అన్వేషించండి

Crime News: భర్త దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం - అనంతరం విషాహారం పెట్టి చంపేసింది, ఎక్కడంటే?

UP Crime: యూపీలో దారుణం చోటు చేసుకుంది. భర్త కోసం రోజంతా ఉపవాసం ఉన్న మహిళ.. అతనిపై అనుమానంతో అనంతరం విషాహారం పెట్టి చంపేసింది. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

UP Woman Killed Her Husband By Poisoning Him: తన భర్త దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, క్షేమంగా ఉండాలని ఓ మహిళ రోజంతా ఉపవాసం చేసింది. అనంతరం తన భర్తపై అనుమానంతో అతనికి ఆహారంలో విషం పెట్టి చంపేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో (Uttarpradesh) ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌశాంబి జిల్లాలోని ఇస్మాయిల్‌పూర్ గ్రామానికి చెందిన సవిత అనే మహిళ తన భర్త శైలేష్ కుమార్ (32) ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం రోజంతా ఉపవాసం చేసింది. కర్వాచౌత్ సందర్భంగా మహిళలు తమ భర్తల క్షేమం కోసం ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు. సవిత సైతం అలానే చేసింది. శైలేష్ సైతం భార్య పూజల కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. అయితే, ఆదివారం రాత్రి ఉపవాస దీక్ష విరమించే సమయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం నెలకొంది.

ఆహారంలో విషం కలిపి..

అనంతరం ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అయితే, భర్తకు పెట్టిన భోజనంలో విషం కలపడంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. శైలేష్‌కు అతని భార్య ఆహారంలో విషం కలిపి హత్యకు పాల్పడిందని మృతుని బంధువులు ఆరోపించారు. ఘటన అనంతరం పరారైన భార్య సవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారించారు. తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని తట్టుకోలేకే అతనికి విషాహారం పెట్టినట్లు నిందితురాలు చెప్పిందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Also Read: Baba Balaknath : ప్రసాదం పేరుతో మత్తుమందిచ్చి రేప్ చేశాడు - బాబా బాలక్ నాథ్‌పై మహిళ ఆరోపణ - సీఎం ఆశలు పోయినట్లే !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget