Anantapur Crime News : మూఢనమ్మకాలతో చిన్నారి కుమార్తె హత్య - ఇలాంటి నాన్న కూడా ఉంటాడా ?
Crime News : మూఢనమ్మకాలతో కన్న కూతుర్న హత్య చేసిన తండ్రి ఉదంతం అనంతపురంలో వెలుగు చూసింది. ఓ స్వామీజీ సలహాతో హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
Andhra Crime News : నాన్నంటే బిడ్డ కోసం సర్వం త్యాగం చేస్తాడు. కానీ ఈ నాన్న మాత్రం తనకు ఏదో రావాలని మూఢ నమ్మకాలతో దొంగ స్వామి చెప్పాడని కూతురి ప్రాణం తీశాడు. అనంతపురం జిల్లా నార్పలలో జరిగిన ఘటన కంట కన్నీరు పెట్టించేలా ఉంది.
అనంతపురం జిల్లా నార్పల మండలం కేంద్రంలోని నివాసముంటున్న ఈడిగ గణేష్ విడిగా అమల దంపతులు గత ఏడేళ్ల క్రితం పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కూతురు ఒక కొడుకు సంతానం. పెద్ద పాప పావని 6 సంవత్సరాలు. బుడిబుడి నడకతో ఆ చిన్నారి రోజు లాగానే ఉదయం స్కూల్ కి వెళ్ళింది. గురువారం సాయంత్రం నేను పావనిని స్కూల్ నుంచి ఆ పాపను బయటకు తీసుకువచ్చాడు తండ్రి గణేష్. సీన్ కట్ చేస్తే రెండు రోజుల తర్వాత పాప శవమై తేలింది. పాస్ మిస్ అయిందని గణేష్ కూడా హడావుడి చేశాడు.కానీ తర్వాత విచారణలో ఆయనే హత్య చేశాడని వెల్లడయింది.
అసలు ఏం జరిగింది..?
నార్పల మండల కేంద్రంలో నివాసం ఉంటున్న ఈడిగ గణేష్ దంపతులు గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. గణేష్ కుటుంబ బాధ్యతలు పట్టించుకోవడంలేదని తరచు ఇంట్లో గొడవ పడుతూ ఉండేవారు. కుటుంబ వ్యవహారాలన్నీ కూడా భార్య అమల నే చూసుకునేది. గణేష్ ఇతర చెడు వ్యసనాలకు బానిసగా మారిపోయాడు. తన భార్య మీద అనుమానంతో చిన్నారి పావని తనకు పుట్టలేదని అనుమానం పెంచుకున్న గణేష్ గురువారం సాయంత్రం స్కూలుకు వెళ్లి తన కూతుర్ని ఇంటికి తీసుకు వెళుతున్నానని స్కూలు యాజమాన్యానికి చెప్పి తీసుకువచ్చాడు. స్కూల్ నుంచి తీసుకువచ్చిన పావనిని అదే గ్రామంలోని ఓ పాడుబడ్డ బావి దగ్గరకు తీసుకెళ్లి విచక్షణ రహితంగా పాపని కొట్టి చంపాడు. చంపిన అనంతరం పాప మృతదేహాన్ని పడేసి ఏమి తెలియనట్టు ఇంటికి చేరుకున్నాడు. కూతురు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అమల తన భర్తను గట్టిగా నిలదీసింది. అయినప్పటికీ ఏమి చెప్పని గణేష్ ఏమీ తెలియనట్టుగా కూతుర్ని వెతికేందుకు బయలుదేరాడు. పాప ఎంతకీ కనిపించకపోవడంతో గణేష్ తన భార్య అమల ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ కూతురు పావని కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు.
రెండు రోజులుగా గాలించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు....
నార్పల మండల కేంద్రంలో చిన్నారి పావని మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. ముఖ్యంగా చిన్నారి మిస్సింగ్ ఘటనపై జిల్లా ఎస్పీ గౌతమి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. గ్రామస్తులతోపాటు పోలీసులు కూడా బృందాలుగా విడిపోయి పాపను గాలిస్తున్న సమయంలో పాప చంద్ర గణేష్ ఒక పాడు పడ్డ బావి వద్ద తగ్గాడుతూ తిరుగుతూ ఉండటం పోలీసులు గమనించారు. గణేష్ పై అనుమానం వచ్చిన పోలీసులు గణేష్ ను విచారించగా తన కూతురు పావనిని చంపివేసి ఈ బావిలోకే పడేశానని వెల్లడించాడు. పాపని వెతుకుతున్న సమయంలో నీటిలో నుంచి పాప మృతదేహం తేలుతుందేమో అని yబావి దగ్గర తిరుగుతున్నానని పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు బావిలో ఉన్న పావని మృతదేహాన్ని వెలికి తీశారు.
క్షుద్ర పూజుల నమ్మకాలతో చంపారని అనుమాానాలు
గణేష్ కు పూరి నిండా అప్పులు ఇతర చెడు వ్యసనాలు ఎక్కువగా ఉండేవి. పాపను అంతమొందించే మూడు రోజుల ముందు గణేష్ గ్రామంలో కనిపించలేదు ఆ సమయంలో గణేష్ ఒక పూజారి వద్దకు వెళ్లాడని జోరుగా చర్చ కొనసాగుతుంది. క్షుద్ర పూజలో భాగంగానే ఆ పూజారి చెప్పిన విధంగానే తన కూతుర్ని చంపేసి ఉంటాడని పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చిన్నారిని చంపిన గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పాపను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న కోణంలో విచారణ చేపట్టారు మరోవైపు మూడు రోజుల ముందు ఒక స్వామీజీని కలిసిన గణేష్ వ్యవహారం కూడా బయటకు రావడంతో ఆ స్వామీజీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.