Subrahmanyam Death Case: ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి

Subrahmanyam Death Case: డ్రైవర్‌ సుబ్రమణ్యం మృతి కేసులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ప్రాథమిక విచారణ చేపట్టామన్నారు.

FOLLOW US: 

AP DGP Rajendranath Reddy says FIR filed against MLC Anantha Udaya Bhaskar driver Subrahmanyam Death Case
తిరుపతి : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రమణ్యం మృతి కేసుపై ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ పై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామని చెప్పారు. తిరుపతిలోని ఎస్వీ సెనెట్ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యం మెడికల్ రిపోర్టు వచ్చిన తరువాత పూర్తి స్ధాయిలో విచారణ జరుపుతామని అన్నారు. అయితే ప్రస్తుతం ప్రాథమిక విచారణ జరుపుతున్నామని, సాధ్యమైనంత త్వరగా కేసు విచారణను పూర్తి చేస్తామని వెల్లడించారు.

కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత దిశ, మహిళా పోలీసు స్టేషన్లను కొత్తవి ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలియజేశారు. గత మూడేళ్లలో నేరాలు సంఖ్య గణనీయంగా తగ్గిందని, కరోనా సమయంలో క్రైం రేటును ప్రామాణికంగా తీసుకోవడం లేదన్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. ముఖ్యంగా 2019-2022 మూడేళ్లలో, గత మూడు నెలలుగా నేరాలు, హత్యల సంఖ్య బాగా తగ్గిందన్నారు. రాత్రి సమయాల్లో పోలీసు సుబ్బందితో బీట్ నిర్వహించడంతో పాటుగా, నేర చరిత్ర కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాంమన్నారు.

రాష్ట్రంలో యాక్సిడెంట్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. ఇక పదోవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ తెలుగు పరీక్షలో మాల్ ప్రాక్టీసు జరగడం వాస్తవమేనని, ఈ కేసులో పూర్తి ఆధారాలు సేకరించిన తరువాతే నారాయణను అరెస్టు చేయడం జరిగిందన్నారు. నారాయణ కేసులో నిర్లక్ష్యం వహించిన ఏసీపీ సుజాత‌ను సస్పెండ్ చేశామని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సాగు జరగకుండా చర్యలు తీసుకోవడంమే కాకుండా, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.  

మల్కాన్ గిరి జిల్లా నుండి గంజాయి అక్రమ రవాణాను పూర్తి స్ధాయిలో నిరోధించినట్లు ఆయన తెలిపారు.. నిషేధిక వస్తువులు అక్రమ రవాణా చేస్తే చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకుంటాంమని, నేరాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.. చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని సరిహద్దుల్లో త్వరలో చెక్ పోస్టు ఏర్పాటు చేస్తాంమని తెలియజేశారు.. అంతే కాకుండా ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతినిత్యం వాహనాల తనిఖీ చేపడుతున్నట్లు ఏపి డిజిపి కాసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి వెల్లడించారు.

Also Read: Subrahmanyam Death Case: టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, సుబ్రహ్మణ్యం మృతి కేసులో కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత

Also Read: MLC Car Dead Body : వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ, కొట్టిచంపారని కుటుంబసభ్యుల ఆరోపణ

Published at : 21 May 2022 04:27 PM (IST) Tags: AP DGP Rajendranath Reddy MLC Anantha Udaya Bhaskar Subrahmanyam Death Case Kasireddy Rajendranath Kakinada

సంబంధిత కథనాలు

KPHB Techie Murder: అల్లుడి అంతం కోసం 4.5 లక్షలకు సుపారీ, హత్య తర్వాత దూరంగా ఎడమకాలు! వెలుగులోకి కీలక విషయాలు

KPHB Techie Murder: అల్లుడి అంతం కోసం 4.5 లక్షలకు సుపారీ, హత్య తర్వాత దూరంగా ఎడమకాలు! వెలుగులోకి కీలక విషయాలు

Matrimony Sites Cheating : మాట్రిమోని సైట్ లో అమ్మాయిలా ఫేక్ ప్రొఫైల్, లక్షల్లో సమర్పించుకున్న బాధితులు!

Matrimony Sites Cheating : మాట్రిమోని సైట్ లో అమ్మాయిలా ఫేక్ ప్రొఫైల్, లక్షల్లో సమర్పించుకున్న బాధితులు!

Shamshabad Accident : శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి

Shamshabad Accident : శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి

Nizamabad Bank Robbery : బ్యాంకులో జులాయి సినిమా సీన్ రిపీట్, రూ.3 కోట్ల సొమ్ము చోరీ!

Nizamabad Bank Robbery : బ్యాంకులో జులాయి సినిమా సీన్ రిపీట్, రూ.3 కోట్ల సొమ్ము చోరీ!

Raghu Rama House Reccy : ఎంపీ రఘురామ ఇంటి చుట్టూ రెక్కీ - ఒకరిని పట్టుకున్న సీఆర్పీఎఫ్ !

Raghu Rama House Reccy : ఎంపీ రఘురామ ఇంటి చుట్టూ రెక్కీ - ఒకరిని పట్టుకున్న సీఆర్పీఎఫ్ !

టాప్ స్టోరీస్

Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్

Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్

Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?

Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?

President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భార‌త‌ ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు

Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భార‌త‌ ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు