అన్వేషించండి

Market Mood: తర్వలోనే మహా సంక్షోభం.. వార్నింగ్ బెల్, మ్యాటర్ ఏంటంటే?

Stock Markets: అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ పతనానికి దగ్గరగా ఉన్నట్లు ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ మేనేజర్ గ్రాంట్ కార్డోన్ హెచ్చరించారు. భారత పెట్టుబడిదారులు గమనించాల్సిన విషయాలు తెలుసుకుందాం.

Market Correction: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు అనేక కారణాలతో ఈవారం భారీ ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అయితే చాలా కాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లు తమ బుల్ ర్యాలీని కొనసాగించిన సంగతి తెలిసింద. అయితే ప్రస్తుతం ఈ బుల్ జోరు చివరి అంకానికి వచ్చినట్లు నిపుణుల అంచనాలు చెప్పకనే చెబుతున్నాయి. 

వాస్తవానికి భారత స్టాక్ మార్కెట్లు ప్రపంచ మార్కెట్లు ఆసియా, అమెరికా మార్కెట్లను చాలా సార్లు అనుకరిస్తాయమని మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక నివేదిక ప్రకారం భవిష్యత్తులో భారీ కుదుపుకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ మేనేజర్ గ్రాంట్ కార్డోన్ యూఎస్ మార్కెట్ విలువలను సగానికి తగ్గించారు. ఇది లక్షల మంది సేవింగ్స్, రిటైర్మెంట్‌పై ప్రభావం చూపే గణనీయమైన స్టాక్ మార్కెట్ కరెక్షన్ జరగొచ్చని అంచనా వేశారు.

వాస్తవానికి అమెరికా మార్కెట్లలో బెంచ్ మార్క్ సూచీ అయిన డౌ జోన్స్‌లో ఇటీవలి లాభాలు ఉన్నప్పటికీ.. S&P 500 ఇన్వర్టెడ్ ఈల్డ్ కర్వ్‌ను కార్డోన్ ఎత్తిచూపారు. ఇది చారిత్రాత్మకంగా ప్రధాన మార్కెట్ తిరోగమనాలకు రాబోయే ఉపద్రవాన్ని ముందుగా సూచించే సూచీగా ఉంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేట్లు నష్టాలను 75%కి దగ్గరగా ఉంచగలవని హెచ్చరించాడు. నేటి మార్కెట్ సూచికలు, గత ఆర్థిక సంక్షోభాలకు ముందు ఉన్న వాటి మధ్య సమాంతరాలను కలిగి ఉంది. వాస్తవానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపుదల ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో విఫలమైందని, హౌసింగ్ మార్కెట్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిందని కార్డోన్ విమర్శించారు. ఒకవేళ యూఎస్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపులు ప్రకటిస్తే ద్రవ్యోల్బణం పెరిగటం తిరిగి పునరుద్ధరించగలవని అన్నారు. 

ఈ క్రమంలో ఫైనాన్షియల్ గురు ఆర్థిక సంక్షోభం నుంచి రక్షణ పొందాలంటే ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లు, రిటైర్మెంట్ ఫండ్స్ నుంచి తమ డబ్బును రియల్ అసెట్స్‌లోకి మార్చాలని సూచించారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లోకి డబ్బును పార్క్ చేయాలని సూచించారు. అయితే అమెరికా మార్కెట్లు పతనమైతే ఖచ్చితంగా ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా తప్పక ఉంటుందని ఇండియన్ ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి.

భారతీయ ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
ప్రస్తుతం చాలా మంది భారతీయ ఇన్వెస్టర్లు కొన్ని బ్రోకరేజ్ సంస్థలు అందిస్తున్న ఫెసిలిటీ వినియోగించుకుని ఇక్కడి నుంచి అనేక యూఎస్ స్టాక్స్ లో తమ పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. అలాంటి పెట్టుబడిదారులు నేరుగా యూఎస్ మార్కెట్లలో పతనంతో భారీ నష్టాలు చవిచూడాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే క్రమంలో చాలా మంది పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా విదేశీ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెడుతున్నారు. వారు ఫారెన్ ఫండ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి వాటిలో అధిక లాభాల కోసం డబ్బును పార్క్ చేశారు. ఇలాంటి ఇన్వెస్టర్లు కార్డోన్ తాజా హెచ్చరికలతో తప్పక అప్రమత్తం కావాల్సి ఉంది. వారి విలువైన సొమ్ము లేదా పెట్టుబడులను అక్కడి నుంచి ఇతర సాధనాల్లోకి మార్చుకుని సురక్షితమైన రాబడులను అందించే చోట ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read: 8 ఏళ్లలో మీ డబ్బులు ట్రిపుల్‌- సావరీప్ గోల్డ్ బాండ్‌తో లైఫ్‌ బంగారమే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Embed widget