Meerpet Murder : మీర్ పేట మర్డర్ కేసులో మరో ట్విస్ట్ - హత్య చేసింది గురుమూర్తి ఒక్కడే కాదు - మరో ముగ్గురు నిందితులు
Meerpet Murder : మీర్ పేట మర్డర్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వెంకట మాధవిని భర్త గురుమూర్తి ఒక్కడే కాదు మరో ముగ్గురి సహకారంతో హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు.

Meerpet Murder : తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీర్ పేట మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వెంకట మాధవిను హత్య చేసింది కేవలం ఆమె భర్త గురుమూర్తి ఒక్కడే కాదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో గురుమూర్తితో పాటు మరో ముగ్గురి ప్రమేయం కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ మర్డర్ మిస్టరీలో గురుమూర్తికి ఇద్దరితో పాటు మరో ప్రమేళ కూడా సహకరించినట్టు పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్ పేట హత్యకు ముందు అసలేం జరిగింది, ఎందుకు తన భర్తే హత్యకు పాల్పడ్డాడు అన్న విషయానికొస్తే.. జనవరి 18వ తేదీన తన కూతురు వెంకట మాధవి తప్పిపోయిందని ఓ మహిళ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంకట మాధవి తన భర్త గురుమూర్తితో కలిసి జిల్లెలగూడ గ్రామంలో నివసిస్తోంది. అయితే జనవరి 16న వారిద్దరి మధ్య గొడవ కావడంతో ఎవరికీ ఏం చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. జనవరి 15న నిందితుడు గురుమూర్తి, వెంకట మాధవితో కలిసి ఇంట్లోకి వెళ్లాడు. కానీ ఆ తర్వాత మాధవి మళ్లీ బయటికి వచ్చినట్టు కనిపించలేదు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం గురుమూర్తి తన భార్యను ఇంట్లోనే హత్య చేసి ఉంటాడని అప్పట్లో పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ తర్వాత తీవ్ర విచారణ తర్వాత గురుమూర్తి చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. జనవరి 14న బడంగ్ పేటలోని తన అఖ్క సుజాత వాళ్ల ఇంట్లో సంక్రాంతి పండుగకు గురుమూర్తి తన భార్య, పిల్లలను వదిలి, మళ్లీ జిల్లెలగూడకు చేరుకున్నాడు. మరుసటి రోజు మళ్లీ బడంగ్ పేటలోని సోదరి ఇంటికి వెళ్లి వచ్చాడు. కానీ పిల్లల్ని అక్కడే ఉంచి వచ్చారు. జనవరి 16న ఉ.8 గంటలకు ఇద్దరి మధ్య గొడవ ముదిరి.. అది చివరికి మాధవిని హత్య చేసే వరకు వెళ్లింది. ఆమెను గట్టిగా కొట్టడంతో మాధవి తల గోడకు తగిలి కుప్పకూలింది. ఆ తర్వాత భార్య గొంతుకోసి చంపి, దాన్ని కప్పిపుచ్చాలనుకున్నాడు. శవాన్ని మాయం చేసేందుకు మాధవి ఇంటి నుంచి వెళ్లిపోయిందని అందర్నీ నమ్మించాడు.
ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి, వాటర్ హీటర్ తో వాటిని ఉడకబెట్టాడు. ఆ తర్వాత వాటిని గ్యాస్ స్టవ్ పై కాల్చాడు. అనంతరం స్టోన్ రోలర్ తో ఎముకలను నలిపి, టాయిలెట్ లో వేసి ప్లష్ చేశాడు. మిగిలిన ఎముకలను డస్ట్ బిన్ లో వేసి పడేయాలనుకున్నాడు. ఎవరికీ దుర్వాసన రాకుండా తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాడు. ఈ మొత్తం ప్రాసెస్ ను గురుమూర్తి ఉ.10 నుంచి సా.6 గంటల వరకు అంటే 8 గంటలు పట్టింది. ఆ తర్వాత బాత్రూమ్ ను శుభ్రంగా కడిగి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఇంత అమానవీయంగా భార్యను హత్య చేసినప్పటికీ గురుమూర్తిలో ఎలాంటి పశ్తాత్తాపం లేకపోవడం గమనార్హం. తల్లి కనిపించడం లేదని పిల్లలు అడిగితే ఎక్కడికో వెళ్లిందని చెప్పాడు. ఆమె గురించి తెలిస్తే ఎవరికైనా చెప్తారని వాళ్లను సోదరి ఇంట్లోనే ఉంచాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన పిల్లలు మరొకసారి తల్లి గురించి ఆరా తీయడంతో.. ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టాడు. ఆర్మీలో 15ఏళ్లు పని చేసిన గురుమూర్తి పక్కా ప్లాన్ ప్రకారం, భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడుపయోగించిన మొత్తం 16 వస్తువులను పోలీసులు సీజ్ చేశారు.
Also Read : Telangana Schemes: అభివృద్ధి దిశగా సాగుతోన్న తెలంగాణలో అమలవుతోన్న పథకాలివే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

