అన్వేషించండి

American Psycho : లవర్‌ని చంపి 7నెలలు ఇంట్లో దాచాడు.. అంతే కాదు ఆమె శరీరాన్ని కొద్దికొద్దిగా...

ప్రియురాలిని హత్య చేసి బేస్‌ మెంట్‌లో దాచిన ప్రియుడు ఏడు నెలల పాటు ఎవరికీ అనుమానం రాకుండా గడిపాడు. పోలీసులకు విషయం తెలిసి చూస్తే ప్రియురాలి శరీరం చాలా చోట్ల తీసేసినట్లుగా కనిపించింది.


ఓ కాలనీలో ఓ కుర్రాడు ఉంటాడు. అందగాడు. బుద్దిమంతుడు. అందరితో కలివిడిగా ఉంటాడు. అతనికో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. కానీ హఠాత్తుగా ఆమె కనిపించకుండా పోతుంది. కానీ ఇతగాడు మాత్రం మామూలుగానే ఉంటాడు. ఒంటరిగానే నివసిస్తూ ఉంటాడు. ఒక రోజు పోలీసులు  ఆ ఇంటినిచుట్టుముడతారు. సీన్ కట్ చేస్తే..  అత్యంత భయంకరమైన దృశ్యాలు కళ్ల ముందు కనిపిస్తాయి. మామూలు భయంకరం కాదు..  ఆ కుర్రాడ్ని చూస్తేనే దెయ్యం అని దడుచుకునేంత భయంకర దృశ్యాలు ఉంటాయి అక్కడ. ఇదేమీ సినిమా స్టోరీ కాదు. అమెరికాలో తాజాగా బయటపడిన ఓ సైకో స్టోరీ. 

సైకోలు ఎక్కడో ఉండరు. మన చుట్టూనే ఉంటారు. వారి నుదుటిపై సైకో అని ముద్రేమీ ఉండదు. బయటకు ఒకేలా కనిపిస్తూ ఉంటారు. కానీ వారు చేసిన పనులు చూస్తే ఒళ్ల గగుర్పొడుస్తుంది. సినిమాల్లో మాత్రమే కనిపించే క్రూర సైకోల గురించి తరచూ మాట్లాడుకుంటాం కానీ.. ఎదురు పడితే.. గుర్తించలేం వారు చేసే పనులు తెలిసేదాకా. అమెరికాలోని డెట్రాయిట్ సబర్బన్ ప్రాంతంలో మాధ్యూ అనే 37 ఏళ్ల వ్యక్తి నివసిస్తూ ఉంటాడు.  అతనికో గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇద్దరూ సహజీవనం చేస్తూ ఉంటారు. హఠాత్తుగా ఆమె కనిపించడం మానేసింది. కాలనీలో వాళ్లు మాధ్యూని అడిగితే..ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడు. కానీ రెండు రోజుల కిందట.. కాలనీలో వాళ్లంతా భయపడే ఘటన జరిగింది. 

పెద్ద ఎత్తున పోలీసు వాహనాలు మాధ్యూ ఇంటిని చుట్టుముట్టి సెర్చ్ చేశాయి. బేస్‌ మెంట్‌లో మాధ్యూ ప్రియురాలి మృతదేహాన్ని గుర్తించారు. అప్పటికే ఆమె కనిపించకుండా పోయి ఏడు నెలలు అవుతోంది. ఏడు నెలల నుంచి చనిపోయిన ప్రియురాలి మృతదేహాన్ని ఇంట్లోని బెస్మెంట్‌లోనే భద్ర పరిచాడు మాధ్యు. అలా భద్రపరిచి..ఆమెతో కలిసి జీవిస్తున్నాడని అనుకుంటే... అదో రకమైన సైకో ప్రేమ అనుకోవచ్చు. కానీ అక్కడ విషయం అది కాదు. ఆమె శరీరంలో చాలా భాగాలను అక్కడక్కడ కొరికినట్లు.. కట్ చేసినట్లుగా ఆధారాలు లభించాయి. ఆ బాడీ పార్టులేమయ్యాయో  పోలీసులు గుర్తించలేకపోయారు. వాటిని తిన్నాడా.. లేకపోతే.. ఇంకేమైనా చేశాడా అన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

మాధ్యూ మనసిక స్థితిని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడు చంపాడు.. ఎలా చంపాడు.. ఎందుకు చంపాడు.. శరీర భాగాలను కొద్ది కొద్దిగా ఏం చేస్తున్నాడు.. ఇలాంటి వివరాలన్నింటినీ బయటకు తీసుకున్నారు. అమెరికాలో విచారణలు వేగంగా జరుగుతాయి. దీనిపై విచారణ జరుగుతోంది. పూర్తి వివరాలు విచారణ పూర్తయిన తర్వాత వెల్లడించే అవకాశం ఉంది. అయితే మాధ్యూ చేసిన పని మాత్రం అమెరికన్లందరిలోనూ వణుకు పుట్టించింది. 

టాప్ హెడ్ లైన్స్

Case Filed On Veeramachaneni: వీఆర్‌కే డైట్ వీరమాచినేని రామకృష్ణపై కేసు నమోదు.. అనధికార వైద్య సలహాలు చేస్తున్నారని ఆరోపణలు!
వీఆర్‌కే డైట్ వీరమాచినేని రామకృష్ణపై కేసు నమోదు.. అనధికార వైద్య సలహాలు చేస్తున్నారని ఆరోపణలు!
Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. పెళ్లి పేరుతో నమ్మించి ఓయోలో యువతి హత్య
హైదరాబాద్‌లో దారుణం.. పెళ్లి పేరుతో నమ్మించి ఓయోలో యువతి హత్య
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Hyderabad Crime: 'దిశ' ఘటన ప్రదేశంలో మరో దారుణం.. మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం!
'దిశ' ఘటన ప్రదేశంలో మరో దారుణం.. మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం!

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shubman Gill Double Century: గిల్ ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ రికార్డు .. రోహిత్ సెంచ‌రీ.. ఇండియా రికార్డు ఛేజింగ్.. 406 ర‌న్స్ టార్గెట్ ఉఫ్ మ‌ని ఊదేసిన భార‌త్.. సిరీస్ సొంతం
గిల్ ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ రికార్డు .. రోహిత్ సెంచ‌రీ.. ఇండియా రికార్డు ఛేజింగ్.. 406 ర‌న్స్ టార్గెట్ ఉఫ్ మ‌ని ఊదేసిన భార‌త్.. సిరీస్ సొంతం
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత పూర్తి వివరాలు
CM Chandrababu: వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
Vijayasai Reddy: ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
Boyapati Srinu: బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
Embed widget