అన్వేషించండి
ముంబైలో ఘోర ప్రమాదం. ఆరుగురు దుర్మరణం, 40 మందికి గాయాలు
ముంబైలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గోరేగావ్‌లోని 7 అంతస్తుల భవనంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ముంబైలో ఘోర ప్రమాదం. ఆరుగురు దుర్మరణం
ముంబైలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గోరేగావ్‌లోని 7 అంతస్తుల భవనంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. అగ్నిప్రమాదంలో మరణించిన ఆరుగురిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఇద్దరు మైనర్లు ఉన్నారు. ప్రమాదంలో 40 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో 12 మంది పురుషులు, 28 మంది మహిళలు, ఒక మైనర్ ఉన్నారు. క్షతగాత్రులను ముంబైలోని హెచ్‌బీటీ హాస్పిటల్ కూపర్ హాస్పిటల్ అనే రెండు ఆసుపత్రులకు తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్





















