అన్వేషించండి

NRI Student Murder: అమెరికాలో ఆంధ్రా విద్యార్థిని కాల్చి హత్య చేసిన దుండగులు, బుర్రిపాలెంలో విషాదం

Andhra Pradesh News : అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. బోస్టన్ వర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్‌ను దుండగులు పొట్టనపెట్టుకున్నారు.

Gun violence in the US: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. బోస్టన్ యూనివర్సిటీ(Boston University)లో ఇంజినీరింగ్ చదువుతున్న గుంటూరు జిల్లా(Guntur District) బుర్రిపాలెం(Burripalem)కు చెందిన అభిజిత్‌(Abhiji)ను దుండుగులు కాల్చి చంపారు. ఏకైక కుమారుడు మృతితో అభిజిత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా  విలపించారు.

అమెరికాలో ఆంధ్రా విద్యార్థి హత్య
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న తెలుగు విద్యార్థులు దారుణంగా హత్యకు గురవుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో నీగ్రోల చేతిలో హతమవుతున్నారు. కేవలం పర్సులో ఉన్న డబ్బు, ఒంటిపై ఉన్న బంగారు నగల కోసమే హత్యలు చేసే నల్లజాతీయులు అమెరికాలో చెలరేగిపోతుంటారు. ఇప్పుడు అలాంటి వారి చేతిలోనే మరో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంకు చెందిన పరుచూరి చంద్రశేఖర్, శ్రీలక్ష్మీ దంపతుల ఏకైక కుమారుడు అభిజిత్. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదివేందుకు వెళ్లాడు. అక్కడే రెండో ఏడాది ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అతను చదివే యూనివర్సిటీ క్యాంపస్‌లోనే అభిజిత్‌ను దారుణంగా హతమార్చి...మృతదేహాన్ని కారులోనే ఉంచి అడవిలో వదిలేశారు. ఈనెల 11న అభిజిత్‌ హత్య జరిగినట్లు అమెరికా పోలీసులు గుర్తించారు. ఆరోజు నుంచి అతను క్యాంపస్‌లో కనిపించకుండాపోవడంతో...స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభిజిత్ వాడుతున్న సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ ఆధారంగా అతని డెడ్‌బాడీని అడవిలోని నిర్జీవ ప్రదేశంలో పోలీసులు గుర్తించారు. 

ఏకైక కుమారుడు మృతి
పరుచూరి చక్రధర్‌, శ్రీలక్ష్మి దంపతులకు అభిజిత్ ఏకైక కుమారుడు కావడంలో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. చిన్నప్పటి నుంచి చదువులోనూ ఫస్ట్ వచ్చేవాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తామన్న కుమారుడిని మొదట వద్దని వారించినా...అతని భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తల్లి అంగీకరించింది. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సీటు రావడంతో వెళ్లిన అభిజిత్...ఇలా అర్థాంతరంగా ప్రాణాలు విడిచివెళ్లడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లి శ్రీలక్ష్మీ బోరున విలపిస్తోంది. అభిజిత్ హత్య గురించి తెలిసిన వెంటనే తండ్రి పరుచూరి చక్రధర్ కుప్పకూలిపోయారు. అక్కడి లాంఛనాలన్నీ పూర్తి చేసుకుని మృతదేహాన్ని బుర్రిపాలెం తరలించారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు విమానాశ్రయం నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాన్ని బుర్రిపాలెం తరలించారు. కుమారుడు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు  విలపించగా....విదేశాలకు వెళ్లిన యువకుడు శవంగా తిరిగిరావడంతో గ్రామంలోనూ విషాధ ఛాయలు అలముకున్నాయి. 

పెరిగిన హత్యలు
అమెరికాలో విదేశీయుల హత్యలు సర్వసాధారణమైనప్పటికీ...ఇటీవల కాలంలో భారతీయ విద్యార్థులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. అక్కడి గన్‌కల్చర్‌తో  విదేశీయుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. చిన్న చిన్న ఘటనలకే  తుపాకీలతో కాల్చి చంపండా అమెరికాలో రివాజుగా మారిపోయింది. అమెరికాలోకి దొంగచాటుగా  చొరబడే మెక్సికన్‌లు ఇలాంటి హత్యలకు పాల్పడుతుంటారు. అయితే అభిజిత్‌ను హత్య చేసింది కేవలం డబ్బుకోసమేనా  లేక యూనివర్సిటీలో  ఏమైనా ఇతర విద్యార్థులతో గొడవలు ఉన్నాయో తెలియలేదు. యూనివర్సిటీ క్యాంపస్‌లోనే హత్య జరగడం పలు అనుమానాలకు  తావిస్తోంది. గత నెలలోనే ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీలో నీల్ ఆచార్య అనే విద్యార్థిని దారుణ హత్యకు గురయ్యాడు. వెస్ట్ లఫాయెట్‌లోని 500 అల్లిసన్ రోడ్‌లో నీల్ ఆచార్య శవమై కనిపించాడు. అంతకు కొద్దిరోజుల క్రితమే జార్జియాలోని లిథోనియాలో మరో భారతీయ విద్యార్థి వివేక్ సైనీపై దాడి చేసి కొట్టడంతో అతను కన్నుమూశాడు. కొత్త ఏడాదిలోనే నలుగురు, ఐదుగురు భారతీయ విద్యార్థులు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
AP News: ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
AP News: ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Allu Arha - Allu Arjun: మనుచరిత్రలో పద్యం చెప్పిన అల్లు అర్హ ..ఆ పద్యానికి భావం, సందర్భం ఏంటో తెలుసా!
మనుచరిత్రలో పద్యం చెప్పిన అల్లు అర్హ ..ఆ పద్యానికి భావం, సందర్భం ఏంటో తెలుసా!
Unhappy Leave : మీరు హ్యాపీగా లేరా? అయితే లీవ్ తీసుకోండి.. ఒక రోజు కాదు పది రోజులు పెయిడ్ లీవ్, ఎక్కడంటే
మీరు హ్యాపీగా లేరా? అయితే లీవ్ తీసుకోండి.. ఒక రోజు కాదు పది రోజులు పెయిడ్ లీవ్, ఎక్కడంటే
Mahasena Rajesh: కూటమి ప్రభుత్వంలోనూ తప్పుడు కేసులు! మహాసేన రాజేష్‌ సంచలన వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వంలోనూ తప్పుడు కేసులు నమోదు! మహాసేన రాజేష్‌ సంచలన వ్యాఖ్యలు
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
Embed widget