News
News
X

Anakapalli News : లవర్ కోసం కత్తితో యువకుడు హల్ చల్, కాలేజీ బస్సును అడ్డగించి వీరంగం!

Anakapalli News : అనకాపల్లి జిల్లాలో ఓ యువకుడు కత్తితో హల్ చల్ చేశాడు. ఓ ప్రైవేట్ కాలేజీ బస్సును అడ్డుకున్న యువకుడు బస్సులో తన లవర్ ఉందని కిందకు దించాలని హల్చల్ చేశాడు.

FOLLOW US: 
Share:

Anakapalli News అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరంలో ఓ కాలేజీ బస్సును అడ్డుకున్న యువకుడు కత్తితో హల్చల్ చేశాడు.  కాలేజీ బస్సులో ఉన్న తన లవర్ ను కిందికి దించాలంటూ బస్సుకు బైక్ అడ్డంగా పెట్టి కత్తితో డ్రైవర్ ను బెదిరించారు. దీంతో డ్రైవర్ కసింకోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కసికోట మండలం తేగాడ గ్రామానికి చెందిన గడసాల శివ సాయి అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేసి డిమాండ్ కు తరలించారు. 

(నిందితుడు-శివసాయి) 

అసలేం జరిగింది? 
 
లవర్ కోసం బస్సును ఆపి ప్రియుడు హల్ చల్ చేశాడు. రోడ్డుకు అడ్డంగా బైక్ పెట్టి బస్సును అడ్డుకున్నాడు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరంలో ఓ ప్రైవేట్ కాలేజీ బస్సును లవర్ కోసం అడ్డుకుని యువకుడు కత్తితో హల్ చల్ చేశాడు. ఓ ప్రైవేట్ కాలేజీ బస్సులో ఉన్న తన లవర్‌ను కిందికి దించాలని బస్సుకు అడ్డంగా బైక్ పెట్టాడు.  కత్తితో డ్రైవర్‌ను బెదిరించి తన లవర్ ను బస్సు దించాలని వీరంగం సృష్టించాడు. దీంతో బస్సు డ్రైవర్ కసింకోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోలీసులు కసింకోట మండలం తేగాడ గ్రామానికి చెందిన గడసాల శివసాయి అనే యువకుడిని అరెస్టు చేశారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 05.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బయ్యవరం నుంచి తేగాడ వైపు వెళ్తోన్న కాలేజీ బస్సును యువకుడు తన స్కూటీపై వచ్చి అడ్డగించాడు. బస్సుకు అడ్డంగా స్కూటీ పెట్టి  బస్సులోంచి తన లవర్‌ను కిందకు దించమని డ్రైవర్ ను దుర్భాషలాడాడు. డ్రైవర్ మెడపై కత్తి పెట్టి హత్యాయత్నం చేయబోయాడు. దీంతో బస్ డ్రైవర్  కసింకోట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు 23వ తేదీ సాయంత్రం గడసాల శివ సాయి అనే యువకుడిని అరెస్టు చేశారు.  

ఐఫోన్ కోసం దారుణం 

కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐఫోన్ కోసం ఓ వ్యక్తి డెలవరీ బాయ్ నే హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని నాలుగు రోజులు బాత్ రూంలో దాచి పెట్టాడు. స్థానికంగా ఈ వార్త సంచలనం రేపింది. ఫిబ్రవరి 7వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘోర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

అసలేం జరిగిందంటే..?

కర్ణాటకలోని హసన్ జిల్లాకు చెందిన హేమంత్ దత్త అనే వ్యక్తి ఐఫోన్ కోసం అదిరిపోయే ప్లాన్ వేశాడు. తన దగ్గర ఫోన్ కొనేందుకు డబ్బులు లేకపోయినా ఆన్ లైన్ లో 46 వేల రూపాయల విలువ చేసే ఐఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్ పెట్టాడు. ఫిబ్రవరి 7వ తేదీన ఇ-కార్ట్ ఎక్స్ ప్రెస్ (ఫ్లిప్ కార్ట్ అనుబంధ సంస్థ)లోని డెలివరీ బాయ్.. ఐఫోన్ ను డెలివరీ చేసేందుకు వచ్చాడు. డబ్బులు ఇవ్వక ముందే సెల్ ఫోన్ డబ్బాను తెరిచి చూపించాలని హేమంత్ కోరగా.. డబ్బులు ఇస్తేనే ఫోన్ డెలివరీ చేస్తానని ఆ బాయ్ తేల్చి చెప్పాడు. దీంతో ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని.. కాసేపు ఇంట్లో కూర్చుంటే డబ్బులు తీసుకువస్తానని డెలవిరీ బాయ్ ను నమ్మించాడు. మాయ మాటలు చెప్పి లోపలికి తీసుకెళ్లాడు. ఆపై కత్తితో డెలివరీ బాయ్ పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సదరు డెలివరీ బాయ్ అక్కడికక్కడే ప్రమామాలు కోల్పోయాడు. 

విషయం గుర్తించిన హేమంత్.. మృతదేహాన్ని దాచి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే డెలివరీ బాయ్ శవాన్ని ఇంట్లోని బాత్రూంలో దాచి పెట్టాడు. ఆపై దుర్వాసన వస్తుండడంతో గోనె సంచిలో దాని బైక్ పై సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లాు. అక్కడ పెట్రోల్ పోసి మృతదేహానికి నిప్పంటించాడు. అయితే నాలుగు రోజులుగా డెలివరీ బాయ్ కనిపించకోపోవడంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడు హేమంత్ ను పట్టుకున్నారు. గట్టిగా విచారించగా.. అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఐఫోన్ కోసమే డెలివరీ బాయ్ ను హత్య చేశానని... మృతదేహాన్ని పెట్రోల్ పోసి అంటిచినట్లు వివరించాడు. అయతే హేమంత్ మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో కనిపించినట్లు పోలీసులు వివరించారు.

Published at : 24 Feb 2023 04:30 PM (IST) Tags: AP News Anakapalli lover knife college bus attack

సంబంధిత కథనాలు

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

Tirupati: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం, కారుతోసహా తగలబెట్టిన దుండగులు

Tirupati: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం, కారుతోసహా తగలబెట్టిన దుండగులు

TSPSC పేపర్ లీకేజీ కేసులో రేణుకకు షాక్ - ఆమె రిక్వెస్ట్ ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు

TSPSC పేపర్ లీకేజీ కేసులో రేణుకకు షాక్ - ఆమె రిక్వెస్ట్ ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు

Tirupati Crime : విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!

Tirupati Crime :  విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?