అన్వేషించండి
Advertisement
Hyderabad Drugs: గచ్చిబౌలిలో కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం- మహిళతో పాటు 9 మంది అరెస్ట్
హైదరాబాద్ లో మరో డ్రగ్స్ గ్యాంగ్ ఆట కట్టించారు పోలీసులు. మహిళతో పాటు 9 మందిని అదుపులోకి తీసుకుని, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad Drugs Case: హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. గచ్చిబౌలిలో డ్రగ్స్ సమాచారంతో అక్కడికి వెళ్లి నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్ పరిధిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 10 గ్రాముల కొకైన్, 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ కేసులో మహిళతో పాటు మరో 9 మందిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల లావణ్య అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 4 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆమెకి రిమాండ్ విధించగా chanchal గూడ జైలుకు తరలించి విచారణ చేపట్టారు. ఆమెకి టాలీవుడ్ కి చెందిన వ్యక్తి ప్రియురాలు అని హాట్ టాపిక్ అయింది.
హైదరాబాద్ లో ఏపీ పోలీసుల అరెస్ట్
హైదరాబాద్‌లో ఇద్దరు ఏపీ కానిస్టేబుళ్లను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం బాచుపల్లిలో గంజాయి అమ్మడానికి యత్నిస్తున్న టైంలో పట్టుకొని అరెస్టు చేశారు. AP39 QH 1769 MARUTHI ECO వాహనంతో వారిని పట్టుకున్నారు. ఆ వెహికల్‌లో 22 కేజీల గంజాయి 11 పాకెట్స్‌లో దొరికిందని తెలిపారు పోలీసులు.
ఆ వాహనంలో ఉన్న వ్యక్తులను ప్రశ్నిస్తే... కాకినాడలోని 3rd బెటాలియన్ APSP చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ అని తేలింది. వీళ్లిద్దరు గంజాయి స్మగ్లింగ్‌లో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు అనే ఆశతో ఈ పని చేసినట్టు విచారణలో బయటపడింది
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion