అన్వేషించండి

Maoists Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, చలపతి భార్య సహా ముగ్గురు మావోయిస్టుల మృతి

Andhra Pradesh News : అల్లూరి జిల్లాలోని కొయ్యలగూడెం సమీపంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌‌లో ముగ్గురు మావోయిస్టుల మృతిచెందారు.

Encounter in Alluri District | అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఏలూరు రేంజ్ పరిధిలోని కొయ్యలగూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. జోనల్‌ కమిటీ సభ్యులు గాజర్ల రవి, అరుణ, మరో మావోయిస్టు ఉన్నారని సమాచారం. అరుణ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు చలపతి భార్య. ఆమె స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్. మాజీ ఎమ్మెల్యే కోలారీ సర్వేశ్వర రావుతో పాటు మరో ఎమ్మెల్యే హత్యలో మావోయిస్టు అరుణ పాల్గొందని ఆరోపణలున్నాయి.

కాల్పులు జరిగిన ప్రదేశంలో ఏకే 47 రైఫిల్స్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ తెల్లవారుజామున  కాల్పులు జరిగాయి. గత నెల రోజుల నుంచి భద్రతా బలగాలు ఛత్తీస్ గఢ్ అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటివరకూ జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందారు.


Maoists Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, చలపతి భార్య సహా ముగ్గురు మావోయిస్టుల మృతి

చనిపోయిన మావోయిస్టుల వివరాలు..

1) గాజర్ల ravi.... అలియాస్ ఉదయ్...
గణేష్ అలియాస్ బిరుసు....
తెలంగాణ భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామం చిట్యాల మండలం
25 లక్షలు రివార్డ్.....సెంట్రల్ కమిటీ, AOB స్పెషల్ జోనల్ mbar

2) వెంకట రవి లక్ష్మి చైతన్య (54), అలియాస్ అరుణ.... అలియాస్ రూపీ..
కరక వాణి పాలెం పెందుర్తి మండలం విశాఖ జిల్లా......
20 లక్షల రివార్డ్..
స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, Aob...మెంబర్..
ఈమె తమ్ముడు అజాత్ కొన్నేళ్ల క్రితం పాల సముద్రం ఎన్కౌంటర్ కాల్పుల్లో మృతి చెందాడు. ఈమె తల్లి మావి నేత, గతంలో మృతిచెందింది. మావో సీసీ మెంబర్ చలపతి ఈమె భర్త.... చంద్రబాబు అలిపిరి ఘటనలో కీలక వ్యక్తి. తరవాత శ్రీకాకుళం దగ్గరలో కాల్పుల్లో మృతిచెందాడు. విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే కోలారీ సర్వేశ్వర రావుతో పాటు మరో ఎమ్మెల్యే హత్యలో అరుణ పాల్గొంది.

లొంగిపోయిన నక్సలైట్ల కుటుంబసభ్యుల హత్య

వరంగల్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం కొందరు నక్సలైట్లు లొంగిపోయారు. నక్సలైట్ కుటుంబంలోని ముగ్గురిని చంపినట్లు సమాచారం. మరో కొంతమంది గ్రామస్తులను చితకబాది, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. 

ఈ సంఘటన నక్సల్స్ ప్రభావిత పెద్దకోర్మా గ్రామంలో జరిగింది. మంగళవారం (జూన్ 17న) సాయంత్రం 4 నుండి 5 గంటల మధ్య నక్సలైట్లు పెద్ద సంఖ్యలో వచ్చి అరాచకాలకు పాల్పడ్డారు. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన నక్సలైట్ దినేష్ మోడియం బంధువులు జింగు మోడియం, సోమ మోడియం, అనిల్ మాద్వి లను మావోయిస్టులు హతమార్చారని సమాచారం. 

ఈ గ్రామంలోని దాదాపు 7 మంది గ్రామస్తులను పిలిచి నిర్దాక్షిణ్యంగా కొట్టినట్లుగా వారి కుటుంబసభ్యులు తెలిపారు. గ్రామానికి పోలీసు బృందాన్ని పంపి సమాచారం సేకరిస్తున్నట్లు ASP చంద్రకాంత్ అన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల కుటుంబసభ్యులను హతమార్చిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Upcoming Cars in India: 3 కొత్త కార్లు లాంచ్ చేస్తున్న టయోటా.. హైలైట్‌గా 35 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ కారు!
3 కొత్త కార్లు లాంచ్ చేస్తున్న టయోటా.. హైలైట్‌గా 35 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ కారు!
Embed widget