అన్వేషించండి

Attack on SI : దారుణం - మానవత్వం చూపిన ఎస్ఐపై పోలీస్ స్టేషన్ లోనే దాడి

Attack on SI : శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసుపై దాడి జరిగింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని రూరల్​ స్టేషన్​ ఎస్ఐ మహమ్మద్ రఫీపై దాడి కలకలం రేపుతోంది.

Attack on SI : ప్రజలకు అండగా నిలిచే పోలీసులపై దాడులు చేస్తున్నారు. శాంతి, భద్రతలను రక్షించే లక్ష్యంతో పని చేస్తోన్న వారిపై దారుణానికి పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు గ్రామీణ మఫ్టీలో ఉన్న ఎస్ఐ పై దాడి జరిగింది. డిసెంబర్ 29న జరిగిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. స్టేషన్ లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. స్టేషన్ లో మఫ్టీలో ఉన్న ఎస్ఐ మహమ్మద్ రఫీపై ఆదివారం అర్థరాత్రి రాజుపాళేనికి చెందిన లింగమయ్య, అతని బంధువులు దాడి చేశారు.

ఆ కోపంతోనే ఎస్ఐపై దాడి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,  రాజుపాళేనికి చెందిన చిన్న లింగమయ్య, హర్ష అనే ఇద్దరు యువకులు బైక్ పై బైపాస్ రోడ్డు దాటుతుండగా.. అంతలోనే ఆ మార్గంలో వచ్చిన కారును ఢీకొట్టింది. దీంతో కారులోని ప్రయాణికులు గాయపడ్డారు. అప్పుడే అటుగా వెళ్తున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ ఈ ప్రమాదం చూశాడు. గాయపడ్డ వారిని తమ పోలీసు జీపులోనే ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నాడు. ఈ క్రమంలోనే కారు డ్రైవర్ కడపలోని కొండాయపల్లెకు చెందిన వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదాల ఘటనలపై కేసు నమోదు చేయడం, కారణమైన వ్యక్తులకు నోటీసులు ఇచ్చి పంపించడం సాధారణంగా జరిగే ప్రక్రియ. అదే తరహాలో స్పందించిన ఎస్ఐ ఎప్పటిలాగే ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశాడు. కారు డ్రైవర్ వెంకటరెడ్డికి నోటీలు అందించి పంపించాడు.

నోటీసు ఇచ్చి పంపిస్తారా? అంటూ పోలీసులపై దాడి

ఈ ఘటనతో అసహనానికి గురైన చిన్న లింగమయ్య బంధువులు ప్రమాదానికి కారణమైన కారును ధ్వంసం చేశారు. దీంతో కారు అద్దాలు పగిలిపోయాయి. అంతటితో ఆగకుండా అయితే యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి నోటీసు ఇచ్చి పంపిస్తారా? అంటూ నేరుగా స్టేషన్ వద్దకు వెళ్లి తమ ప్రతాపం చూపించారు. ఠాణాలో విధుల్లో ఉన్న పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. ఆ సమయంలో ఎస్ఐ మహమ్మద్ రఫీ లేడు. అప్పటికే ఇంటికి పోయాడు. కానీ ఎంత నచ్చజెప్పినా వారు వినకపోవడంతో పోలీస్ సిబ్బంది ఎస్ఐకి సమాచారమందించారు. దీంతో వెంటనే మఫ్టీలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎస్ఐపై చిన్న లింగమయ్య అన్న లింగమయ్య ఎస్​ఐపై దాడికి పాల్పడ్డాడు.

అనంతరం లింగమయ్యతో పాటు శివ, ప్రవీణ్, రాము, మేరి, శాంతి మరికొందరు తన విధులకు ఆటకం కలిగించి దాడి చేశారని రెండో పట్టణ ఠాణాలో ఎస్ఐ ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై డీఎస్పీ భక్తవత్సలం గ్రామీణ ఠాణాకు చేరుకుని ఆరా తీశారు. ఎస్ఐతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు సీఐ యుగంధర్ వెల్లడించారు.

Also Read : Gudivada Amarnath: సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
New Year Gift Ideas: మ్యూచువల్ ఫండ్, షేర్లు లేదా గోల్డ్ బాండ్ - కొత్త సంవత్సరంలో ఏ బహుమతి ఇవ్వాలి?
మ్యూచువల్ ఫండ్, షేర్లు లేదా గోల్డ్ బాండ్ - కొత్త సంవత్సరంలో ఏ బహుమతి ఇవ్వాలి?
Hyderabad Traffic Restrictions : హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
Ind Vs Aus Test Series: సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
New Year Gift Ideas: మ్యూచువల్ ఫండ్, షేర్లు లేదా గోల్డ్ బాండ్ - కొత్త సంవత్సరంలో ఏ బహుమతి ఇవ్వాలి?
మ్యూచువల్ ఫండ్, షేర్లు లేదా గోల్డ్ బాండ్ - కొత్త సంవత్సరంలో ఏ బహుమతి ఇవ్వాలి?
Hyderabad Traffic Restrictions : హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
Ind Vs Aus Test Series: సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
Perni Nani Ration Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్
Perni Nani Ration Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్
Madanapalli News: మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక
మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక
New Rules: రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం, ప్రతి 10 కి.మీకు స్పీడ్ లిమిట్ సైన్ బోర్డులు
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం, ప్రతి 10 కి.మీకు స్పీడ్ లిమిట్ సైన్ బోర్డులు
Spadex : స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
స్పేడెక్స్ ప్రయోగం సక్సెస్ - నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ-60, నిర్ణీత కక్ష్యలోకి జంట ఉపగ్రహాలు
Embed widget