అన్వేషించండి

Zero Interest EMIs: వడ్డీ లేని ఈఎంఐ ఆఫర్ అనగానే తొందరపడొద్దు.. వెనుక ఏం జరుగుతుందో తెలుసా ?

సున్నా వడ్డీ EMIలతో మీరు అదనపు వడ్డీ చెల్లించకుండా వస్తువులు కొనుగోలు చేసి నెలవారీ వాయిదాలలో చెల్లించవ్చు. అయితే, ఆ ధరలో కొన్నిసార్లు తెలియని ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు, GST ఉంటాయి.

Benefits of Zero Interest EMI: నేడు చాలా మంది డెబిట్ కార్డులతో క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ఈ రోజుల్లో షాపింగ్‌పై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, ఈఎంఐ EMI సౌకర్యం వంటి పలు ప్రయోజనాలు మీకు అందిస్తుంది. ముఖ్యంగా జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ (Zero-Interest EMI) ఫీచర్ మన వద్ద డబ్బులు లేకున్నా వస్తువులను సులభంగా కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నాం. దీని ద్వారా మీరు ఖరీదైన వస్తువులు కొన్నప్పటికీ ఒకేసారి కాకుండా చిన్న చిన్న వాయిదాలలో చెల్లించవచ్చు.

జీరో ఇంట్రెస్ట్ EMI అంటే ఏమిటి?
కొన్ని కంపెనీలు వినియోగదారులకు జీరో ఇంట్రెస్ట్ EMI అవకాశం కల్పిస్తున్నాయి. మీరు ఏదైనా వస్తువయ్యే ఖర్చు, బిల్లులను ఒకేసారి చెల్లించడానికి బదులుగా ఈఎంఐల రూపంలో వాయిదాలలో చెల్లిస్తారు. కానీ దానిపై మీరు విడిగా ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రక్రియనే జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ అంటారు. కొన్ని పాయింట్లు తెలుసుకుంటే మీకు ప్రయోజనం ఉంటుంది.

సాధారణంగా చూస్తే, EMI కాలపరిమితి 3 నెలల నుండి 24 నెలల వరకు ఉంటుంది.

రూ. 5 వేల కంటే ఎక్కువ కొనుగోలుపై EMI లభిస్తుంది.

అలాగే పెద్ద మొత్తాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించే సౌకర్యం ఉంటుంది.

నో కాస్ట్ EMI (No Cost EMI) ఎలా పనిచేస్తుంది?

సాధారణ EMIలో మీరు కచ్చితంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ జీరో ఇంట్రెస్ట్ EMIలో అలా ఉండదు.

బ్యాంక్ మీకు EMIలో చెల్లించే సౌకర్యాన్ని అందిస్తుంది

అలాగే సెల్లర్) ముందుగానే డిస్కౌంట్ ఇచ్చి వడ్డీని సర్దుబాటు చేస్తారు.

దీనివల్ల EMIపై అదనపు ఛార్జీలు లేవని కస్టమర్ భావిస్తారు.

నిజంగానే వడ్డీ లేని EMI ఉంటుందా?
వాస్తవం ఏంటంటే జీరో ఇంట్రెస్ట్ EMI అంతా భావించినట్లుగా పూర్తిగా ఉచితం కాదు.

కొన్నిసార్లు వస్తువు ధరను సెల్లర్స్ ముందుగానే పెంచుతారు.

ఇందులో వడ్డీ ఖర్చులను సైతం  ఆ ధరలోనే కలిపేస్తారు.

కొన్ని సందర్భాల్లో ప్రాసెసింగ్ ఫీజు కూడా పడుతుందని గుర్తుంచుకోవాలి.

అలాగే ఈఎంఐలపై సైతం GST చెల్లించాల్సి రావచ్చు.

దీనిని ఒక ఉదాహరణ చూస్తే మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక వస్తువు ధర రూ. 1 లక్ష అవుతుంది అనుకుందాం. దానిపై 6 నెలల వడ్డీ 6 వేల రూపాయలు అవుతుంది. బ్యాంక్ వడ్డీ వసూలు చేస్తుంది. కానీ ఆ సెల్లర్ ముందుగానే రూ. 6 వేల డిస్కౌంట్ ఇస్తాడు. ఇలా చేయడంతో కస్టమర్‌కు ఆ EMI వడ్డీ లేనట్లు అనిపిస్తుంది.

ఆ బ్యాకెండ్ ఖర్చుల నుండి ఎలా తప్పించుకోవాలి?

మొదట మీరు వేర్వేరు వెబ్‌సైట్లు, షాపుల్లో ధరలను పోల్చి చూడాలి.

అలాగే ఎక్కువ తగ్గింపును చూసి వెంటనే నమ్మవద్దు. 

వస్తువు అసలు ధర ఎంత ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

EMI తీసుకునే ముందు వీటిని తప్పక తెలుసుకోండి

ఫస్ట్ విషయం EMI టైమ్ పీరియడ్. 

తర్వాత ప్రాసెసింగ్ ఫీజు ఉందో లేదో చెక్ చేయాలి. 

లోన్ ముందుగానే చెల్లిస్తే (Foreclosure) ఏవైనా ఛార్జీలు ఉన్నాయా.

అలాగే అన్ని రూల్స్, కండీషన్స్ (Terms & Conditions) ఏమిటో చూడండి.

క్రెడిట్ కార్డ్‌ను ఎలా ఎంచుకోవాలి?
ఈ రోజుల్లో అనేక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విభిన్న జీరో-ఇంట్రెస్ట్ EMI కలిగిన క్రెడిట్ కార్డ్‌లను చూడవచ్చు.

100 శాతం డిజిటల్ అప్లికేషన్ ప్రాసెస్. 

చాలా కార్డులు లైఫ్‌టైమ్ ఫ్రీగా అందిస్తున్నారు. 

వేర్వేరు కంపెనీలతో భాగస్వామ్యంలో కూడా మీకు కొత్త ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu CII Partnership Summit: గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఏపీ - న్యూఢిల్లీ సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Elon Musk Starlink India Oligarchs: భారత్‌లో స్టార్‌లింక్‌కు అడ్డుకట్ట - ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు .. పేర్లు బయటపెట్టాలన్న కేటీఆర్!
భారత్‌లో స్టార్‌లింక్‌కు అడ్డుకట్ట - ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు .. పేర్లు బయటపెట్టాలన్న కేటీఆర్!
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget