అన్వేషించండి

Multibagger stock: ఈ కూల్‌డ్రిక్‌ షేర్లు చాలా హాట్‌ గురూ, ఏడాదిలోనే రెట్టింపు లాభం

US బయట 'పెప్సికో' (PepsiCo)కు ఉన్న అతి పెద్ద ఫ్రాంఛైజీల్లో ఇది ఒకటి.

Varun Beverages: వేసవి వస్తోందంటే ఏసీలు, కూలర్లు, బేవరేజెస్‌ స్టాక్స్‌ మార్కెట్‌ ఫోకస్‌లోకి వస్తాయి. ఈ కంపెనీలకు వేసవి కాలమే పీక్‌ సేల్స్‌ సీజన్‌. 

బేవరేజ్‌ స్టాక్‌ అయిన వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్‌ (VBL) గత 12 నెలల్లో (గత ఏడాది కాలం) 112% రాబడిని ఇచ్చి మల్టీబ్యాగర్‌గా మారింది. ఇదే కాలంలో బెంచ్‌మార్క్‌ నిఫ్టీ ఇచ్చిన రాబడి కేవలం 1.9%.

బేవరేజెస్‌ ఇండస్ట్రీలో VBL ఒక కీలక కంపెనీ. US బయట 'పెప్సికో' (PepsiCo)కు ఉన్న అతి పెద్ద ఫ్రాంఛైజీల్లో ఇది ఒకటి. బ్రోకరేజ్‌ షేర్‌ఖాన్ అంచనాల ప్రకారం ఈ స్టాక్‌కు ఇంకా 24% అప్‌సైడ్ పొటెన్షియల్‌ ఉంది. అయితే, ఇది మరింత పైకి ఎగబాకడానికి ఒక అడ్డంకి కూడా ఉంది.

నిన్న ‍‌(గురువారం), 2.65% లాభంతో రూ. 1,306 వద్ద ముగిసిన వరుణ్ బెవరేజెస్ షేర్లు, ఇవాళ (శుక్రవారం, మార్చి 17 2023) ఉదయం 10.45 గంటల సమయానికి దాదాపు ఫ్లాట్‌గా రూ. 1,301.65 వద్ద ఉన్నాయి.

వరుణ్ బెవరేజెస్‌కు బయ్‌ రేటింగ్స్‌
సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఎనలిస్ట్‌ నీలేష్‌ జైన్‌ ఈ స్టాక్‌కు రూ. 1380 ఇమ్మీడియెట్‌ టార్గెట్‌ ప్రైస్‌తో "బయ్‌" రేటింగ్‌ ఇచ్చారు. ఈ కౌంటర్‌ మరో 5% లాభాలను కళ్లజూడగలదని ఈ టార్గెట్‌ ధర అర్ధం. డిప్స్‌లో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని ఎనలిస్ట్‌ సూచించారు. దీనికి రూ.1,380 వద్ద ప్రతిఘటన (resistance) ఉంది.

షేర్‌ఖాన్‌ కూడా వరుణ్ బెవరేజెస్‌కు "బయ్‌" రేటింగ్‌ ఇచ్చింది. రాబోయే 12 నెలల్లో మరో 24% పెరుగుదలకు అవకాశం ఉందని వెల్లడించింది. 

నిలకడ ఉన్న స్టాక్‌
గత ఒక సంవత్సర కాల బీటా 0.69తో, తక్కువ అస్థిరతను ఈ స్టాక్‌ ప్రదర్శించింది. ఎక్కువ అస్థిరత ఉన్న స్టాక్స్‌తో (బీటా 1.0 కంటే ఎక్కువ ఉంటే) ఎక్కువ రిస్క్‌ ఉంటుంది. బీటా 1.0 కంటే తక్కువగా ఉంటే, వాటిని నిలకడ ఉన్న స్టాక్స్‌గా మార్కెట్‌ లెక్కిస్తుంది.

Trendlyne డేటా ప్రకారం... మొమెంటం సూచీలు RSI, MFI వరుసగా 59.1 & 65.9 వద్ద మధ్యస్థ పరిధిలో ఉన్నాయి. ఈ సంఖ్య 30 కంటే తక్కువగా ఉంటే, ఆ స్టాక్ 'ఓవర్‌సోల్డ్' ప్రాంతంలో ట్రేడ్ అవుతుందని భావిస్తారు. 70 కంటే ఎక్కువ ఉంటే అది 'ఓవర్‌బాట్' జోన్‌లో ఉందని భావిస్తారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో, ప్రస్తుత సీజన్‌లో (Q1 & Q2CY23లో) బలమైన రెండంకెల రాబడి, ఆదాయ వృద్ధిని పోస్ట్ చేయగలమని వరుణ్ బెవరేజెస్‌ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. కంపెనీ ఉత్పత్తుల్లో కీలకమైన కార్బోనేటేడ్ డ్రింక్స్/కొత్త ఉత్పత్తుల సామర్థ్యాన్ని దాదాపు 30% పెంచడం ద్వారా & పాల పానీయాల (dairy beverages)‍‌ వంటి కొత్త కేటగిరీల సామర్థ్యాలను మూడు రెట్లు పెంచడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడంపై మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టింది. మీడియం - దీర్ఘకాలంలో బలమైన ఆదాయ అవకాశాలను ఇది సృష్టించే అవకాశం ఉంది.

కీలక రిస్క్‌లు
సానుకూలతలతో పాటు కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఏదైనా కారణం వల్ల బేవరేజెస్‌ డిమాండ్‌ తగ్గినా, కార్బోనేటేడ్ డ్రింక్స్ విధానంలో మార్పు లేదా పన్నులు పెరిగినా కీలక ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభావం పడుతుంది. కీలక ముడి పదార్థాల ధరలు పెరిగినా కంపెనీ లాభదాయకత తగ్గే అవకాశం ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Health News: పవన్ కళ్యాణ్ ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంటే!
Pawan Kalyan Health News: పవన్ కళ్యాణ్ ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంటే!
CM Revanth Reddy :  ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌తో  పోల్చుకుని
ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌ తో పోల్చుకుని ...
Rana Naidu 2: ‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
Vivo Y200i: 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై200ఐ - ధర ఎంత ఉందంటే?
6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై200ఐ - ధర ఎంత ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Madhavi Latha vs Asaduddin Owaisi | బీఫ్ జిందాబాద్ అన్న ఓవైసీ... కౌంటర్ వేసిన మాధవిలత | ABP DesamIVF Cows at Tirumala | TTD | ఆవుల్లో అద్దె గర్భాలు.. ఎలాగో ఈ వీడియోలో తెలుసుకోండి | ABPBJP Madhavi Latha | ప్రచారంలో మాధవిలతకు ఝలక్.. వైరల్ వీడియో | ABP DesamGems Sikakulam Mdical College Studnets on AP Elections | 2024 ఎన్నికలపై స్టూడెంట్స్ మనోగతం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Health News: పవన్ కళ్యాణ్ ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంటే!
Pawan Kalyan Health News: పవన్ కళ్యాణ్ ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంటే!
CM Revanth Reddy :  ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌తో  పోల్చుకుని
ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌ తో పోల్చుకుని ...
Rana Naidu 2: ‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
Vivo Y200i: 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై200ఐ - ధర ఎంత ఉందంటే?
6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై200ఐ - ధర ఎంత ఉందంటే?
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
ITR 2024: ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేయాల్సిన విషయాలివి
ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేయాల్సిన విషయాలివి
Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Embed widget