అన్వేషించండి

Crime News: ఏపీలో దారుణాలు - సెల్ ఫోన్ దొంగిలించారన్న అనుమానంతో దంపతులపై కొడవలితో దాడి, మరో చోట ప్రాణం మీదకు తెచ్చిన పందెం

Andhra News: ఏపీలో వేర్వేరు చోట్ల దారుణాలు జరిగాయి. ఓ చోట సెల్ ఫోన్ తీశారనే అనుమానంతో దంపతులపై ఓ వ్యక్తి కొడవలితో దాడి చేయగా..మరోచోట రూ.2 వేల కోసం ఓ యువకుడు నీటిలో గల్లంతయ్యాడు.

Attack On Couple With Machete In Annamayya District: ఏపీలో వేర్వేరు చోట్ల దారుణాలు చోటు చేసుకున్నాయి. సెల్ ఫోన్ దొంగిలించారనే అనుమానంతో దంపతులపై కొడవలితో దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. అటు, ఎన్టీఆర్ జిల్లాలో రూ.2 వేల పందెం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కుటుంబ కలహాలతో ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా (Annamayya District) మదనపల్లె మండలం చీకలబయలు పంచాయతీ, జోలపేటకు చెందిన నారాయణ, విజయమ్మ నివాసం ఉంటున్నారు. వీరి ఇంటి పక్కనే ఉంటున్న వసంత్ అనే వ్యక్తి సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. అయితే, ఆ దంపతులపై అనుమానం ఉన్న వసంత్ మంగళవారం ఉదయం నుంచి వారిని దూషించడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన నారాయణ, విజయమ్మ వసంత్‌ను నిలదీశారు.

కొడవలితో దాడి

దీంతో ఆగ్రహించిన వసంత్.. సెల్ ఫోన్ మీరే ఎత్తుకుపోయారంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి సహనం కోల్పోయిన వసంత్.. కొడవలితో నారాయణ, విజయమ్మపై దాడికి దిగాడు. ఈ ఘటనలో దంపతులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో బాధితులను కలిసి ఘటనపై ఆరా తీశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో..

మద్యం మత్తులో ఇద్దరు యువకులు వేసుకున్న పందెం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా (NTR District) నందిగామలో గోపీచంద్ అనే యువకుడు రూ.2 వేల కోసం వాగులో దూకి అదృశ్యమయ్యాడు. రోశయ్య అనే మరో యువకుడితో కలిసి పందెం కాశాడు. పందెంలో భాగంగా నందిగామ పెద్ద బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకి.. ఎవరు ముందు ఒడ్డుకు చేరితే వారు డబ్బులు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో మున్నేరు వాగులోకి ఇద్దరు యువకులు దూకగా.. రోశయ్య ఒడ్డుకు చేరాడు. కానీ, గోపీచంద్ అనే యువకుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గోపీచంద్ కోసం వెతికారు. ఎంతలా వెతికినా ఫలితం లేకపోయింది. మద్యం మత్తులోనే ఇలా చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భార్యను చంపేసిన భర్త

అటు, నెల్లూరు జిల్లాలో (Nellore District) దారుణం జరిగింది. సైదాపురం మండలం గంగదేవిపల్లిలో కుటుంబ కలహాలతో లావణ్య (29) అనే వివాహితను ఆమె భర్త మునేంద్ర దారుణంగా హతమార్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Prakasam News: ఆడిట్ అధికారిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి - దారి కాచి కళ్లల్లో కారం కొట్టి దారుణం, ప్రకాశం జిల్లాలో ఘటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, లైవ్  మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Hyderabad Rains Update : హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, లైవ్  మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Hyderabad Rains Update : హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Hyderabad Crime News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, మాయమాటలతో రప్పించి ఓయో రూములో ఇద్దరు బాలికలపై అత్యాచారం
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, మాయమాటలతో రప్పించి ఓయో రూములో ఇద్దరు బాలికలపై అత్యాచారం
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Embed widget