Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపూనకు జీవిత ఖైదు విధించిన గుజరాత్ కోర్ట్
గుజరాత్‌లోని గాంధీనగర్ కోర్టు అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాం బాపూని దోషిగా తేల్చింది. ఆశారాం బాపూనకు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది.
Asaram Bapu Sentenced Life Imprisonment: అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాం బాపూ ఇదివరకే దోషిగా తేల్చగా, తాజాగా గాంధీనగర్ సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఆశారాం బాపూనకు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2001 నుంచి 2006 వరకు అహ్మదాబాద్‌లోని మొతెరాలోని తన ఆశ్రమంలో ఉన్న సమయంలో తనపై పదే పదే అత్యాచారం చేశారని ఓ శిష్యురాలు ఆరోపించారు. సూరత్‌కు చెందిన ఆయన శిష్యురాలు 2013లో దాఖలు చేసిన అత్యాచారం కేసులో ఆశారాం బాపూని దోషిగా కోర్టు సోమవారం తేల్చింది. అయితే తీర్పు మంగళవారానికి రిజర్వ్ చేసింది గాంధీనగర్ సెషన్స్ కోర్టు. అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపూనకు జీవత ఖైదు విధిస్తూ కీలక తీర్పు వెలువడింది.
గుజరాత్‌లోని గాంధీనగర్ కోర్టు అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాం బాపూని దోషిగా తేల్చింది. తన అనుచరుల్లో ఇద్దరు అక్కా చెల్లెళ్లపై అత్యాచారం చేశారని 2013లోనే ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆశారాం. అప్పుడే గాంధీనగర్ సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధరించింది. ఈ కేసులో మొత్తం 7గురు నిందితులు కాగా...ఆశారాం బాపుని తప్ప మిగతా వారందరినీ ఇప్పటికే దోషులుగా తేల్చారు. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా...ఇన్నాళ్లు ఆశారాంను దోషిగా నిర్ధరించలేదు. ఈ ఆరుగురు దోషుల్లో ఆశారాం సతీమణి, కూతురు కూడా ఉన్నారు. సూరత్‌కు చెందిన ఓ మహిళను పదేపదే అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
Gandhinagar Sessions Court sentenced self-styled godman Asaram to life imprisonment in connection with a decade-old sexual assault case. pic.twitter.com/UgIdHOsuiq
— ANI (@ANI) January 31, 2023
ఆ తరవాత 2018లో జోధ్‌పూర్‌లోని ట్రయల్ కోర్ట్ దోషిగా తేల్చింది. అప్పటి నుంచి జోధ్‌పూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు ఆశారాం బాపూ. జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్టూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2013లో ఆగస్టులో ఇండోర్‌లో ఆశారాంను అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద దోషిగా తేల్చింది గాంధీనగర్ కోర్టు మంగళవారం యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేయనున్నారు.
మరో కేసులోనూ దోషిగా తేలిన ఆశారం బాపూ
ఆశారాంను కోర్టు దోషిగా నిర్ధారించడంతో ఆయనకు గరిష్టంగా జీవిత ఖైదు లేనిపక్షంలో కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష విధించాల్సి ఉంది. అయితే జోధ్‌పూర్‌లో ఇలాంటి మరో కేసులో ఆయన ఇప్పటికే దోషిగా తేలారని, అందుకే నేరాలు చేయడం అలవాటైన వ్యక్తి అని వాదనలు ముగిసిన తర్వాత లాయర్ కోడెకర్ కోర్టు వెలుపల మీడియాతో అన్నారు. ఆశారాంను సాధారణ నేరస్థుడిగా పరిగణించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
శిష్యురాలిగా ఉన్న యువతిని మొతెరాలోని తన ఆశ్రమంలో బంధించి ఆమెపై అత్యాచారం చేసినందుకుగానూ కఠిన శిక్ష విధించాలని కోర్టును కోరినట్లు చెప్పారు. బాధితురాలికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఆశారాం బాపూనకు భారీ జరిమానా విధించాలని ప్రాసిక్యూటర్ అన్నారు. జైలులో ఉన్న దేవుడికి పదేళ్ల జైలు శిక్ష విధించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని డిఫెన్స్ లాయర్ అన్నారు.