Income Tax Notice: సామాన్యుడికి ఐటీ శాఖ భారీ షాక్... నోటీసులు చూసి లబోదిబోమన్న బాధితుడు, ఏం జరిగిందంటే!
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అతడిది. కానీ ఆదాయపు పన్ను శాఖ అతడికి భారీ షాకిచ్చింది. ఐటీ శాఖ నోటీసులతో కంగుతున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
సాధారణంగా డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు, అందుకు సంబంధించి కొన్ని రూల్స్ సైతం మనం పాటించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓ సామాన్యుడికి ఏకంగా కోట్ల రూపాయాలు పన్ను చెల్లించాలని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నోటీసులు పంపించడంతో కంగుతిన్నాడు. ఐటీ అధికారుల నోటీసులతో ఆందోళనకు గురైన ఆ వ్యక్తి ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు. ఆ వివరాలిలా ఉన్నాయి..
ఉత్తరప్రదేశ్ లోని మథురలో బకల్‌పూర్ ప్రాంతంలోని అమర్ కాలనీలో ప్రతాప్ సింగ్ నివాసం ఉంటున్నాడు. అతడు రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తన పని తాను చేసుకుంటూ ఉన్న ప్రతాప్ సింగ్‌కు ఐటీ శాఖ అధికారులు షాకిచ్చారు. రూ.3 కోట్లు చెల్లించాలని నోటీసులు సైతం జారీ చేశారు. నోటీసులలో విషయం తెలుసుకుని రిక్షా పుల్లర్ ఆందోళనకు గురయ్యాడు.
తనకు అన్యాయం జరిగిందని, ఆ సమస్య నుంచి తనను గట్టెక్కించాలని కోరుతూ హైవే పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనకు నోటీసులు పంపించారని, అందులో కోట్ల రూపాయలు తను బకాయి చెల్లించాలని ఉందని ఫిర్యాదు చేశాడు. దీనిపై స్టేషన్ ఆఫీసర్ అనుజ్ కుమార్ స్పందించారు. ప్రతాప్ సింగ్ నుంచి ఫిర్యాదు తీసుకున్నామని, అయితే కేసు నమోదు చేయలేదని తెలిపారు. పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించుకునేందుకు యత్నిస్తున్నారని చెప్పారు.
Also Read: న్యూడ్ కాల్స్ చేస్తే 25 వేల జీతం.. అలా చాట్ చేస్తే 15 వేలు.. ఆ జంట దందా బయటపడిందిలా
ప్రతాప్ సింగ్ వీడియో క్లిప్ వైరల్..
బాధితుడు ప్రతాప్ సింగ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను మార్చి 15న పాన్ కార్డ్ రిజిస్ట్రేషన్ కోసం బకల్‌పూర్‌లోని జన్ సువిధ కేంద్రానికి వెళ్లాడు. పాన్ కార్డ్ ఆఫీసులో ఉన్న తేజ్ ప్రకాష్ ఉపాధ్యాయ్ రిక్షా నడుపుతున్న ప్రతాప్ బ్యాంకు వివరాలు సమర్పించాలని చెప్పాడు.
బకల్‌పూర్ లోని సంజయ్ సింగ్ నుంచి పాన్ కార్డ్ కలర్ ఫొటో తనకు వచ్చిందని వీడియోలో తెలిపాడు. తనకు చదువు రాదని, ఆ కారణంతో ఒరిజనల్ పాన్ కార్డ్, కలర్ జిరాక్స్ పాన్ కార్డు వివరాలు పోల్చుకోలేకపోయాడు. అక్టోబర్ 19న ప్రతాప్ సింగ్‌కు ఐటీ శాఖ అధికారులు నోటీసులు పంపారు. రూ. 3 కోట్ల 47 లక్షల 54 వేల రూపాయాలు చెల్లించాల్సి ఉందని నోటీసులలో పేర్కొన్నారు.
Also Read: పెళ్లైన రెండు నెలలకే భార్యను అమ్మేసిన భర్త.. ఆమెకు ఏం చెప్పి అమ్మాడో తెలుసా!
రిక్షా నడుపుకునే వ్యక్తి ఐడెండిటీతో ఓ వ్యాపార వేత్త పాన్ కార్డ్ వివరాలు ఇచ్చారు. ప్రతాప్ సింగ్‌కు చదువు రాకపోవడంతో పాన్ కార్డ్ దుర్వినియోగం అయిందని గుర్తించలేకపోయాడు. జీఎస్టీ నెంబర్ పరిశీలిస్తే 2018-19 మధ్య కాలంలో రూ.43 కోట్ల 44 లక్షలకు పైగా వ్యాపారం చేసినట్లు ఉందని అధికారులు గుర్తించారు. బాధితుడికి న్యాయం జరిగేలా చేస్తామని స్టేషన్ ఆఫీసర్ అనుజ్ కుమార్ పేర్కొన్నారు.