిక హత్య- నేరాన్ని అంగీకరించిన సాహిల్

రూమ్‌ తీసుకున్నాడు, భార్యను పిలిచి చంపేశాడు - అనకాపల్లి జిల్లా లాడ్జ్‌ కేసు ఛేదించిన పోలీసులు

రూమ్‌ తీసుకున్నాడు, భార్యను పిలిచి చంపేశాడు - అనకాపల్లి జిల్లా లాడ్జ్‌ కేసు ఛేదించిన పోలీసులు

Jammu Bus Accident: జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు లోయలో పడి 10 మంది మృతి 

Jammu Bus Accident: జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు లోయలో పడి 10 మంది మృతి 

Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి

Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి

టాప్ స్టోరీస్

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?