Bengaluru: భార్యకి మద్యం తాగించి, నీలి చిత్రాలు చూయించి, సెల్ ఫోన్ లో రికార్డు - భర్త శాడిజం!
తనను బెదిరిస్తున్నాడని భర్త పై భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
భార్య భర్తలు అన్నాక కుటుంబంలో గొడవలు సహజం. వారిద్దరి మధ్య అభిప్రాయాలు కుదరక గొడవ పడటం జరుగుతూనే ఉంటాయి. ఇదే అలుసుగా తీసుకుని కొంత మంది భర్తలు.. భార్యల మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు. తానే ఇంటికి మహారాజులమని భావిస్తూ.. తాము చెప్పిందల్లా చేయాలని భార్యపై హుకుం జారీ చేస్తుంటారు. ఒక వేళ భార్య మాట వినకపోతే కొన్ని సార్లు హద్దు మీరి బెదిరింపులకు పాల్పడుతుంటారు. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత భర్త నిజ స్వరూపం బయట పడటంతో భార్య షాక్‌కు గురైంది. డబ్బుల విషయంలో భార్యపై బెదిరింపులకు దిగాడు ఓ ఘనుడు. తనకు కొంత నగదు కావాలని డిమాండ్ చేశాడు. తాను చెప్పినట్లు వినకపోతే తాను తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అని బెదిరింపులకు పాల్పడిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
భర్త తన భార్య పరువు తీయాలని అనుకోడు, ఆమెతో గడిపిన మధుర క్షణాలను , ఆమె తాలూకా ప్రవైట్ పిక్స్ ను బయటపెట్టాలని మరీ అనుకోరు కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి అదే చేశాడ. అంతే కాకుండా డబ్బుల కోసం బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. తనతో భార్య ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించిన ఘటనా తాజాగా వెలుగులికి వచ్చింది.
తన భర్త తనతో సన్నిహితంగా ఉంటూ... మద్యం తాగించి, అక్కడ కొన్ని నీలి చిత్రాలను చూపించి ఆ వివరాలని తన భర్త ఫోన్లో రికార్డు చేశాడని ఓ భార్య తన భర్త పై మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్లో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భార్య భర్తలు ఇద్దరికీ గతేడాది నవంబర్ లో వివాహం జరిగింది. వివాహం అనంతరం థాయిలాండ్ కు హనీమూన్ కు వెళ్లారు. అక్కడ తన భర్త తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్యంగా వీడియో తీసి దాన్ని చూపించి బెదిరింపులకు దిగుతున్నాడని భార్య వెల్లడించింది.
అంతటితో ఆగకుండా ఆ వీడియోని చూపించి కొంత నగదు ఇవ్వాలని తన భర్త డిమాండ్ చేస్తున్నాడని తెలిపింది. బెంగళూరుకు తిరిగి వచ్చిన తర్వాత తనకు 10 లక్షలు ఇవ్వాలని, ప్రతినెల తనకు వచ్చే జీతం మొత్తం తనకే ఇవ్వాలని ఉద్యోగం చేస్తున్న తనను బెదిరించాడట. తను అడిగిన నగదు ఇవ్వకపోతే వీడియోను, ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తనకు సొంత నిర్మాణ సంస్థ ఉందని పెళ్లికి ముందు చెప్పిన భర్త... నిజానికి అతడికి ఎలాంటి ఉద్యోగం లేదని వివాహం తర్వాత గుర్తించినట్లు ఆమె పోలీసులకు వివరించింది.
కఠినంగా శిక్షించాలని డిమాండ్
తమ కుమార్తెను బెదిరింపులకు పాల్పడిన భర్తను కఠినంగా శిక్షించాలని ఆమె తరపు తల్లిదండ్రులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. నమ్మి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తే ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. ఇలాంటి కీచకుడుని వదిలిపెట్టకుండా పోలీసులు తగిన గుణపాఠం చెప్పాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.